అన్వేషించండి

TDP News : శ్రీవారి సొమ్ముతో టీటీడీ చైర్మన్ ఎన్నికల ప్రచారం - టీడీపీ తీవ్ర ఆరోపణలు !

శ్రీవారి నిధులను ఎన్నికల ప్రచారం కోసం టీటీడీ చైర్మన్ ఉపయోగించుకుంటున్నారని టీడీపీ ఆరోపించింది. 150 కోట్ల టీటీడీ నిధులతో తిరుపతిలో రోడ్లు వేస్తున్నారన్నారు.

TDP News :   టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి  తిరుమల శ్రీవారి  ఆదాయాన్ని అక్రమ మార్గాల్లో కుమారుడి ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగిస్తున్నారని  టీడీపీ ఆరోపించింది. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. దేవస్థానం డబ్బుల్ని తన కుమారుడు అభినయ్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. టీటీడీ  ఉద్యోగులకు కేటాయించిన స్థలాల చుట్టూ అభినయ్‌రెడ్డి 5.45 ఎకరాలు ఎలా కొనుగోలు చేశారో చెప్పాలని ఆనం డిమాండ్ చేశారు. 

శ్రీవారి సొమ్ముతో తిరుపతిలో రోడ్లు 

తిరుపతి కార్పొరేషన్ వేయాల్సిన రోడ్లను వెంకటేశ్వరస్వామి సొమ్ముతో  వేస్తున్నారని.. ఇలా చేసే  అధికారం భూమనకు ఎవరిచ్చారని ఆనం  ప్రశ్నించారు.  అభినయ్  రెడ్డి రాజకీయ జీవితం కోసం శ్రీవారి నిధులు  రూ.150 కోట్లతో తిరుపతిలో ఇంటర్నల్ రోడ్లు వేస్తున్నారని మండిపడ్డారు.  టీటీడీ చైర్మన్ గా ఉన్న కరుణాకర్ రెడ్డి ఇప్పటివరకు స్వామివారికి సంబంధించిన ఎంత సొమ్మని ఇలా దారిమళ్లించాడో చెప్పాలని డిమాండ్ చేశారు.  స్వామివారి సొమ్మును తమ సొంత పనులకు వినియోగించడమే తప్పయితే..ఆ పనుల్లో మరల కరుణాకర రెడ్డి 10శాతం కమీషన్లు తీసుకుంటున్నాడని ఆనం ఆరోపించారు.  

పది శాతం కమిషన్ల రెడ్డిగా కరుణాకర్ రెడ్డికి పేరు 

తిరుపతిలో అందరూ భూవన కరుణాకర్ రెడ్డిని  10శాతం కమీషన్ల కరుణాకర్ రెడ్డి అంటున్నారని ఎద్దవా చేశారు.  స్కామ్‌లు చేసి.. కేసుల్లో ఇరుక్కొని.. కోటీశ్వరులైపోయి.. జగన్ రెడ్డి మిత్రులైతే టీటీడీ సభ్యులు అయిపోతారా? అని నిలదీశారు. జగన్ రెడ్డి ఏలుబడిలో టీటీడీ సభ్యులు కావాలంటే ఒకటి కోటీశ్వరులు అయినా అయ్యిండాలి..లేదా స్కామ్ లైనా చేసి ఉండాలి..గజదొంగలైనా అవ్వాలి..లేదా జగన్ రెడ్డితో వ్యాపార లావాదేవీ లైనా ఉండాలి. ఈ విధానం ఎంతమాత్రం సరైంది కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా జరుగుతున్న అవినీతిపై టీడీపీప్రభుత్వం రాగానే విచారణ జరిపించి.. తప్పుచేసిన వారిని కచ్చితంగా న్యాయస్థానాల్లో నిలబెడుతుందని హెచ్చరించారు.

ధర్మారెడ్డిపై ఢిల్లీలో కేసులు 

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఐఏఎస్ అధికారులు పనిచేయాల్సిన స్థానంలో డిఫెన్స్‌లో పనిచేసే ధర్మారెడ్డిని నియమించడం చట్ట, ధర్మ విరుద్ధం అని ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై సాటి సివిల్ సర్వీస్ అధికారులు స్పందించరా? అని నిలదీశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అటెండర్‌గా... జగన్ సేవలో తరించే ఆయన తిరుపతి గుమాస్తాగా ధర్మారెడ్డి పనిచేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి ఎంతో... తిరుమల లో ధర్మారెడ్డి అంత అని అభివర్ణించారు. ఢిల్లీకి చెందిన దీన్ దయాళ్ తల్వార్ 14 సెక్షన్ల కింద ధర్మారెడ్డిపై పెట్టిన కేసుల గురించి.. న్యాయస్థానం ధర్మారెడ్డికి నోటీసులు ఇచ్చిన విషయం జగన్ రెడ్డికి తెలుసా..లేదా? అని ప్రశ్నించారు. అన్నీ తెలిసి అనర్హుడిని ఎలా టీటీడీలో కొనసాగనిస్తారు? అని ప్రశ్నించారు. ఉదయం లేస్తే ధర్మారెడ్డి చేసే పని ఒక్కటే.. ప్రత్యేకవిమానంలో పూజారుల్ని ఎక్కించుకొని ఢిల్లీకి వెళ్లడం..అక్కడ ఆ శీర్వచనాల పేరుతో పెద్దపెద్దవాళ్లను కలిసి వారి ద్వారా తనకు కావాల్సిన పనులు .. ఇతర వ్యవహారాలు చక్కబెట్టుకోవడం అని విమర్శించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget