అన్వేషించండి

Home Guards Suspension: ఏపీలో 87 మంది హోంగార్డులపై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీ

2014-2019 సంవత్సరాల మధ్య కాలంలో చిత్తూరు జిల్లాలో నకిలీ డి.ఓ లు సృష్టించి 87 మంది హోంగార్డులుగా చేరి విధులు నిర్వహిస్తున్నారన్న సమాచారంపై విచారణ జరిపి ఉద్యోగం నుంచి తొలగిస్తూ జీవో జారీ చేశారు.

Home Guards Suspension In AP:  - నకిలీ డి.ఓలతో చేరిన 87 మంది హోంగార్డులపై డిఐజీ‌ సిరియస్..
- హోంగార్డు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ..

చిత్తూరు జిల్లాలో నకిలీ డి.ఓ లతో 87 మంది హోంగార్డులుగా చేరడంపై అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ సీరియస్ అయ్యారు.. 2014-2019 సంవత్సరాల మధ్య కాలంలో చిత్తూరు జిల్లాలో నకిలీ డి.ఓ లు సృష్టించి 87 మంది హోంగార్డులుగా చేరి విధులు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ వై.రిషాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్తీ స్థాయి విచారణ జరుగుతుంది.. ఈ కేసులో  కొంతమంది వ్యక్తులు నకిలీ డి.ఓ లు సృష్టించి ఈ 87 మందిని హోంగార్డులుగా చేర్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడింది.. ఈ తతంగంలో కొందరు డబ్బులు తీసుకుని కీలక పాత్ర పోషించినట్లు ప్రాథమిక సమాచారం.. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
ఇందులో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల వివరాలు, ఈ తతంగం ఎలా కొనసాగిందనే కోణంలో కూలంకుషంగా దర్యాప్తు చేయాలని డి.ఐ.జి చిత్తూరు ఎస్పీని ఆదేశించినట్లు తెలుస్తొంది.. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై Cr.No.185/2022, u/s 420,419, 409, 468, 471 r/w 120(B) IPC సెక్షన్ల క్రింద క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు, తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు.. అక్రమంగా హోంగార్డులుగా చేరిన ఈ 87 మందిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ చిత్తూరు ఎస్పి రిశాంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి అసలు విషయాలు బయటికి తీయాలని చిత్తూరు జిల్లా ఎస్పీ వైరిషాంత్ రెడ్డిని డి.ఐ.జీ ఆదేశించారు.  

క్లూ వదలకుండా దొంగతనం చేయడం వారి స్టైల్ - కానీ వారినీ పట్టేయడం చిత్తూరు పోలీసుల స్పెషాలిటీ ! 
బ్యాంకులు, బంగారు నగల దుకాణాలు, పాన్ బ్రోకర్ దుకాణాలు,‌ఒంటరి ఇండ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చేందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ను చిత్తూరు ‌పొలీసులు అరెస్టు చేశారు. ఎటువంటి క్లూస్ దొరకకుండా  15 ఏళ్ళుగా దొంగతనాలకు పాల్పడుతూ 10 ఏళ్ళుగా పోలీసులకు చిక్కకుండా చత్తీస్‌గఢ్ లో స్ధావరం ఏర్పరుచుకుని నాలుగు రాష్ట్రాల పోలీసులను ముప్పు తిప్పలు పెడుతోంది ఈ గ్యాంగ్.  ఒక్కటిన్నర నెలగా వివిధ రాష్ట్రాలను దర్యాప్తు సాగించి ఎట్టకేలకు ముఠా సంబంధి వివరాలను సేకరించి ముఠాలోఏ-1,ఏ-2 ప్రధాన నిందితులును పోలీసులు చాకచక్యంగా పట్టుకుని వారి వద్ద నుండి 55 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, 3 కార్ల స్వాధీనం చేసుకున్నా చిత్తూరు పోలీసులు. 

ఏళ్లుగా ఎవరికీ చిక్కకుండా.. దొరకకుండా దొంగతనాలు !

చిత్తూరు జిల్లాలో  ఇటీవల గంగాధర నెల్లూరు పొలీసు స్టేషన్ ఫరిధిలో పాన్ బ్రోకర్ షాపులో  భారీ దొంగతనం జరిగింది.  ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.  ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గత ఒకటిన్నర నెల నుండి ఈ కేసు గురించి దక్షిణ భారత దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలో తిరిగి నేరస్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు.  శనివారం సాయంత్రం 3.00 గంటలకు ప్రత్యేక బృందానికి అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు ప్రత్యేక బృందాలు చిత్తూరు మండలం పరిధిలోని బెంగళూరు – తిరుపతి రోడ్డులోని చెర్లోపల్లి వద్ద  మురుగన్ శివగురు @ కరాటే మురుగా,  రాజాలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 15 లక్షల నగదు, 395 గ్రాముల బంగారు ఆభరణాలు, 6 kg ల వెండి, నేరానికి ఉపయోగించిన 3 కార్లను మొత్తం 55 లక్షల విలువ చేసే క్రైం ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Brahmamudi Maanas Nagulapalli: కొడుక్కి రామ్ చరణ్ మూవీ పేరు పెట్టిన 'బ్రహ్మముడి' మానస్.. ఫొటోస్ చూశారా!
కొడుక్కి రామ్ చరణ్ మూవీ పేరు పెట్టిన 'బ్రహ్మముడి' మానస్.. ఫొటోస్ చూశారా!
Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Ram Gopal Varma Video: నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
Streambox QLED TV: ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
Embed widget