Chittoor: ఆస్పత్రి బాత్రూంలో బిడ్డను కన్న యువతి - శిశువును అక్కడే వదిలేసి యువకుడితో పరార్!
ఓ యువతి ఆసుపత్రిలోని బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చి బిడ్డను బాత్రూంలో వదిలి వెళ్లిపోయిన ఘటన కలకలం రేపుతోంది..
![Chittoor: ఆస్పత్రి బాత్రూంలో బిడ్డను కన్న యువతి - శిశువును అక్కడే వదిలేసి యువకుడితో పరార్! Chittoor woman gives birth to baby in wash room of govt hospital and escapes after delivery Chittoor: ఆస్పత్రి బాత్రూంలో బిడ్డను కన్న యువతి - శిశువును అక్కడే వదిలేసి యువకుడితో పరార్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/16/bd41a1ef76fb6f4c812099743ecea6381692159314877234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో హృదయవిదారకమైన ఘటన చోటు చేసుకుంది. కడుపు నొప్పి అంటూ ఆసుపత్రికి వచ్చిన ఓ యువతి ఆసుపత్రిలోని బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చి బిడ్డను బాత్రూంలో వదిలి వెళ్లిపోయిన ఘటన కలకలం రేపుతోంది. రోగుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న డాక్టర్లు సంఘటన స్థలానికి చేరుకుని బిడ్డను వెంటిలేటర్ పై ఉంచి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎవరైనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే డాక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ ఉదయం 3 గంటల ప్రాంతంలో కడుపు నొప్పి అంటూ 19 ఏళ్ల యువతి ఓ యువకుడు ఆసుపత్రికి రావడం జరిగిందని, అయితే ఆ యువతపై అనుమానం వచ్చి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుని రావాలని పక్కనే ల్యాబ్ ఉన్న ఓ భవనానికి పంపడం జరిగిందని చెప్పారు. అయితే, పరీక్ష చేయించుకోకుండా ఆ యువతి, యువకులు ఆసుపత్రిలోని బాత్రూంలోకి వెళ్లి ఓ బిడ్డకు జన్మనిచ్చి ఆసుపత్రి నుండి పరార్ అయినట్లు చెప్పారు. రోగుల సమాచారంతో విషయం తెలుసుకుని బిడ్డ కు వైద్యం అందిస్తున్నామని, ప్రస్తుతం శిశువు సురక్షితంగా ఆరోగ్యకరంగా ఉందని డాక్టర్ చెప్పారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)