Chandrababu Tour: కుప్పంలో చంద్రబాబు టూర్‌పై ఉత్కంఠ, పీఎస్‌కు ప్రచార రథాలు - పోటాపోటీ హెచ్చరికలు!
తమను అడ్డుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.
![Chandrababu Tour: కుప్పంలో చంద్రబాబు టూర్‌పై ఉత్కంఠ, పీఎస్‌కు ప్రచార రథాలు - పోటాపోటీ హెచ్చరికలు! Chandrababu kuppam tour may stop by police after Government orders Chandrababu Tour: కుప్పంలో చంద్రబాబు టూర్‌పై ఉత్కంఠ, పీఎస్‌కు ప్రచార రథాలు - పోటాపోటీ హెచ్చరికలు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/04/1404227bc5c4398a57da125fffa4d4801672813022344234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
టీడీపీ రోడ్ షోలు నిర్వహించిన సమయంలో ఇటీవల జరిగిన దుర్ఘటనల వేళ ఆ పార్టీ అధినేత చంద్రబాబు కుప్పంలో చేపట్టబోయే పర్యటనపై ఉత్కంఠ నెలకొని ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం చంద్రబాబు రోడ్ షో, సభలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెబుతున్నారు. నోటీసులు కూడా ఇస్తున్నారు. చంద్రబాబు రోడ్ షో, సభలకు వెళ్తే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే, పోలీసుల తీరుపై స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేగా కుప్పంలో ఎక్కడైనా సభలు నిర్వహించుకునే హక్కు చంద్రబాబుకు ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు సభను టీడీపీ నేతలు జరిపి తీరుతామంటున్నారు. తమను అడ్డుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.
డిసెంబర్ 4,5,6 తేదీల్లో చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో పర్యటించనున్నారు. ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో చంద్రబాబు మూడు రోజుల కుప్పం పర్యటన మొత్తం ఏ విధమైన రోడ్ షో, సభలు లేకుండానే షెడ్యూల్ అయింది. పర్యటన అంతా విలేజ్ విజిట్, పార్టీ నేతలతో సమావేశాలకే పరిమితం అయినట్లు తెలుస్తోంది.
కుప్పం బయల్దేరిన చంద్రబాబు
హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరిన చంద్రబాబు బెంగళూరుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కుప్పం వెళ్తారు. మధ్యాహ్నం 2 గంటలకు శాంతిపురం మండలం పెద్దూరు గ్రామానికి చంద్రబాబు చేరుకోవాలి. అక్కడ ‘ఇదేంఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. సాయంత్రం కేనుమాకురిపల్లిలో నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
ఇప్పటికే ప్రచార రథాల అడ్డగింత
చంద్రబాబు కుప్పం పర్యటన వేళ కుప్పం నుంచి శాంతిపురం మండలానికి వెళ్లాల్సిన టీడీపీ ప్రచార వాహనాన్ని, ఇతర టీడీపీ నాయకుల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రచార రథాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతిపురం మండలంలో నిర్వహించే సభలో పాల్గొనేందుకు కార్యకర్తలు వస్తుండగా, ఆ మార్గాల్లో పోలీసులు మోహరించారు. కొన్నిచోట్ల కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని వారిని వెనక్కి పంపిస్తున్నారు. కేనుమాకురిపల్లిలో చంద్రబాబు నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమానికి మంగళవారం (జనవరి 3) అనుమతి ఇచ్చి బుధవారం (జనవరి 4) కుదరదని చెప్పడం ఏంటని టీడీపీ నేతలు పోలీసుల తీరుపట్ల మండిపడుతున్నారు.
పోలీసులు వైసీపీ కండువాలు కప్పుకుంటే మంచిది - టీడీపీ నేతలు
శాంతిపురం మండలం, కేనుమాకులపల్లిలో ఏర్పాటు చేసిన స్టేజ్ ను పోలీసులు తొలగించారు. దీంతో స్థానిక టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ నేతల లాగా పోలీసులు వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. పోలీసులు వైసీపీ కండువాలు కప్పుకుంటే మంచిందని అన్నారు. కోనేరు కుప్పంలో మాజీ ఎమ్మెల్సీ గౌనీవారి శ్రీనివాసులు, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. దొంగలకు, నాటు సారా ముఠాలకు పోలీసులు అనుమతిస్తారే, కానీ మాకు అనుమతి ఇవ్వరా అంటూ పోలీసులను మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు ప్రశ్నించారు.
తాము దొంగలం కాదని ఇంత మంది పోలీసులు మమ్మల్ని అడ్డుకోవడం ఏంటి అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు పర్యటనను సజావుగా సాగేలా పోలీసులు సహకరించాలని చేయాలని ఆయన కోరారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)