Roja on Pawan Kalyan: పవన్‌కి సీఎం అయ్యే ఛాన్స్ ఉంది: రోజా
RK Roja: తిరుపతిలోని జరిగిన వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ప్రారంభోత్సవానికి మంత్రి రోజా ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పై వ్యాఖ్యలు చేశారు.
Minister Roja Setires on Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆర్.కే.రోజా విరుచుకు పడ్డారు. ఇవాళ (జూన్ 7) మధ్యాహ్నం తిరుపతిలోని జరిగిన వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ప్రారంభోత్సవానికి మంత్రి రోజా ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా పథకం ప్రారంభోత్సవం చేసి ట్రాక్టరును నడిపి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. అనంతరం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ రీల్ హీరో గానీ రియల్ హీరో కాదని విమర్శించారు. రెండున్నర గంటల సినిమాల్లో పవన్ కళ్యాణ్ ప్రధాని మంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్ కూడా కావచ్చని, కానీ రియల్ లైఫ్ లో పవన్ ఎప్పటికి సీఎం కాలేదని ఆమె ఘాటుగా విమర్శించారు.
ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన పవన్ కళ్యాణ్, చంద్రబాబు కు ఏమాత్రం లేదన్నారు. ఏం చేయాలో ప్రజలకు స్పష్టంగా చెబితే ఎవరైనా సీఎం కావొచ్చని, పొత్తులు పెట్టుకున్నంత మాత్రాన వైసీపీని ఎవరూ ఏం చేయలేరని ఆమె మండిపడ్డారు. సింగల్ గానే ప్రజల్లోకి వైసీపీ వెళ్తుందని ఆమె తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 160 స్థానాల్లో వైసీపీ కైవసం చేసుకోనున్నట్లు మంత్రి ఆర్.కే.రోజా ధీమా వ్యక్తం చేశారు.
వైయస్ఆర్ యంత్ర సేవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. #YSRYantraSeva pic.twitter.com/yE4xyVhTe9
— Roja Selvamani (@RojaSelvamaniRK) June 7, 2022
వచ్చే ఎన్నికల్లోనూ పవన్ ఓటమి - రోజా
2019లో పవన్ కల్యాణ్‌ను రెండు చోట్ల ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. 2024లో కూడా అదే రిపీట్ అవుతుందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. బద్వేలుకి మించిన మెజారిటీ ఆత్మకూరులో వైఎస్సార్ సీపీకి వస్తుందని, టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటూ విమర్శించారు. దివంగత మంత్రి గౌతమ్ రెడ్డిపై నియోజకవర్గ వాసుల్లో చెక్కుచెదరని అభిమానం ఉందని అన్నారు. అలాగే సీఎం వైఎస్ జగన్ పాలనకు జనం నీరాజనాలు పడుతున్నారని చెప్పారు. ఈ రెండు అంశాలు మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయానికి మెట్లు కాబోతున్నాయని రోజా అన్నారు. అసలు ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి ఓటు బ్యాంకే లేదని రోజా ఎద్దేవా చేశారు.
అసలు ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి ఓటు బ్యాంకే లేదని రోజా ఎద్దేవా చేశారు. జనసేన పార్టీని ప్రజలు గెలిపించే ప్రసక్తే లేదన్నారు. 175 స్థానాల్లో పోటీ చేయకుండానే పవన్ సీఎం ఎలా అవుతారని ప్రశ్నించారు. పవన్ పోరాటం ప్రజల కోసం కాదని, పొత్తుల కోసమేనని ఎద్దేవా చేశారు.