By: Harish | Updated at : 25 Mar 2023 05:55 PM (IST)
ఏపీలో ఉపఎన్నికలు వస్తాయా ? వైఎస్ఆర్సీపీ వ్యూహకర్తల ప్లాన్ ఏంటి ?
Four MLAS : శాసన సభ్యుల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ప్రకంపలనకు కారణం అయ్యింది..అందులో భాగంగానే 24గంటల్లోనే సస్పెండ్ చేశారు. ఆ తరువాత కూడ ఆ నలుగురి పై కఠిన చర్యలుతీసుకునే విధంగా, అనర్హత వేటు వేసేందుకు అవసరం అయిన అంశాలను పరిశీలిస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహరం పై ఇంతటితో ఆగిపోకూడదనే ఉద్దేశంలో జగన్ ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అధికార పార్టీలో ఉంటూ, ప్రతిపక్ష పార్టీకి చెందిన అభ్యర్దికి ఓటు వేయటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ వ్యవహరంలో ఇంకా కఠినంగా వ్యవహరించటం ద్వారా భవిష్యత్ లో ఇలాంటి పరిస్దితుల వైపు శాసన సభ్యులు వెళ్లాలన్నా కూడ భయపడే విధంగా చర్యలు ఉండాలని భావిస్తున్నారు.
ఎమ్మెల్యేలపై అనర్హతా వేటుకు అవకాశం ఉందా ?
ఆ నలుగురు శాసన సభ్యుల పై అనర్హత వేటు వేసే అంశం పై కూడ పరిశీలన చేస్తున్నారని వైఎస్ఆర్ పార్టీ వర్గాల్లో ప్రచారం జోరు గా సాగుతోంది. అసెంబ్లి సాక్షిగా జరిగిన ఎమ్మెల్సీ కోటా ఎన్నికల్లో అదికార పార్టీకి చెందిన శాసన సభ్యులు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. అయితే ఇదే అంశానికి సంబందించిన ఆదారాలు ఇప్పుడు కీలకంగా మారాయి. క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన శాసన సభ్యులు పై అనర్హత వేటు వేయాలంటే, అందుకు సంబందించిన ఆధారాలు కూడా పకడ్బందీగా ఉండాలి. కేవలం మెక్కుబడిగా ఈ వ్యవహరాన్ని సాగదీయకుండా, అన్ని వైపుల నుండి అనర్హతకు అవసరం అయిన ఆధారాలను సేకరించటం ద్వారా ,భవిష్యత్ లో పోటీ చేయకుండా చర్యలు తీసుకునే విధంగా చర్యలు ఉండాలని భావిస్తున్నారని పార్టి వర్గాల్లో చర్చ జరుగుతుంది.
క్రాస్ ఓటింగ్ చేశారని ఆధారాలు ఎలా ?
క్రాస్ ఓటింగ్ కు సంబంధించిన ఆధారలు పూర్తిగా బయటకు తీసుకురాలేని పక్షంలో అందుకు ప్రత్యామ్నాయంగా అవసరం అయిన ఇతర అంశాల పై కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలు ఆరా తీస్తున్నారని అంటున్నారు. వాస్తవానికి అనర్హత అంశం...పై పార్టీ నాయకత్వం అంతగా శ్రద్ద చూపించలేదు.పార్టీ నుండి సస్పెండ్ చేయటం వరకే పరిమితం కాకుండా,ఇంకా ఎదైనా చర్య ఉండాలని భావించారు. అయితే అదే సమయంలో బీజేపి ప్రభుత్వం రాహుల్ గాందీ పై వేటు వేసి అంశం తెర మీదకు రావటంతో,అదే అంశాన్ని పార్టీ నేతలు ఆ నలుగురు శాసన సభ్యులు పై కూడ ప్రయోగించాలనే ఆలోచనకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
మరింత దూకుడుగా ఆ నలుగురు...!
పార్టీ నుండి సస్పెండ్ కు గురయిన ఆ నలుగురు శాసన సభ్యులు మరింత దూకుడుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు జగన్ సరైన గుర్తింపు ఇవ్వడం లేదని, సీనియర్లను కనీసం గౌరవించే సంస్కృతి లేదని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నమస్కారానికి ప్రతి నమస్కారం కూడా చేయరని తెలిపారు. రాజశేఖర్‍రెడ్డి వద్ద ఉండే గౌరవ మర్యాదలు జగన్ వద్ద లేవన్నారు. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనని, ఎమ్మెల్సీ ఇస్తామన్నారని, ఎమ్మెల్సీ అవకాశం తనకు వద్దని జగన్‍కు చెప్పానన్నారు. ఎవరో సలహాదారుల్ని ఎమ్మెల్యేలపై పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. సలహాదారులు జగన్‍కు ఇచ్చే సలహాలు ఏంటని ఆయన అన్నారు. వైసీపీలో నుంచి 50 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. వైనాట్ 175 అనడానికి జగన్‍కు ఉన్న ధైర్యం ఏంటని నిలదీశారు. ఏదో బటన్లు నొక్కి అంతా బాగుందని అనుకుంటున్నారని,ఉద్యోగులకు జీతాలివ్వకపోవడం చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.
Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై ఏపీ మంత్రుల సమావేశం, కీలక అంశాలపై చర్చ
Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?
Odisha Train Accident: "క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తాం, అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేస్తాం"
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?
Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్
Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?