అన్వేషించండి

Tirumala News : శ్రీవారికి విదేశీ కాసులు కానుక, హుండీలో 15 దేశాల నాణేలు

Tirumala News : శ్రీవారి హుండీలో 15 దేశాల నాణేలను టీటీడీ అధికారులు గుర్తించారు. వీటిని వేలం వేయడంతో రూ.1.31 కోట్ల ఆదాయం వచ్చింది.

Tirumala News : తిరుమల శ్రీనివాసుడికి విదేశీ కరెన్సీ, నాణేలను భక్తులు కానుకగా సమర్పించారు. తిరుమల హుండీలో దాదాపు 15 దేశాల నాణేలు ఉన్నట్లు టీటీడీ అధికారులు గుర్తించారు. వీటిని వేలం వేయడంతో దాదాపు 1.31 కోట్ల రూపాయలు ఆదాయం లభించిందని టీటీడీ తెలిపింది.  శ్రీనివాసుడి దర్శనార్ధం ప్రతి నిత్యం దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఇలా వచ్చిన భక్తులు భక్తి భావంతో తలనీలాలు సమర్పించిన అనంతరం బంగారు నగలు, వెండి, నగదు వంటికి కానుకలుగా సమర్పిస్తూ ఉంటారు. కోవిడ్ ముందు వరకూ రోజుకు యనభై నుంచి తొంభై వేల మంది భక్తులకు టీటీడీ స్వామి వారి దర్శనభాగ్యం కల్పించేది. అయితే కోవిడ్ అనంతరం పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాల భక్తులు స్వామి వారి దర్శన భాగ్యం చేసుకునేందుకు కొంత కష్టతరంగా మారింది. కోవిడ్ నిబంధనలను సడలించిన అనంతరం దేశ విదేశాల నుంచి విచ్చేసే భక్తుల సంఖ్య క్రమేపి పెరుగుతూ వస్తోంది. 

తిరుమలకు అంతర్జాతీయ భక్తులు క్యూ 

బ్రహ్మోత్సవాలు, గరుడ వాహన సేవ సమయంలో ఏడుకొండలు జనసంద్రంగా మారిపోతుంది. ప్రపంచంలో అధిక సంఖ్యలో విచ్చేసే ఆధ్యాత్మిక క్షేత్రం‌ కావడంతో పాటుగా, అత్యధిక ఆదాయం‌ లభించే ధార్మిక క్షేత్రాల్లో ఒక్కటిగా ప్రసిద్ధి కెక్కడంతో పాటుగా అగ్రస్థానంలో‌ నిలిచింది. దేశ విదేశాల నుంచి విచ్చేసే భక్తుల సంఖ్య అధికం కావడంతో స్వామి వారి హుండీ విదేశీ నాణేలు ప్రత్యక్షం అవుతూవచ్చాయి. గతంలో అతి తక్కువ విదేశీ నాణేలు మాత్రమే స్వామి వారి హుండీలో కనిపించేవి. అయితే ప్రస్తుతం వివిధ దేశాల నాణేలు స్వామి వారి హుండీలో కానుకులు కనిపిస్తున్నాయి. ముస్లిం దేశాలతో పాటుగా, క్రైస్తవ దేశాల నాణేలు కూడా శ్రీవారి హుండీలో కనిపిస్తుండడం విశేషం. ఈ విదేశీ నాణేల కనుకల బట్టే అంతర్జాతీయంగా భక్తుల తాకిడి తిరుమలకుఎలా ఉందో అని ఇట్టే అర్థం అవుతుంది. 

15 దేశాలకు చెందిన నాణేలు 

ఇటీవల స్వామి వారి హుండీ లెక్కింపులో భాగంగా 15 దేశాలకు చెందిన నాణేలను టీటీడీ పరకామణి అధికారులు గుర్తించారు. విదేశీ నాణేల అమ్మకానికి టెండర్ల ప్రక్రియ నిర్వహించిన అధికారులు మొదటగా ఏడు దేశాలకు.. బ్రిటన్, యూరో, కువైట్, థాయిలాండ్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన నాణేలకు టెండర్లు పిలువగా రూ.1,14,85,814, మిగిలిన 8 దేశాలు శ్రీలంక, ఒమాన్, నేపాల్, చైనా, ఖతర్, దక్షిణ కొరియా, జపాన్, హాంకాంగ్ కు చెందిన నాణేలు రూ.16,34,326 ధర పలికినట్లు తెలుస్తోంది. మొత్తం మీద 15 దేశాలకు చెందిన కరెన్సీకి టెండర్ల ద్వారా టీటీడీకి రూ.1.31 కోట్ల ఆదాయం లభించింది. టెండర్లలో పాల్గొని హెచ్1గా ఎంపికైన కంపెనీలకు విదేశీ నాణేలను అధికారులు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇటీవల అంతర్జాతీయంగా భక్తుల తాకిడి అధికం కావడంతో విదేశీ నాణేలు తరచూ స్వామి వారి హుండీలో ప్రత్యక్షం అవుతున్నాయి. 

Tirumala News : శ్రీవారికి విదేశీ కాసులు కానుక,  హుండీలో 15 దేశాల నాణేలు

శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై

 ధనుర్మాసం ప్రారంభం కావడంతో తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదించారు ఆలయ అర్చకులు.  జనవరి 14వ తేదీ వరకు తిరుప్పావై పారాయణం కొనసాగుతుంది. శుక్రవారం సాయంత్రం 6.12 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభమయ్యాయి.  పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్ర లేచి బ్రహ్మ ముహూర్తంలో మహా విష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.  12 మంది ఆళ్వార్లలో ఆండాళ్‌(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్‌ అని కూడా పిలుస్తారు. వేంకటేశ్వర స్వామి వారిని స్తుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్‌ దివ్య ప్రబంధంలో తిరుప్పావై ఒక భాగంగా ఉంది. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా కృష్ణ స్వామి వారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. పవిత్ర ధనుర్మాసం సంద‌ర్భంగా పెద్దజీయర్ మ‌ఠంలో తిరుప్పావై పారాయ‌ణం శనివారం ప్రారంభమైంది.  పెద్దజీయర్‌ స్వామి, చిన్నజీయర్ స్వామి ఈ సేవలో పాల్గొన్నారు. జ‌న‌వ‌రి 14వ తేదీ వ‌ర‌కు నెల రోజుల పాటు  తిరుప్పావై పాశురాల‌ను పారాయ‌ణం చేస్తారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Look Back 2024: ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్
ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desamరాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Look Back 2024: ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్
ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Khan Sir : స్టూడెంట్స్ కోసం నా కిడ్నీ అయినా అమ్మేస్తా - ఇంతకీ ఖాన్ సార్ ఎవరు..?
స్టూడెంట్స్ కోసం నా కిడ్నీ అయినా అమ్మేస్తా - ఇంతకీ ఖాన్ సార్ ఎవరు
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Osamu Suzuki : భారత్‌కు మారుతీ కారు పరిచయం చేసిన వ్యక్తి మృతి- సంతాపం తెలియజేసిన ప్రధాని
భారత్‌కు మారుతీ కారు పరిచయం చేసిన వ్యక్తి మృతి- సంతాపం తెలియజేసిన ప్రధాని
Embed widget