అన్వేషించండి

AP Govt On Pawan: వ్యక్తిగత వివాదంపై రాద్దాంతమా? - పవన్‌ విమర్శలకు ప్రభుత్వం కౌంటర్ అటాక్

వ్యక్తుల మధ్య సమస్యలకు రాజకీయ రంగు పులిమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని పవన్ కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రభుత్వం. జనవాణిలో పవన్ విమర్శలపై ప్రభుత్వం రియాక్షన్.

జనవాణి పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన కార్యక్రమానికి కౌంటర్‌ అటాక్ మొదలు పెట్టింది ప్రభుత్వం. అక్కడ ప్రస్తావనకు వచ్చే సమస్యలపై రియాక్ట్ అవుతోంది. ఆధారాలు, అధికారుల వివరణతో సమస్య వెనుక ఉన్న అసలు సంగతి చెబుతోంది. ఏపీ గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్‌ పేరుతో ఇలాంటి విమర్శలపై స్పందిస్తోంది. 

వ్యక్తుల మధ్య సమస్యలకు రాజకీయ రంగు పులిమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని పవన్ కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రభుత్వం. 2018లో చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలు పాటించినందుకు తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో ప్లాట్లు రద్దయ్యాయని... ఆ వివాదంలో ప్రస్తుత ప్రభుత్వాన్ని దోషిగా చూపించడంపై మండిపడింది. పవన్ కల్యాణ్ చేస్తోంది జనవాణి కాదని విషవాణి అని ఆగ్రహం  వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన తిరుపతి జిల్లా కలెక్టర్‌ నివేదికతో వివరణ ఇచ్చింది ప్రభుత్వం. 

తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన అనిత అనే మహిళతో హైడ్రామా సృష్టించిన పవన్‌ కళ్యాణ్‌... నిరాధార ఆరోపణలు చేస్తూ  ప్రభుత్వంపై అసంబద్ధ ప్రేలాపనలు చేస్తున్నారని ప్రభుత్వం మండిపడింది. ఈ ఘటనపై పూర్తి వివరాలను తిరుపతి జిల్లా కలెక్టర్‌ విచారణ చేసి నివేదించిన వివరాలను బయటపెట్టింది ప్రభుత్వం. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి గ్రామం, తారకరామనగర్‌లో ప్లాటు నంబరు 2400 వెనుక వాస్తవాలను ఈ నివేదికతో వెల్లడయ్యాయని పేర్కొంది. 

ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారం... 2004లో అనిత అనే మహిళకు ఇంటిపట్టాను కేటాయించింది ప్రభుత్వం. 6 నుంచి 12 నెలల్లోగా ఇల్లుగాని, గుడిసెగాని వేసుకోని పక్షంలో స్వాధీనంలో ఉంచుకోవాలని షరతు పెట్టారు. 2004 నుంచి ఎలాంటి గుడిసెకాని, ఇల్లు కాని కట్టుకుని 989 ప్లాట్ల లబ్ధిదారులకు 2018 చంద్రబాబు ప్రభుత్వం నోటిసులు జారీ చేసింది.  

నోటీసులకు లబ్ధిదారుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో ప్లాట్లను రద్దుచేస్తూ ప్రక్రియ ప్రారంభించింది అప్పటి ప్రభుత్వం. అదే క్రమంలో ప్లాటు నెంబరు 2400ను కూడా అప్పటి వరకు ఉన్న వ్యక్తుల పేరున రద్దు చేసి కొత్త వారికి కేటాయించారు. ఆ ప్లాట్‌ను వి. వెంకటేష్‌ అనే వ్యక్తికి కేటాయిస్తూ ఎంజాయ్‌మెంట్‌ సర్టిఫికెట్‌ జారీ చేసింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. అలాగే 3వేల మందికి ఎంజాయ్‌మెంట్‌ సర్టిఫికెట్ల జారీ చేశారు. అయితే ఒకేసారి అంతపెద్ద మొత్తంలో ఎంజాయ్‌మెంట్‌ సర్టిఫికెట్లు జారీచేయడంపై విచారణకు ఆదేశించి విచారణ జరుపుతున్నారు చిత్తూరు జిల్లా కలెక్టర్‌. 

తనకు ఎంజాయ్‌మెంట్‌ సర్టిఫికేట్‌ వచ్చిందని వెంకటేష్‌ అక్కడే ఓ షెడ్‌ వేసుకున్నారు. ఆయన పేరు మీదనే ఇంటి పన్ను కూడా కడుతున్నారు. కరెంటు బిల్‌ కూడా పే చేస్తున్నారు. షెడ్డు నిర్మిస్తున్న సమయంలో అనిత, వెంకటేష్‌ మధ్య వివాదం చెలరేగింది. తన భూమి అంటూ అనిత, కాదు ప్రభుత్వం తనకే కేటాయించిందని వెంకటేష్‌ గొడవ పడ్డారు. అప్పుడే ఆ షెడ్డును అనిత ఆక్రమించుకున్నారు అనిత. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంకటేష్‌.  

పోలీసుల సాయంతో అనిత నుంచి తన షెడ్‌ను వెంకటేష్‌ స్వాధీనం చేసుకున్నారు. దాని చుట్టూ ప్రహరీగోడ నిర్మించారు. వెంకటేష్‌ బోయ కులానికి చెందిన వ్యక్తి. దొడ్లమిట్టలో ఒక కూల్‌డ్రింకు షాపులో కూలీగా పని చేస్తున్నారు. ఆయనతో వైఎస్‌ఆర్‌సీపీకి ఎలాంటి సంబంధం స్పష్టం చేసింది. 

ఇలా ఇద్దరి మధ్య వెలుగు చూసిన వివాదాన్ని ప్రభుత్వానికి ఆపాదించి విమర్శలు చేయడం సరికాదని పవన్‌ కల్యాణ్‌కు సూచించింది ప్రభుత్వం. దీన్ని మసిపూసి మారేడు కాయ చేస్తున్నారని మండిపడింది. విజయవాడ జనవాణి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఈ అంశాన్ని వీడియో తీసి అనుకూలమీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారంచేసి... ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు విష ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఈ వివాదంలో అనిత అనే అమహిళ నిన్న పవన్ కల్యాణ్‌ వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. తనను తరిమేసి తన భూమి లాక్కున్నారని బోరుమంది. అన్నీ తన పేరుమీదే ఉన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై తమ ఫ్యామిలీని బయటకు గెంటేశారని ఏడ్చింది. ఇందులో వైసీపీ వాళ్ల హస్తం ఉందని ఆరోపించారామె. 

టాప్ హెడ్ లైన్స్

Aggipetti Macha : ఆగిన అగ్గిపెట్టె మచ్చ అంత్యక్రియలు - ఆస్తి వివాదాలే కారణమా?
ఆగిన అగ్గిపెట్టె మచ్చ అంత్యక్రియలు - ఆస్తి వివాదాలే కారణమా?
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget