చిన్నారిని చంపేసింది చిరుత కాదా?, లక్షిత మృతి కేసులో ట్విస్ట్
ఎలుగుబంటి దాడిలో చిన్నారి లక్షిత చనిపోయినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామన్నారు టిటిడి డిఏఫ్ఓ శ్రీనివాసులు. పాప ఒక్కర్తే వెళ్లే సమయంలో దాడి జరిగినట్టు వివరించారు.
తిరుమల వెళ్లే నడక మార్గంలో మృత్యువుకు చిక్కిన చిన్నారి లక్షిత కేసులో అధికారులు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. పాపను చంపేసింది చిరుత కాదని ఎలుగుబంటి అని వివరించారు. పాపపై దాడి జరిగిన ప్రదేశం, గాయాలు చూస్తుంటే అదే అనుమానం బలపడుతోందని అన్నారు.
ఎలుగుబంటి దాడిలో చిన్నారి లక్షిత చనిపోయినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామన్నారు టిటిడి డిఏఫ్ఓ శ్రీనివాసులు. పాప ఒక్కర్తే వెళ్లే సమయంలో దాడి జరిగినట్టు వివరించారు. ఆ టైంలోనే పాపను ఎలుగుబంటి లాక్కెళ్లిపోయి ఉంటుందని అంటున్నారు.
చిన్నారి లక్షిత మెట్ల మార్గంలో కాకుండా కాస్త పక్కన నడుస్తోందని ఆ సమయంలోనే దాడి జరిగిందని శ్రీనివాసులు తెలిపారు. పాప మృతిదేహం లభించిన ప్లేస్‌లో ఆనవాళ్ళు చూసతే ఎలుగుబంటి దాడి చేసినట్టుగా అనుమానిస్తున్నామన్నారు.
రాత్రి ఆ ప్రాంతంలో ఏం జరిగిందో తెలియాలంటే సీసీ కెమెరాలు పరిశీలించాలని అంటున్నారు అధికారులు. ఆ విజువల్స్ చూడటంతోపాటు పోస్టుమార్టం రిపోర్టు వస్తే మరింత క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. అవి వచ్చే వరకు దేనిపై కూడా పూర్తిగా నిర్దారణకు రాలేమంటున్నారు.
అలిపిరి నడక మార్గంలో చిన్నారిపై చిరుత దాడి చేసిందని ఇప్పటి వరకు అంతా అనుకుంటున్నారు. ఆరేళ్ల లక్షితను అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. అక్కడే చంపేసిందని అనుమానపడ్డారు. తీవ్రంగా గాయపడిన లక్షిత మృతి చెందింది. తమ బిడ్డను కనిపించడం లేదని పోలీసులకు పాప తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. లక్షిత మృతి దేహం కోసం టిటిడి అటవీ శాఖ, విజిలెన్స్, పోలీసులు తీవ్రంగా గాలించారు.
అలిపిరి నడక మార్గంలో నరసింహ స్వామి ఆలయం వద్ద ఈ దాడి జరిగింది. రాత్రి తిరుమలకు వెళ్తున్న టైంలో పాపను కనిపించకుండా పోయింది. అయితే పాపా తప్పిపోయిందని అంతా అనుకున్నారు. తమతో వచ్చిన పాప కనిపించడం లేదని పోలీసులుకు లక్షిత ఫ్యామిలీ ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీక్రెట్‌గా విచారణ చేపట్టారు. రాత్రాంతా గాలింపు చర్యలు చేపట్టారు.
రాత్రంగా గాలింపు చర్యలు చేపట్టినా పోలీసులు, టీటీడీ సిబ్బంది పాప కనిపించలేదు. ఉదయం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయానికి వచ్చారు. అయితే కాలినడకన వెళ్తున్న భక్తులకు లక్షిత డెడ్‌బాడీ కనిపించింది. చాలా మంది ఆ దృశ్యాలను చూసి భయపడిపోయారు. వెంటనే కొందరు తిరుమల సిబ్బంది, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భక్తుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి డెడ్‌బాడీని పరిశీలించారు. ఫ్యామిలీ చెప్పిన ఆనవాళ్లు ఉండటంతో అది లక్షిత మృతదేహంగా గుర్తించారు. భక్తుల ద్వారా సమాచారం విషయం బయటకు వచ్చింది.
పాప మృతదేహాన్ని పాస్టుమార్టం కోసం రుయా ఆసుపత్రికి తరలించారు. పాప మృతితో ఆ ఫ్యామిలీ తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. తిరుమలేశుడి దర్శనానికి వస్తే పాప ప్రాణం పోయిందని బోరుమంటోందా ఫ్యామిలీ.