By: ABP Desam | Updated at : 11 Mar 2023 01:08 PM (IST)
కిరణ్ కుమార్ రెడ్డి(File Photo)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీలోకి చేరోబుతన్నట్టు సమాచారం. 2014ను ఆయన రాజకీయ అజ్ఞాతంలో ఉన్నారు. ఎలాంటి రాజకీయా కామెంట్స్ కానీ, రాజకీయాలపై అభిప్రాయాలు కాని చెప్పడం లేదు. ఉమ్మడి ఏపీకి చివరి సీఎంగా పని చేసిన ఆయన విభజన సమయంలో సమైక్యవాదాన్ని ఎత్తుకున్నారు. తర్వాత జరిగిన కీలక పరిణామాలతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
ఎన్నికలకు ఏడాదికిపైగానే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు అప్పుడే రాజుకుంటున్నాయి. ఇప్పటికే వ్యూహప్రతివ్యూహాలతో తెలుగుదేశం, వైసీపీ ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేస్తుంటే ఇప్పుడు బీజేపీ కూడా ఎత్తుగడలు వేస్తోంది. ప్రజల్లో ఉండేలా కార్నర్ మీటింగ్స్, ప్రజాసమస్యలపై పోరాటాల పేరుతో ఆ పార్టీ నేతలు చేస్తున్న పోరాటాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని చెబుతున్నారు. అయినా అందుకు సరిపడా బలం మాత్రం కనిపించడం లేదు.
అందుకే ఏపీలో బలోపేతం అయ్యేలా పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించేలా వ్యూహాలను బీజేపీ రచిస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చోకోవాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఆయన కూడా దీనికి అంగీకరించారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్‌షాతో భేటీీ అనంతరం ఎప్పుడు బీజేపీలో చేరబోతున్నారనేదానిపై క్లారిటీ వస్తుందని సన్నిహితులు చెబుతున్నారు.
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శనివారం సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. ఆదివారంలో ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్‌రెడ్డి ఆయనతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. ఆయన బీజేపీలో చేరికపై ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగిపోయాయని.. ఇప్పుడు ఫైనల్‌గా అమిత్‌షాతో మాట్లాడబోతున్నారని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో సమైక్యవాదాన్ని ఎత్తుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌కు పెద్ద షాకే ఇచ్చారు. ఓ ముఖ్యమంత్రిగా ఉంటూనే ఆయన ఎదురు తిరగడం అప్పట్లో పెను సంచలనమైంది. సమైక్యవాదానికి అనుకూలంగా ప్రెస్‌మీట్‌లు పెట్టిమారీ విభజనకతో కలిగే నష్టాలు వివరించారు. దీంతో ప్రభుత్వమే రెండు వర్గాలుగా చీలిపోయింది. అయినా వెనక్కి తగ్గకుండా ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టారు.
సీఎంగా కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పిన మాటలను అధిష్ఠానం పెద్దగా పట్టించుకోలేదు. రాష్ట్రాన్ని విభజించేసింది. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి సమైక్యాంధ్ర పేరుతో పార్టీ పెట్టారు. చెప్పు గుర్తుపై పోటీ చేసి 2014 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు.
తర్వాత ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోయింది. మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ లో చేరినా ఎప్పుడూ యాక్టివ్‌గా కనిపించలేదు కిరణ్‌కుమార్‌రెడ్డి. జాతీయ స్థాయిలో బాధ్యతలు ఇవ్వలేదు. ఏపీలో కీలక బాధ్యతలు ఇచ్చేందుకు అధిష్ఠానం చర్చలు జరిపినా ఆయన ఆసక్తి చూపలేదన్నది కాంగ్రెస్ నేతలు చెప్పే మాట. ఇప్పుడు ఏపీ సహా దేశంలో కాంగ్రెస్ ఉన్న పరిస్థితిలో అక్కడ ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని గ్రహించిన కిరణ్ కుమార్ పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ ఎప్పటి నుంచో ఊహాగానాలు నడుస్తున్నాయి. ఓసారి టీడీపీ అని మరోసారి వైసీపీ అని ఇలా రకరకాలుగా ప్రచారం జరిగింది. ఆయన మాత్రం ఎక్కడా ఆ విషయాలపై రియాక్ట్ కాలేదు. తన అభిప్రాయాన్ని చెప్పలేదు. ఈ మధ్య ఓ టాక్‌షోలో పాల్గొన్నప్పటికీ రాజకీయాలపై ఏం మాట్లాడలేదు. అమరావతిపై మాత్రం రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆయన చూపు బీజేపీపై పడిందని టాక్ నడుస్తోంది.
బీజేపీ, కిరణ్ కుమార్ రెడ్డి మధ్య ఎప్పటి నుంచో చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. గతంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్‌షాతో కలిసినట్టు సమాచారం. ఇప్పటికే సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీన వీడన వేళ కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తి పార్టీలోకి వస్తే బ్యాలెన్స్ అవుతుందన్నది బీజేపీ నాయకత్వం వ్యూహంగా ఉంది. రాయలసీమలో కూడా ఈయనతో బీజేపీ గెయిన్ కావచ్చని తెలుస్తోంది.
కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరితే కీలక బాధ్యతలు అప్పగించాలని అధినాయక్వతం భావిస్తోంది. అమిత్‌షాతో చర్చలు సఫలమై పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి చేరితే దక్షిణాది పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
AP Inter Exams: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!
తిరుమల శ్రీనివాసుడికి మంగళవారం ఏ ప్రసాదాలు నివేదిస్తారో తెలుసా?
APPSC Group 4 Hall Tickets: ఏపీపీఎస్సీ-గ్రూప్ 4 హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
APPECET - 2023: ఏపీ పీఈసెట్ – 2023 దరఖాస్తు ప్రక్రియ, ఫిజికల్ ఈవెంట్లు ఎప్పడంటే?
Tirupati Temple Fined : టీటీడీకి ఆర్బీఐ షాక్, రూ.4.31 కోట్ల జరిమానా!
Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్
Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్
Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్
MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్ భాషలో ఛాటింగ్!