(Source: ECI/ABP News/ABP Majha)
Padmavathi Ammavaru: వైభవంగా పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం సారె ఊరేగింపు
తిరుచానూరు పద్మావతి అమ్మవారికి తిరుమల శ్రీవారి ఆలయం నుండి సారె తీసుకెళ్లారు.. అమ్మవారికి సారె తరలింపు అనాదిగా కొనసాగుతుంది.
తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనుంది.. పంచమీ సందర్భంగా అమ్మవారి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా జరుగుతుంది.. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరుని పట్టపుదేవేరి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు పంచమీ తీర్థం(చక్రస్నానం) అశేష భక్తజనవాహిని మధ్య రంగరంగ వైభవంగా జరుగుతుంది.
తిరుచానూరు పద్మావతి అమ్మవారికి తిరుమల శ్రీవారి ఆలయం నుండి సారె తీసుకెళ్లారు.. అమ్మవారికి సారె తరలింపు అనాదిగా కొనసాగుతుంది.. వేకువజామున శ్రీవారి ఆలయంలో సారెను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. పసుపు, కుంకుమ, గాజులు, పట్టువస్ర్తాలు, శ్రీవారి ప్రసాదాలు ఆలయం చుట్టు ప్రదక్షిణ వచ్చారు.. నడక మార్గంలో పాదయాత్ర ద్వారా సారె తీసుకెళ్లారు.. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషం గా పాల్గొని కర్పూర నీరాజనాలు పట్టారు.. గజరాజులు ముందు వెళ్తుండగా, బాజభజంత్రీలు, మేళతాళాల మధ్య సారె ఊరేగింపు జరుగుతుంది.. ఉదయం 6.30 గంటల నుండి 8 గంటల వరకు పద్మావతి అమ్మవారు పల్లకీలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు.. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీ తీర్థ మండపానికి వేంచేపు చేశారు.. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 11 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది.. పంచమీ తీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు..
శ్రీవారి ఆలయంలో ఇలా
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో భాగంగా సోమవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిమి స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.
సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టిటిడి. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతిర "సోమవారం" రోజు నిర్వహించే "చతుర్ధశ కలశ విశేష పూజ" ను టిటిడి రద్దు చేసింది. ఉత్సవమూర్తుల విగ్రహాలు పరిరక్షణలో భాగంగా టిటిడి రద్దు చేసింది. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించారు. అటుతరువాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహిస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు. ఈ కైంకర్యాల్లో భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం ,ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.