అన్వేషించండి

Andhra Pradesh Crime News: తెలిసిన వ్యక్తే కదా అని బండి ఎక్కింది.. మధ్యలో ఆపి కూల్ డ్రింక్‌ కూడా ఇప్పించాడు. అప్పుడు గాని అసలు సంగతి తెలియలేదు

పక్కింటి యువతికి మాయమాటలు చెప్పి, అత్యాచారం చేశాడు ఓ ప్రబుద్ధుడు. యువతికి కూల్ డ్రింక్ లో మత్తు పదార్ధాలు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడు. తిరుపతిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

ప్రస్తుత సమాజంలో అర్ధరాత్రి అమ్మాయిలు బయటకు వస్తే తిరిగి ఇంటికి వస్తారా..? అనే అనుమానాలు అధికం అవుతున్న పరిస్థితులు. ప్రభుత్వాలు ఎంత కఠిన చర్యలు తీసుకుంటున్నా మృగాళ్లలలో మాత్రం మార్పు రావడంలేదు.  అవసరానికి రాత్రి పూట బయటకు వచ్చే మహిళలకు పూర్తిగా రక్షణ కరవుతుంది. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు అమలు చేసిన మృగాళ్లు వెనకాడటం లేదనే చెప్పొచ్చు. పోక్సో, దిశ, నిర్భయ లాంటి చట్టాలు అమలులో ఉన్నా ఆడవారికి రక్షణ కరవుతోంది. మహిళలపై అఘాయిత్యానికి పాల్పడి వారిని హతమార్చేందుకు కూడా వెనకాడడంలేదు. తాజాగా తిరుపతికి శివారు ప్రాంతంమైన మంగళంలోని ఓ కాలనీలో ఇటువంటి ఘటనే జరిగింది.

తిరుపతి శివారు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ యువతి తల్లి అనారోగ్యం కారణంగా రెండేళ్ల క్రితం మృతి చెందింది. తల్లి చనిపోయిన ఏడాదిన్నర తర్వాత తండ్రి కూడా అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబానికి పెద్ద దిక్కులేకుండా పోయింది. యువతి కుటుంబానికి బంధువులు ఆశ్రయం ఇచ్చారు. దీంతో ఆమె తమ బంధువుల ఇంటిలో ఉంటూ కాలం వెల్లదీస్తుంది. ఈ నెల 28వ తేదీ సాయంత్రం తిరుపతికి వెళ్లేందుకు ఆటో రిక్షా కోసం 19 ఏళ్ల యువతి మంగళం రోడ్డులో నిరీక్షిస్తూ కనిపించింది. తిరుపతికి శివారు ప్రాంతం కావడంతో అడపాదడపా ఆటోలు, ఇతర వాహనాలు వస్తూ.. వెళ్తూ ఉంటాయి. పదిహేను నిమిషాలకు ఆటో కోసం నిరీక్షించిన ఆ యువతికి ఒక్క ఆటో కూడా రాకపోవడంతో అక్కడే వేచి చూసింది. దీన్ని ఆసరాగా తీసుకున్న అదే కాలనీకి చెందిన నాగేంద్ర బాబు(30) యువతి పక్కింటి యువకుడు, తాను తిరుపతికి వెళ్తున్నానని నమ్మించి ద్విచక్ర వాహనంపై రమ్మని నమ్మబలికాడు. యువకుడు తెలిసిన వాడు కావడంతో యువతి నాగేంద్రబాబు ద్విచక్ర వాహనంపై ఎక్కింది. 

కొంత దూరం వెళ్లాక ఓ దుకాణంలో కూల్ డ్రింక్ తీసుకున్న ఆ యువకుడు అందులో మత్తు పదార్ధాలు కలిపాడు. ఈ డ్రింక్ తాగిన యువతి మెల్లగా మత్తులో జారుకుంటున్న సమయంలో.. తిరుపతి బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీనివాసం వసతి భవనానికి ఎదురుగా ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. అప్పటికే ఆ యువతి మత్తులోకి జారుకోవడంతో అదే అదునుగా భావించిన యువకుడు నాగేంద్రబాబు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత యువతిని తిరిగి స్పృహ వచ్చాక మంగళానికి చేరుకుంది. మరుసటి రోజు యువతికి తీవ్ర అనారోగ్యం‌ కావడంతో వైద్యం చేయించేందుకు ఆసుపత్రికి వెళ్లగా పరిక్షించిన వైద్యులు విషయం  చె్పారు. దీంతో యువతి శుక్రవారం రాత్రి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడైన నాగేంద్రబాబును అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు.

Also Read: AP Boxite Row : తవ్వుతోంది బాక్సైటా.. లేక లేటరైటా.. ఎన్జీటీ విచారణతో ఏపీ ప్రభుత్వానికి షాకేనా..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget