అన్వేషించండి

YCP Attack on TDP: అర్థరాత్రి అనంతలో టెన్షన్- టీడీపీ నేత జేసీ ఆస్మిత్ రెడ్డిపై రాళ్ల దాడి!

Attack on TDP Leaders: తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ అస్మిత్ రెడ్డిపై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడి చేశారు. అదృష్టవశాత్తు ఆయనకు ఎలాంటి ప్రమాదమూ జరగలేదు.

Attack on TDP Leaders: అనంతపురం జిల్లా తాడిపత్రిలో అర్థరాత్రి టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ లీడర్ల పరస్పర దాడులతో ఉలిక్కిపడింది తాడిపత్రి. టీడీపీ లీడర్ జేసీ అస్మిత్ రెడ్డి పర్యటన సందర్భంగా ప్రత్యర్థులు దాడి చేశారు. వీధిలైైట్లు ఆపేసి మరీ దాడి చేశారు. 

టీడీపీ నాయకుడు జేసీ అస్మిత్ రెడ్డిపై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడి చేశారు. తాడిపత్రిలోని మూడోవార్డులో పర్యటిస్తుండగా వీధిలైట్లు ఆపేసి మరీ ఆయనపైకి రాళ్లు రువ్వారు. ఈదాడిలో ఎలాంటి గాయాలు కాకుండానే ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడే జేసీ అస్మిత్ రెడ్డి.

వైసీపీ నాయకులు టీడీపీ నేతపై దాడికి దిగడంతో తాడిపత్రి మొత్తం ఉద్రిక్తంగా మారింది. ఈ రాళ్ల దాడిలో ఇరు వర్గాల కార్యకర్తలు, నాయకులు గాయపడ్డారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. రాళ్లదాడిని ఆపేశారు. ఇరు పార్టీల వారిని చెదరగొట్టారు. గాయపడ్డ వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

YCP Attack on TDP: అర్థరాత్రి అనంతలో టెన్షన్- టీడీపీ నేత జేసీ ఆస్మిత్ రెడ్డిపై రాళ్ల దాడి!

తునిలో టీడీపీ లీడర్‌పై హత్యాయత్నం

నవంబర్ 17న ఉదయం చంద్రశేఖర్ భవాని మాల ధరించి, నుదుటికి విభూది మరియు బొట్టు పెట్టుకుని, ముఖానికి మాస్కు ధరించాడు. తుని సమితి ఆఫీస్ వీధిలో ఉన్న పోలనాటి శేషగిరిరావు ఇంటికి బైకు మీద వెళ్లాడు. ఇంటి ఆవరణలోనికి వెళ్లి బిక్ష అడిగాడు. బియ్యం వేస్తుండగా శేషగిరిరావుపై కత్తితో దాడి చేశాడు చంద్రశేఖర్. బాధితుడు కేకలు వేయడంతో నిందితుడు చంద్రశేఖర్ అక్కడినుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. నిందితుడు బైకు మీద పారిపోతుండగా, శేషగిరిరావు అదే కత్తితో చంద్రశేఖర్ పై వీధి చివరి వరకు వెళ్లి దాడి చేయగా వీపుపై గాయమైంది. పోలీసులకు తాను దొరికిపోవడం ఖాయమని భావించిన నిందితుడు చంద్రశేఖర్ 23-11-2022 తేదీ మధ్యాహ్నం తుని టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఈ కేసులో దర్యాప్తు అధికారి అయిన ఎస్ మురళీమోహన్ ఎదుట లొంగిపోయి తన తప్పుడు అంగీకరించాడు. కేసులో మిగతా నిందితుల కొరకు పోలీసు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాకినాడ జిల్లా తునిలో టీడీపీ సీనియర్ నాయకుడు శేషగిరిపై జరిగిన దాడి కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. భవాని మాలలో వచ్చి ఓ వ్యక్తి టీడీపీ నేతపై నవంబర్ 17న దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విశాఖపట్నానికి చెందిన చంద్రశేఖర్ అనే యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 

జిల్లాలోని తుని పట్టణంలో గురువారం (17-11-2022) నాడు టీడీపీ లీడర్‌ మాజీ ఎంపీపీ శేషగిరిరావుపై భవాని మాలలో ఉన్న వ్యక్తి కత్తితో దాడి చేశాడు. భిక్ష తీసుకుంటున్నట్లుగా నటించిన వ్యక్తి తన వెంట తెచ్చుకున్న కత్తితో శేషగిరిరావుపై విచక్షణారహితంగా దాడి చేశాడు. శేషగిరిరావు కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తి చేసిన కత్తి దాడిలో శేషగిరిరావుకు చేతికి, తలపై గాయాలయ్యాయి. కాకినాడ అపోలో అసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కేసు నమోదు చేసిన పోటీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget