News
News
X

AP Financial Crisis: ఏపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, వడ్డీలు చెల్లించడం కూడా కష్టమే: సీఎం రమేష్

ఎక్కడైనా సరే ఉద్యోగాలు, రెవెన్యూ జనరేషన్ ఉండాలి కానీ అలాంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అభిప్రాయపడ్డారు.

FOLLOW US: 

తిరుపతి : ఏపీ పరిస్థితి చాల క్లిష్టంగా ఉందని, ఇదే అంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మల సీతారామన్ ప్రస్తావించారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చెప్పారు. అప్పులు తీసుకొని వచ్చి, వడ్డీలు కట్టే స్థితిలో ఏపీ ప్రభుత్వం లేదని విమర్శించారు. ప్రజలకు ప్రయోజనం ఉండే పనులు సైతం ఏపీ ప్రభుత్వం చేపట్టడం లేదని ఆరోపించారు. ఎక్కడైనా సరే ఉద్యోగాలు, రెవెన్యూ జనరేషన్ ఉండాలి కానీ అలాంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. 
తిరుమల శ్రీవారిని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు సీఎం రమేష్ కు స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ..‌ రాష్ట్రంలో చిచ్చు పెట్టి, రాజధాని మార్చాలని చూస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలపై ఆరోపణలు చేశారు. అమరావతిని రాజధానిగా గత ప్రభుత్వంలో తీర్మానం చేయగా అన్ని పార్టీలు అప్పుడు అంగీకరించాయన్నారు. ఇప్పుడు భేషజాలకు పోయి వైసీపీ మంత్రులు, నేతలు రకరకాలుగా బయట మాట్లాడుతున్నారని తెలిపారు. ప్రజా రాజధాని కేవలం అమరావతి మాత్రమేనని, కేంద్ర ప్రభుత్వం సైతం అమరావతి కోసం సహాయం చేసేందుకు సిద్ధంగా ఉందని సీఎం రమేష్ స్పష్టం చేశారు.

అందుకే మూడు రాజధానులు నిర్ణయం: ఏపీ డిప్యూటీ సీఎం
తిరుపతి :  నిత్యం ప్రజా సేవకు అంకితమై సేవచేస్తున్న సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల సంక్షేమం కొరకేనన్నారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. అన్ని ప్రాంతాలు సమానంగా చూడాలని ఆలోచనతోనే మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలనేదే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన లక్ష్యమన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తిరుమల శ్రీవారిని  దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. 
ఆలయం వెలుపల డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ..‌ రాయలసీమ ప్రజల మదిలో ఏముందో ఇప్పుడైనా ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలుసుకోవాలని సూచించారు. చంద్రబాబుకి తోడునీడగా ఉండే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మూడు రాజధానుల అవసరం తెలియాలన్నారు. ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి కష్టాలు పడుతున్నామని, మల్లి అదే పరిస్థితి రాకుండా చూడాలనే మూడు రాజధానులు సీఎం జగన్ తీసుకొచ్చారని అన్నారు. నవరత్నాలు, మూడు రాజధానులను వక్రీకరిస్తున్న చంద్రబాబు, ఎల్లో మీడియాకు కనువిప్పు కావాలని దేవుడిని ప్రార్ధించినట్లు నారాయణ స్వామి తెలిపారు.

Published at : 30 Oct 2022 12:54 PM (IST) Tags: YS Jagan AP News Nirmala Sitharaman Telugu News CM Ramesh

సంబంధిత కథనాలు

CM Jagan Madanapalle Visit: రేపే విద్యా దీవెన నాలుగో విడత డబ్బుల జమ - మదనపల్లెలో బటన్ నొక్కనున్న జగన్!

CM Jagan Madanapalle Visit: రేపే విద్యా దీవెన నాలుగో విడత డబ్బుల జమ - మదనపల్లెలో బటన్ నొక్కనున్న జగన్!

Gold-Silver Price 29 November 2022: 53వేల రూపాయల కంటే దిగువకు బంగారం- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే!

Gold-Silver Price 29 November 2022:  53వేల రూపాయల కంటే దిగువకు బంగారం- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే!

TTD News: తిరుమల శ్రీవారి దర్శనానికి భారీగా సమయం, కిలోమీటర్ల మేర క్యూలో భక్తులు

TTD News: తిరుమల శ్రీవారి దర్శనానికి భారీగా సమయం, కిలోమీటర్ల మేర క్యూలో భక్తులు

AP News Developments Today: వైఎస్‌ వివేకా హత్య కేసుపై నేడు సుప్రీం కోర్టు చెప్పబోతోంది?

AP News Developments Today: వైఎస్‌ వివేకా హత్య కేసుపై నేడు సుప్రీం కోర్టు చెప్పబోతోంది?

Petrol-Diesel Price, 29 November 2022: డీజిల్‌ కొట్టించాలంటే మాత్రం ఈ జిల్లాల్లో బెటర్!

Petrol-Diesel Price, 29 November 2022: డీజిల్‌ కొట్టించాలంటే మాత్రం ఈ జిల్లాల్లో బెటర్!

టాప్ స్టోరీస్

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Sajjala On Viveka Case : వివేకా హత్య కేసులో నిజాలు తెలియాలి, తెలంగాణలో విచారణ జరిగితే మంచిదే- సజ్జల

Sajjala On Viveka Case : వివేకా హత్య కేసులో నిజాలు తెలియాలి, తెలంగాణలో విచారణ జరిగితే మంచిదే- సజ్జల

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్