Tirupati: సామాన్య భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం... జనవరి 11 నుంచి 14 వరకు అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు
సామాన్య భక్తులకు వసతి విషయంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 11 నుంచి 14 వరకూ వసతి గదుల అడ్వాన్స్ బుకింగ్ ను రద్దు చేసింది. భక్తులకు జనరల్ కౌంటర్ ల ద్వారా గదులు మంజూరు చేస్తారు.
![Tirupati: సామాన్య భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం... జనవరి 11 నుంచి 14 వరకు అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు Tirupati TTD key decision on room advance booking January 11 to 14 booking cancelled Tirupati: సామాన్య భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం... జనవరి 11 నుంచి 14 వరకు అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/17/6db87d1a395e6e5911a55709f4042998_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తిరుమల శ్రీవారి ఆలయంలో 2022 జనవరి 13న వైకుంఠ ఏకాదశి, జనవరి 14న వైకుంఠ ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకొని జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్‌ను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తుల వసతికి పెద్దపీట వేస్తూ తిరుమలలోని అన్ని గదులను కరెంటు బుకింగ్ ద్వారా కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. ఎమ్‌బీసీ- 34, కౌస్తుభం విశ్రాంతి భవనం, టీబీసీ కౌంటర్, ఎఆర్‌పీ కౌంటర్లలో 2022 జనవరి 11వ తేదీ తెల్లవారు జామున 12 గంటల నుంచి 14వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు గదులు కేటాయింపు రద్దు చేశారు. జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపు ప్రివిలేజ్ ఉండదు. శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రముఖులకు వెంకట కళానిలయం, రామరాజ నిలయం, సీతా నిలయం, సన్నిధానం, గోవింద సాయి విశ్రాంతి గృహాల్లో అలాట్‌మెంట్ కౌంటర్లు ఏర్పాటుచేసి గదులు కేటాయిస్తారు. ప్రముఖులకు గరిష్టంగా 2 గదులు మాత్రమే కేటాయిస్తారు. సామాన్య భక్తులకు సీఆర్‌వో జనరల్ కౌంటర్ ద్వారా గదులు మంజూరు చేస్తారు.
Also Read: ఏపీ మద్యం దుకాణాల్లో క్యాష్ ఓన్లీ.. పెద్ద స్కాంగా లోక్‌సభలో రఘురామ ఆరోపణ !
కార్మికుల ధర్నాతో భక్తులకు కొత్త కష్టాలు
తిరుమలలో శ్రీవారి భక్తులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. కాంట్రాక్ట్ కార్మికులు టీటీడీ కార్పొరేషన్‌లో కలపాలంటూ ఆందోళన చేస్తున్నారు. దీంతో తిరుమలలో పారిశుద్ధ్య పనులకు ఆంటకాలు ఎదురవుతున్నాయి. కాంట్రాక్టర్ సంస్థలు గదులను ఒరకొరగా శుభ్రం చేయిస్తున్నాయి. గదుల కోసం భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి వేచి ఉన్నా గదులు కేటాయించడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్ఎమ్ఎస్ కంపెనీ ఆధ్వర్యంలో పనిచేసే 3500 మంది కార్మికులు తమను కార్పొరేషన్ లో విలీనం చేయాలని ధర్నా చేపట్టారు. దీని ప్రభావంతో తిరుమలలో రూములు శుభ్రం చేయడానికి సిబ్బంది లేనట్లు తెలుస్తోంది. గదుల కేటాయింపుపై భక్తులు దాదాపుగా రెండు గంటల సమయం పాటు వేచి ఉండాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. గదులు శుభ్రంగా ఉండడం లైదని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిరసనలో ఉన్న కార్మికులు వెంటనే విధుల్లో చేరకపోతే వారిని తొలగించి కొత్తవారిని నియమించుకోవాలని ఆ ప్రైవేటు సంస్థను టీటీడీ ఆదేశించింది. టీటీడీ హెచ్చరికతో ఎఫ్ఎమ్ఎస్ కార్మికులు ఎలా స్పదింస్తారన్నది చూడాలి. కార్మికలు తిరిగి విధులకు వస్తే తప్ప భక్తులకు ఇబ్బందులు తగ్గవు.
Also Read: సోమవారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించే చాన్స్... ఆర్థిక శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)