CM Jagan News: తిరుపతిలో శ్రీసిటీ ఎండీ కుమార్తె రిసెప్షన్ - హాజరైన సీఎం జగన్
సాయంత్రం 4.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి స్థానిక తాజ్ హోటల్ లో జరిగిన శ్రీసిటి ఎండీ రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరైయ్యారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతిలోని తాజ్ హోటల్ లో జరిగిన శ్రీసిటి ఎండీ రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరైయ్యారు. బుధవారం (డిసెంబర్ 13) సాయంత్రం వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు.. బుధవారం సాయంత్రం 4.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి స్థానిక తాజ్ హోటల్ లో జరిగిన శ్రీసిటి ఎండీ రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరై వధువు నిరీష, వరుడు సాగర్ లకు శుభాకాంక్షలు తెలిపారు. వారిని ఆశీర్వదించి 5.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని తిరుగు పయనం అయ్యారు.
రేణిగుంట విమానాశ్రయం వద్ద ముఖ్యమంత్రికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇంఛార్జి మంత్రి కళత్తూరు నారాయణ స్వామి, రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ఆర్కె రోజా, తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి తదితరులు వీడ్కోలు పలికారు.