Kuppam News: కుప్పంలో వైసీపీకి షాక్! మంత్రి పెద్దిరెడ్డిని అడ్డుకొని కడిగేసిన సొంత పార్టీనేతలు
పెద్దిరెడ్డి కాన్వాయ్ ని అడ్డుకున్న సొంత పార్టీ నేతలుఅధికార పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడుతున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంమైన కుప్పం నియోజకవర్గంలో వైసీపికి భారీ షాక్ తగిలింది.. శాంతిపురం మండలం పరిధిలోని మోరసనపల్లె వద్ద వారపు సంత జరిగే రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపి మండల కన్వీనర్ బుల్లెట్ దండపాణి కబ్జా చేశారు.. అయితే ఇదే విషయాన్ని ఎమ్మెల్సీ భరత్ దృష్టికి తీసుకెళ్ళారు.. కానీ ఎమ్మెల్సీ భరత్ పట్టించుకోక పోవడంతో చేసేది లేక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుడిపల్లె మండలంలో ఓ ఆలయం కుంభాభిషేకానికి హాజరు అవుతున్న మంత్రి వాహనాన్ని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు.
దీంతో స్ధానిక పంచాయతీ సర్పంచ్ జగదీష్ భార్యపై రాళ్ళబాదుకూరు ఎస్సై మునిస్వామి దురుసుగా ప్రవర్తించారు.. దీంతో మంత్రి కాన్వాయ్ ముందుకు వెళ్ళకుండా కుప్పం - పలమనేరు జాతీయ రహదారిపై మోరసనపల్లె సర్పంచ్ జగదీష్, గ్రామస్తులు రోడ్డుపై బైటాయించి నిరసనకు దిగారు.. కాన్వాయ్ దిగి గ్రామస్తుల వద్దకు వచ్చిన మంత్రిని సొంత పార్టీ నేతలే.. భూకబ్జా చేశారంటూ నిలదీయడంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుతిరిగారు..
మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేసేందుకు 5 గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధపడ్డారు.. శాంతిపురం మండల ప్రధాన నాయకుడు అరాచకాలను భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.. ఇంతకుముందే తమ సమస్యను నియోజకవర్గ నాయకుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో మంత్రి పెద్దిరెడ్డి తేల్చుకునేందుకు 5 గ్రామాల వైసీపీ కార్యకర్తలు సిద్దం అయ్యారు..
ఎమ్మెల్సీ భరత్ వద్దకు ఈ సమస్య తీసుకెళ్లిన మొదట సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఇప్పటివరకు పట్టించుకోకపోగా అక్రమార్కులకే వత్తాసు పలుకుతున్నారని సొంత పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మా పంచాయితీ ప్రజలకి ఈ స్థలాన్ని కేటాయించకపోతే ప్రజల మాటకు కట్టుబడి మోరసనపల్లి సర్పంచ్ జగదీశ్, ఎంపీటీసీ అర్ముగం, వైస్ సర్పంచ్ బసవరాజు, 9 మంది వార్డు సభ్యులతో పాటు పార్టీ నాయకులు కూడా భారీగా రాజీనామాలకు సిద్దమని హెచ్చరించారు.