By: ABP Desam | Updated at : 22 Feb 2023 05:00 PM (IST)
పవన్ కు కేసీఆర్ ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదన్న ఏపీ బీఆర్ఎస్ చీఫ్
AP BRS : ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల కోసం పవన్ కల్యాణ్‌కు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రూ.వెయ్యి కోట్ల ఆఫర్ ఇచ్చారన్న ప్రచారాన్ని బి అర్ ఎస్ పార్టీ ఏపి అధ్యక్షుడు తోట చంద్ర శేఖర్ ఖండించారు. ఇలా ప్రచారం చేస్తున్న వారి దిగజారుడుతనానికి అర్థం పడుతుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పొత్తులు ఏ పార్టీతో అయినా పెట్టుకోవచ్చని అన్నారు.పొత్తు మేము పెట్టుకుంటే సంసారం ఇతరులు పెట్టుకుంటే వ్యభిచారం అన్నట్టు మాట్లాడడం సరికాదనిఅన్నారు. పొత్తు కోసం కేసీఆర్ డబ్బు ఆఫర్ చేశారని అభియోగాలు చేయడం వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసినట్టు అవుతుందని దేశంలో బిజెపికి ప్రత్యామ్నాయం బి అర్ ఎస్ పార్టీ అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ పాలకుల నిర్లక్ష్యం వల్ల గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు.దేశంలో రైతాంగ సమస్యలను ఏ ఒక్క పార్టీ పట్టించుకోలేదని అన్నారు.ఏపీ కి రాజధాని లేకపోవడం ప్రజల దురదృష్టమని బి అర్ ఎస్ పార్టీ అన్నీ రాష్ట్రాలలో విస్తరిస్తుందని అన్నారు. ముఖ్యమైన రైతాంగ సమస్యల పై బిఆర్ఎస్ దృష్టి పెడుతుందని అన్నారు.నిరుద్యోగం,ధరల నియంత్రణ లేకపోవడం ప్రధానంగా ఉన్నా సమస్యలని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి విభజన హామీలను సాధించుకోవాలని అన్నారు.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధనలో వైసిపి,టిడిపి పార్టీలు విఫలం అయ్యాయిని అన్నారు.పెద్ద పార్టీల లీడర్ల ను అవహేళన చేసే అభియోగాలు మోపడం తగదని అన్నారు.
బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేసే విషయంపై పవన్ కల్యాణ్‌ను కొంత మంది బీఆర్ఎస్ ప్రతినిధులు కలిసి ప్రాథమికంగా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి.. ఏపీ రాజకీయాలు ఎన్నికల తర్వాత ఎలా మారతాయి. బీఆర్ఎస్ , పవన్ కల్యాణ్ కలిస్తే ఎలాంటి రాజకీయ సమీకరణాలు ఏర్పడతాయి అన్నవాటిపై లోతైన పరిశీలనతో... బీఆర్ఎస్ ప్రతినిధులు పవన్ కల్యాణ్‌ను సంప్రదించినట్లుగా చెబుతున్నారు. అయితే ఇది మొత్తం బీఆర్ఎస్ వైపు నుంచి ఏపక్షంగా జరుగుతోంది కానీ పవన్ కల్యాణ్ ఇంత వరకూ ఎలాంటి ఆసక్తి చూపించలేదని చెబుతున్నారు.
ప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా ఆ రెండు పార్టీల తీరు ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పోటీ చేసే ఉద్దేశం ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఇటీవలే తెలంగాణలో కలిసి వచ్చే పార్టీతో పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. వీటన్నింటి పరిణామాల మధ్య .. రెండు పార్టీల మధ్య ఏదో జరుగుతోందన్నఅభిప్రాయం మాత్రం బలపడుతోంది. దీనిపై ముందు ముందు ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అనపర్తి ఎఫెక్ట్‌తోనే గన్నవరం విధ్వంసం- ప్రభుత్వంపై చంద్రబాబు సంచలన ఆరోపణలు
AP Highcourt : చట్ట ప్రకారమే అమరావతిలో హైకోర్టు ఏర్పాటు - కర్నూలుకు తరలించాలంటే ఏం చేయాలో చెప్పిన కేంద్రం !
పేర్ని నాని, వసంత కృష్ణ ప్రసాద్ అంతలా తిట్టుకున్నారా? అసలేం జరిగింది?
High Court Judges Transfer : హైకోర్టు జడ్జిల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం- ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు జడ్జిలు ట్రాన్స్ ఫర్
TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !
Polavaram : పోలవరం మొదటి దశలో 41.15 మీటర్ల మేరకే నీటి నిల్వ - తేల్చి చెప్పిన కేంద్రం !
Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు
Honda Shine 100: రూ.65 వేలలోపే 100 సీసీ బైక్ - హోండా షైన్ కొత్త వేరియంట్ గురించి ఐదు ఇంట్రస్టింగ్ విషయాలు!
రాహుల్‌పై అనర్హతా వేటు తప్పదా? ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమూ కోల్పోతారా?
Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి