అన్వేషించండి

YSRCP Gannavaram : వైసీపీలో మళ్లీ గన్నవరం పంచాయతీ - వంశీకి సీటిస్తే ఓడిస్తామంటున్న వైసీపీ నేతలు !

వంశీకి గన్నవరం టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని వైసీపీ నేతలు ప్రకటించారు. వైసీపీలో ఇలాంటి పంచాయతీలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

YSRCP Gannavaram  :  అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వరుసగా నియోజకవర్గ పంచాయతీలు వెలుగులోకి వస్తున్నాయి.  ఇప్పటికే రామచంద్రాపురం నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యుడు, మంత్రి కి మద్య విభేదాలు రచ్చకెక్కాయి.  తాజాగా గన్నవరం ఎపిసోడ్ కూడా అధికార పార్టీలో  తెర మీదకు వచ్చింది గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు స్దానిక శాసన సభ్యుడు వల్లభనేని వంశీకి  వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పటి కే ఈ వ్యవహరం పై స్వయంగా ముఖ్యమంత్రి జగన్ కూడ ఆరా తీశారు.  వల్లభనేని వంశీకి సీటు ఇస్తామని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది.  అయితే వంశీ కి సీటు  ఇవ్వటం పై గన్నవరంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్దానిక   నాయకులు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకటరావు వంశీకి వ్యతిరేకంగా మరో సారి సమావేశం అయ్యారు. వంశీకి ఎట్టిపరిస్దితుల్లో మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ స్థానిక నాయకత్వం కుండబద్దలు కొట్టి చెబుతోంది. 

వంశీకే సీటిస్తామని గతంలో హామీ ఇచ్చిన జగన్  
 
అయితే గన్నవరం నియోజకవర్గం సీటు తనదేనని శాసన సభ్యుడు వల్లభనేని వంశీ చెబుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి  జగన్ తనకు స్వయంగా హామీ ఇచ్చారని చెబుతున్నారు. అయితే స్దానిక నాయకత్వం పార్టీ కి వ్యతిరేకంగా కార్యకలాపాలను నిర్వహించటం సమంజసం కాదని వంశీ గతంలో   బహిరంగంగా వ్యాఖ్యానించారు. అయితే తెలుగు దేశం పార్టి టిక్కెట్ పై  గెలిచిన వంశీ, ఎన్నికల తరువాత పార్టీ మారి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టిలో చేరటం తో వివాదానికి కారణం అయ్యింది.  వంశీకి సీటు ఇస్తే ఎట్టి పరిస్దితుల్లో తాము సహకరించేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు.

పలు నియోజకవర్గాల్లో ఇలాంటి సమస్యలతో వైసీపీ నాయకత్వం సతమతం           

ఎన్నికల సమయంలో పార్టీల్లో నేతల మద్య విభేదాలు బయట పడట కామన్ గా జరుగుతుంటాయి. అయితే అధికార పార్టీలో గ్రూపుల గోల ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. అటు మంత్రి జయరాం నియోజకవర్గంలో కూడ అదే సీన్ కనిపిస్తోంది. కపట్రాళ్ల బొజ్జమ్మ మంత్రి నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండటం  పార్టీలో చర్చకు దారితీసింది. ఇటీవలే కపట్రాళ్ళ ఫ్యామిలీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఇలా వరుసగా వివాదాలు నెలకొంటున్న నేపద్యంలో పార్టీలో పరిస్దితులు పై అధి నాయకత్వం ప్రత్యేకంగా శ్రద్ద పెట్టింది. 

ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని పరిష్కారం చేసే ప్రయత్నం                

పార్టీ నాయకత్వం కూడా ఆయా నియోజకవర్గాల పరిస్దితులు పై ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పిస్తోంది. ఐ ప్యాక్ టీం లతో పాటుగా, ప్రైవేట్ సర్వేల ద్వారా కూడ నియోజకవర్గాల రిపోర్ట్ లను తెప్పిస్తున్నారు. అధికార పక్షంలో ఉన్నప్పటికి నాయకులు చివరి క్షణంలో, సీటు కోసం పార్టీని ఇరకాటంలోకి నెట్టటం సీఎం జగన్ సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. కొంత మంది నేతల్ని వదులుకోవడానికైనా సిద్ధమేనని జగన్ సంకేతాలు పంపుతున్నారని  చెబుతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
U19 Asia Cup 2025 IND vs PAK: భారత్‌కు 348 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చిన పాకిస్తాన్.. విజేతగా నిలవాలంటే రికార్డ్ ఛేజింగ్ తప్పదు
భారత్‌కు 348 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చిన పాకిస్తాన్.. విజేతగా నిలవాలంటే రికార్డ్ ఛేజింగ్ తప్పదు
Gade Innaiah Arrest: గాదె ఇన్నయ్య అరెస్ట్.. జనగామలో అదుపులోకి తీసుకున్న NIA అధికారులు
గాదె ఇన్నయ్య అరెస్ట్.. జనగామలో అదుపులోకి తీసుకున్న NIA అధికారులు
YS Jagan Birthday: వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, షర్మిల సహా పలువురు ప్రముఖులు
వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, షర్మిల సహా పలువురు ప్రముఖులు

వీడియోలు

Ind vs Pak Under 19 Asia Cup | నేడు ఆసియా అండర్‌-19 ఫైనల్‌
Rohit Sharma T20 World Cup | హిట్మ్యాన్ లేకుండా తొలి వరల్డ్ కప్
Ishan Kishan about T20 World Cup | ప్రపంచ కప్‌ ఎంపికైన ఇషాన్ కిషన్ రియాక్షన్
Sanju Samson about Opener Place | ఓపెనర్ ప్లేస్ సంజు రియాక్షన్ ఇదే
Sanju Samson For T20 World Cup 2026 | మొత్తానికి చోటు దక్కింది...సంజూ వరల్డ్ కప్పును శాసిస్తాడా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
U19 Asia Cup 2025 IND vs PAK: భారత్‌కు 348 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చిన పాకిస్తాన్.. విజేతగా నిలవాలంటే రికార్డ్ ఛేజింగ్ తప్పదు
భారత్‌కు 348 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చిన పాకిస్తాన్.. విజేతగా నిలవాలంటే రికార్డ్ ఛేజింగ్ తప్పదు
Gade Innaiah Arrest: గాదె ఇన్నయ్య అరెస్ట్.. జనగామలో అదుపులోకి తీసుకున్న NIA అధికారులు
గాదె ఇన్నయ్య అరెస్ట్.. జనగామలో అదుపులోకి తీసుకున్న NIA అధికారులు
YS Jagan Birthday: వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, షర్మిల సహా పలువురు ప్రముఖులు
వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, షర్మిల సహా పలువురు ప్రముఖులు
Nora Fatehi Car Accident: హీరోయిన్ కారుకు యాక్సిడెంట్... లేటెస్ట్‌ హెల్త్‌ అప్డేట్ - ఇప్పుడు అందాల భామకు ఎలా ఉందంటే?
హీరోయిన్ కారుకు యాక్సిడెంట్... లేటెస్ట్‌ హెల్త్‌ అప్డేట్ - ఇప్పుడు అందాల భామకు ఎలా ఉందంటే?
Revolver Rita OTT : ఓటీటీలోకి కీర్తి సురేష్ 'రివాల్వర్ రీటా' - ఎప్పటి నుంచి ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కీర్తి సురేష్ 'రివాల్వర్ రీటా' - ఎప్పటి నుంచి ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: తుపాకీతో కాల్చుకుని హైడ్రా కమిషనర్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం.. బెట్టింగ్ యాప్స్‌తో నష్టాలు!
తుపాకీతో కాల్చుకుని హైడ్రా కమిషనర్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం.. బెట్టింగ్ యాప్స్‌తో నష్టాలు!
Honda Activa vs TVS Jupiter.. యాక్టివా లేదా టీవీఎస్ జూపిటర్ ధర, మైలేజ్, ఫీచర్లలో ఏది బెస్ట్
Honda Activa vs TVS Jupiter.. యాక్టివా లేదా టీవీఎస్ జూపిటర్ ధర, మైలేజ్, ఫీచర్లలో ఏది బెస్ట్
Embed widget