నిజం గెలవాలి యాత్ర ప్రారంభించిన భువనేశ్వరి- మొదట ప్రవీణ్ రెడ్డి ఫ్యామిలీకి పరామర్శ
నిజం గెలవాలి యాత్రకు బయల్దేరే ముందు నారా భువనేశ్వరి టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్.టి. రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
నిజం గెలవాలి యాత్రను ప్రారంభించిన నారా భువనేశ్వరి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో హతాశులై మృతి చెందిన వారి ఫ్యామిలీలను పరామర్శించనున్నారు. అక్టోబర్ 17న మృతి చెందిన ఆవుల ప్రవీణ్‌రెడ్డి కుటుంబాన్ని మొదట భువనేశ్వరి ఓదార్చారు. ప్రవీణ్ రెడ్డి తల్లి అనురాధకు ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.
చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ పై ఆవేదనతో చంద్రగిరిలో ఈ నెల 17 వ తేదీన చనిపోయిన టీడీపీ కార్యకర్త ప్రవీణ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన నారా భువనేశ్వరి గారు.#NijamGelavali#NyayanikiSankelluForCBN#NyayanikiSankellu #CBNLifeAtRisk #CBNJailedForDevelopingAP… pic.twitter.com/OtKK8CIq6U
— Telugu Desam Party (@JaiTDP) October 25, 2023
అనంతరం కనుమూరి చిన్నబాబు నాయుడి ఫ్యామిలీని పరామర్శించారు. పాకాల మండలంలోనే నెద్రగుంట గ్రామంలో ఉండే చిన్నబాబు నాయుడి కుటుంబానికి ధైర్యం చెప్పారు. వారికి మూడు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి భరోసా ఇచ్చారు.
యాత్రకు బయల్దేరే ముందు నారా భువనేశ్వరి టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్.టి. రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
నారావారిపల్లెలో తండ్రి ఎన్టీఆర్ ఆశీస్సులు అందుకుని, "నిజం గెలవాలి" బస్సుయాత్రకు శ్రీకారం చుట్టిన నారా భువనేశ్వరిగారు#NijamGelavali#NyayanikiSankelluForCBN#NyayanikiSankellu #CBNLifeAtRisk #CBNJailedForDevelopingAP #CBNLifeUnderThreat #TDPJSPTogether #APvsJagan #IAmWithBabu… pic.twitter.com/kY5QTPf6j5
— Telugu Desam Party (@JaiTDP) October 25, 2023
చంద్రబాబు గారి అక్రమ అరెస్టును తట్టుకోలేక మనోవేదనతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తూ నారా భువనేశ్వరిగారు చేపట్టిన "నిజం గెలవాలి" బస్సుయాత్రకు శ్రీకారం. నారావారిపల్లెలో తండ్రి ఎన్టీఆర్ ఆశీస్సులు అందుకుని చంద్రగిరికి బయలుదేరిన భువనేశ్వరిగారు#NijamGelavali… pic.twitter.com/tJMlOq1Isa
— Telugu Desam Party (@JaiTDP) October 25, 2023