By: ABP Desam | Updated at : 24 May 2023 05:11 PM (IST)
అఖిలప్రియకు బెయిల్ మంజూరు
Bhuma Akila Priya : మాజీ మంత్రి, టిడిపి నేత భూమా అఖిలప్రియకు కర్నూల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది . టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో భూమా అఖిలప్రియ ఆమె భర్త భార్గవ రామ్ ని ఈ నెల 17వ తేదిన పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి కోర్టు రిమాండ్ విధించింది. భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్ ను విచారించిన కర్నూల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అఖిలప్రియను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. ఈ నెల 16వ తేదీన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నంద్యాలకు చేరుకున్న సమయంలో భూమా అఖిలప్రియ వర్గీయులు ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు. తన చున్నీ లాగడంతో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసినట్టుగా భూమా అఖిలప్రియ చెబుతున్నారు.
ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో అఖిలప్రియ అరెస్ట్ -
భూమా అఖిలప్రియ వర్గీయుల దాడిపై ఏవీ సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 17న భూమా అఖిలప్రియ ఆమె భర్త భార్గవరామ్ అరెస్ట్ చేశారు. ఆళ్లగడ్డలో లోకేష్ పాదయాత్ర ముగిసి కడప జిల్లాలో అడుగుపెట్టిన తర్వాతి రోజే ఆమెకు బెయిల్ లభించింది. ఆమెకు బదులుగా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ఆళ్లగడ్డలో లోకేష్ పాదయాత్రను సమన్వయం చేశారు. చివరి రోజు సభకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించారు. ఆయన ప్రసంగం కూడా హైలెట్ అయింది.
విశ్వభారతి ఆస్పత్రి ముందు వైసీపీ శ్రేణుల ఆందోళన, ఎంపీ అవినాష్ కి కొంత సమయం ఇవ్వాలంటూ ప్లకార్డులు
జగత్ విఖ్యాత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆళ్లగడ్డలో లోకేష్ పాదయాత్ర
నంద్యాల జిల్లాలో ఈ రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో వర్గ పోరు నడుస్తోంది. ఏవీ సుబ్బారెడ్డి ఒకప్పుడు భూమా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. భూమా నాగిరెడ్డికి ఏవీ సుబ్బారెడ్డి మంచి స్నేహితుడు. ఆయన చనిపోయిన తర్వాత రాజకీయం పూర్తిగా మారిపోయింది. కొన్ని ఏళ్ల నుంచి కొనసాగుతున్న విభేదాలు ఇప్పుుడు తారాస్థాయి చేరుకున్నాయి. లోకేష్ పాదయాత్ర జరుగుతున్న టైంలోనే ఈ రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి.
రౌడీలకు స్వేచ్చ - రైతులపై 144 సెక్షన్ - ఏపీలో పరిస్థితులపై అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు !
ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె ఆగ్రహం
అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జశ్వంతి రెడ్డి కూడా మండిపడ్డారు. తండ్రి సమానమైన వ్యక్తిపై దారుణమైన ఆరోపణలు చేయడానికి అఖిలప్రియకు మనసెలా ఒప్పిందని ప్రశ్నించారు. ఆళ్లగడ్డ, నంద్యాల నుంచి పోటీ చేయాలని పార్టీ తమను ఆదేశిస్తే తానైనా, లేక తన తండ్రి ఏవీ సుబ్బారెడ్డి అయినా సరే బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నామన్నారు జస్వంతి రెడ్డి. ఒకవేళ అఖిలప్రియకు టికెట్ ఇస్తే మాత్రం ఆమె పతనానికి తాము పోటీ చేస్తామని వీడియోలో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఈ వివాదంపై టీడీపీ అధినేత త్రిసభ్య కమిటీని నియమించారు.
ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై ఏపీ మంత్రుల సమావేశం, కీలక అంశాలపై చర్చ
Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?
Odisha Train Accident: "క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తాం, అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేస్తాం"
Coromandel Train Accident: రైలు ప్రమాద స్థలం నుంచి ఏపీకి ప్రత్యేక రైలు, రాత్రి విజయవాడకు 50-60 మంది!
Chandrababu : పార్టీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే దూరమైనట్లే - సీనియర్ నేతలకు చంద్రబాబు హెచ్చరికలు !
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
Coromandel Express Accident: రాంగ్ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్
Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?
Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?