News
News
వీడియోలు ఆటలు
X

Tirumala News : తిరుమలలో అపచారం, మాంసం తింటూ పట్టుబడ్డ షికారీలు!

Tirumala News : తిరుమలలో అపచారం చోటుచేసుకుంది. మాంసం తింటూ ఇద్దరు షికారీలు పట్టుబడ్డారు.

FOLLOW US: 
Share:

Tirumala News : తిరుమలలో అపచారం జరిగింది. మాంసం తింటూ షికారీలు పట్టుబడ్డారు. వారిని తిరుమల విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.  తిరుమలలో మద్యమాంసాలపై నిషేధం ఉన్నా కొందరు మాత్రం నియమాలను అతిక్రమిస్తున్నారు. నిబంధనలు పాటించే వారికేనని మాకు కాదంటూ కొందరు షికారీలు, స్థానికులు తరచూ తిరుమలలో మాసం మద్యం సేవిస్తూ పట్టుబడుతున్నారు. తిరుమలలోని షికారి వీధిలో కొందరు షికారీలు మాసం వండినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన విజిలెన్స్ సిబ్బంది ఇద్దరు షికారిలను అదుపులోకి తీసుకున్నారు. వారిని కమాండ్ కంట్రోల్ రూమ్ కు తరలించి విచారణ చేపడుతున్నారు. 

తిరుమల కొండపై మద్యం, మాంసంపై నిషేధం ఉంది. కొందరు ఈ నిబంధనలను అతిక్రమిస్తున్నారు. తిరుమలలో మాంసం తింటూ మద్యం సేవిస్తూ పట్టుబడుతున్నారు.  తిరుమలలోని షికారీ వీధిలో కొందరు షికారీలు మాంసం వండి తింటున్నట్టు టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం రావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.   

ఇటీవల డ్రోన్ కలకలం 

తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన ఓ వీడియో ఇటీవల నెట్టింట హల్ చల్ చేసింది. ఈ వీడియో వైరల్ అవడంతో  టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ కెమెరాల్లో శ్రీవారి ఆలయాల చిత్రీకరించిన వీడియో వైరల్ అయింది. తిరుమల శ్రీవారి ఆలయంపై, పరిసర ప్రాంతాల్లో విమానాలు, డ్రోన్ కెమెరాలు నిషేధం ఉంది. అయితే శ్రీవారి ఆలయానికి సంబంధించిన వీడియాను ఐకాన్ అనే ఓ యూట్యూబ్ ఛానల్ పోస్టు చేయడం కలకలంగా మారింది. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారడంపై శ్రీవారి భక్తులు, ఆగమ సలహాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 కోట్లాది మంది ఆరాధ్య దైవంమైన శ్రీనివాసుడి దర్శనార్థం ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుండి తిరుమల పుణ్యక్షేత్రానికి వస్తుంటారు.  అయితే తిరుమల కట్టుదిట్టమైన భద్రత వలయాలతో పటిష్టమైన సెక్యూరిటీ కలిగిన దేవస్థానం. ప్రతినిత్యం మాన్యువల్ సెక్యూరిటీ నుంచి మూడో కన్ను వరకు అన్ని కాపు కాస్తూనే ఉంటాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా హైసెక్యూరిటీ నడుమ టీటీడీ విజిలెన్స్, పోలీసు, ఆక్టోపస్ అంటూ వివిధ సెక్యూరిటీ ఫోర్స్ లతో పాటు సీసీ కెమెరాలు నిత్య పర్యవేక్షణలో తిరుమల సురక్షితంగా ఉంటుంది. ఇలాంటి హైసెక్యూరిటీ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలు ఎగరవేయరాదనే నిబంధనలు ఉన్నాయి. ఒకవేళ అనుమతి లేకుండా డ్రోన్స్ ఎగురవేస్తే కటకటాల పాలుకావాల్సిందే. ఇక ఇప్పటికే నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని టీటీడీ కేంద్ర పౌర విమానయాన శాఖను పలుమార్లు కోరింది. అయితే సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసిన పౌర విమానయాన శాఖ అధికారులు అది సాధ్యం కాదని తేల్చారు. విమానం సంగతి పక్కన బెట్టిన డ్రోన్స్ ఎగరేయరాదనే నిబంధనలు మాత్రం పటిష్టంగా అమలు చేస్తుంది టీటీడీ.

కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొట్టింది. పలు ఇన్ స్టాగ్రాం అకౌంట్లతో పాటుగా  యూట్యూబ్ ఛానెల్స్ లో స్వామి వారి ఆలయానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. టీటీడీ భద్రత సిబ్బంది కళ్లు గప్పి... ఓ డ్రోన్ స్వామి వారి ఆలయంపై చక్కర్లు కొట్టి, స్వామి వారి ఆలయం హై సెక్యూరిటీ అయినా ఏరియల్ వ్యూ వీడియో షూట్ చేసినట్లు ఆ వీడియోలో ఉంది. ఇప్పుడు  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెక్యూరిటీ పరమైన ఆంక్షలు ఉండి.... స్వామి వారి ఏరియల్ వ్యూ ను బయటకు రాకుండా చూస్తుంది టీటీడీ. అయితే ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్ చేసిన నిర్వాకం మాత్రం ఇప్పుడు కలకలం రేపిందని చెప్పుకోవాలి. డ్రోన్ రైడర్1  అనే యూట్యూబ్ ఛానెల్ లో  నవంబర్ 13, 2022లో తిరుమల వీడియోను అప్లోడ్ చేసింది.  అనంతరం అదే వీడియోని ఐకాన్ ఫాక్ట్స్/ ఐకాన్  అనే యూట్యూబ్ ఛానెల్ లో జనవరి 07, 2023లో పోస్ట్ చేశాయి. ఇక గృహశ్రీనివాస అనే ఇన్ స్టాగ్రాం అకౌంట్ లో అదే వీడియోను పోస్ట్ చేశారు.

Published at : 09 Feb 2023 02:39 PM (IST) Tags: Eating Tirumala non veg Meat Two arrested Vigilance

సంబంధిత కథనాలు

YS Viveka  Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ -  అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్  !

YS Viveka Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ - అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్ !

Payyavula Kesav : సీఎం జగన్ అవినీతి వల్ల ప్రజలపై రూ. 57వేల కోట్ల విద్యుత్ భారం- లెక్కలు బయటపెట్టిన పయ్యావుల కేశవ్ !

Payyavula Kesav : సీఎం జగన్ అవినీతి వల్ల ప్రజలపై రూ. 57వేల కోట్ల విద్యుత్ భారం- లెక్కలు బయటపెట్టిన పయ్యావుల కేశవ్ !

పొమ్మన లేక పొగబెడుతున్నారో లేదో చంద్రబాబును అడగండి- అధినాయకత్వంపై కేశినేని నాని అసహనం

పొమ్మన లేక పొగబెడుతున్నారో లేదో చంద్రబాబును అడగండి- అధినాయకత్వంపై కేశినేని నాని అసహనం

Raghurama : కస్టోడియల్ టార్చర్ సాక్ష్యాలు భద్రపరచండి - హైకోర్టులో రఘురామ పిటిషన్ !

Raghurama : కస్టోడియల్ టార్చర్ సాక్ష్యాలు భద్రపరచండి - హైకోర్టులో రఘురామ పిటిషన్ !

Top 10 Headlines Today: చంద్రబాబుపై కేశినేని అసహనం, జనసేనలోకి కీలక వ్యక్తి - నేటి టాప్ 5 న్యూస్

Top 10 Headlines Today: చంద్రబాబుపై కేశినేని అసహనం, జనసేనలోకి కీలక వ్యక్తి - నేటి టాప్ 5 న్యూస్

టాప్ స్టోరీస్

Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!

Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!

YSRCP News : రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !

YSRCP News :  రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?

Janasena News : జనసేనలోకి ఆమంచి  కృష్ణమోహన్ సోదరుడు -  చీరాలపై గురి పెట్టారా ?