News
News
వీడియోలు ఆటలు
X

Narasarao pet News : కోటప్పకొండ అభివృద్ధిపై చర్చకు సవాళ్లు - నర్సరావుపేటలో టీడీపీ నేత అరెస్ట్ !

నర్సరావుపేటలో సవాళ్ల రాజకీయంతో ఉద్రిక్తత ఏర్పడింది. టీడీపీ నేత అరవింద్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

FOLLOW US: 
Share:

Narasarao pet News :  పల్నాడు జిల్లా నరసరావుపేటలో మరొకసారి టెన్షన్  వాతావరణం ఏర్పడింది. కోటప్పకొండ అభివృద్ది, ఎమ్మెల్యే గోపిరెడ్డి అక్రమాలు బయటపెడతానని దమ్ముంటే బహిరంగచర్చకు రావాలని టీడీపీ నేత అరవింద్ బాబు సవాల్ చేశారు. రెండు వర్గాలు ఇలా సవాల్లు చేసుకుని కోటప్పకొండకు వెళ్లేందుకుప్రయత్నించాయి.  కోటప్పకొండకుబయలుదేరిన అరవింద్ బాబు పోలీసులు అడ్డుకున్నారు. అరవింద్ బాబు ఆఫీస్ నుండి బయటకు రాకుండా గేట్లు మూసివేశారు. అయినప్పటికీ కోటప్పకొండ వెళ్లేందుకు ప్రయత్నించిన  అరవింద్ బాబు ను అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ కు తలించారు. 

గత కొన్ని రోజుకుగా అధికార, ప్రతిపక్ష నాయకులు మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ళు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలను నిరూపిస్తానని, బహిరంగ చర్చకు కోటప్పకొండకు రావాలని టీడీపీ నేత చదలవాడ వైసీపీ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు.   కోటప్పకొండపై బహిరంగ చర్చకు వెళ్ళనివ్వకుండా పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారని అన్నారు. జిల్లా ఎస్పీని ఈ కార్యక్రమం గురించి ముందుగా అనుమతి కోరామని, అయినప్పటికీ పోలీసులు ముందుగా హౌస్ అరెస్ట్ చేయడం గోపీరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓటమికి నిదర్శనమంటూ అరవింద్ అన్నారు. ప్రమాణం చేయటానికి నేను సిద్ధంగా ఉన్నానని, అవినీతి , అక్రమ, అసత్య రాజకీయాలు చేయటం‌లో గోపిరెడ్డి దిట్ట అంటూ అరవింద్ బాబు విమర్శించారు.

 గోపిరెడ్డి ప్రతి అడుగు‌లో అవినీతి ఉందని, ప్రతి అవినీతికి సాక్ష్యం ఉందని అన్నారు. ఇసుక, రేషన్, గుట్కా, మట్కా, గంజాయి, ల్యాండ్ మాఫియా అన్నింటిలోనూ ఎమ్మెల్యే హస్తం ఉందని ఆరోపించారు. అన్ని అవినీతి కార్యకలాపాలకు చిరునామా గోపిరెడ్డి అంటూ చదలవాడ అరవింద్ బాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. దోచుకో, దాచుకో అనే కోణం‌లో గోపీరెడ్డి పరిపాలన సాగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీడీపీ నేత చదలవాడ కామెంట్స్ పై నరసరావుపేట ఎమ్మెల్యే, వైసీపీ నేత గోపీరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పందించారు.  అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకు ముందే ఏ సవాళ్లకైన, ఏ చర్చకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పామని అన్నారు. ఉగాది రోజు కాకుండా మరో రోజు బహిరంగ చర్చకు సిద్ధం అని ముందుగానే మేము చెప్పామన్నారు.  ఉగాది రోజు అధికారులు సెలవులో ఉంటారని, మరోవైపు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని అన్నారు. మరోరోజు బహిరంగ చర్చ పెట్టమంటూ 13న మేము సవాళ్లు విసిరామని అన్నారు. 

13 నుండి 20 తారీఖు సాయంత్రం వరకు దీనిపై స్పందించకుండా సోమవారం స్పందనలో మీడియా ముందు ఉగాది రోజు చర్చకు రావాల్సిందే అంటూ ప్రకటించారని గోపిరెడ్డి అన్నారు. ప్రమాణానికి మేము ఎక్కడైనా, ఎప్పుడైనా సిద్ధమని ముందునుండే చెబుతున్నామని చెప్పామని అన్నారు. చదలవాడకు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు టిక్కెట్ కన్ఫర్మ్ చెయ్యలేదని, ఎలాగైనా టికెట్ సాధించాలనే తపనతో టీడీపీలో బలమైన సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకుని ఉనికిని చాటడంకోసమే చదలవాడ హైడ్రామా చేస్తున్నాడని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఉగాది తరువాత ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు నేను సిద్ధంగా ఉన్నానని గోపిరెడ్డి ప్రకటించారు. ఈ ఇద్దరి సవాళ్లతో నర్సరావుపేటలో ఉద్రిక్తత ఏర్పడింది. 

Published at : 22 Mar 2023 02:01 PM (IST) Tags: TDP Vs YSRCP Narsa Raopet News Gopireddy Srinivaas Reddy Chadalavada Aravind Babu

సంబంధిత కథనాలు

Kick Boxer Gayatri: ఇసుక తెన్నెల్లో మెరిసిన మాణిక్యం- జాతీయ స్థాయిలో 3 బంగారు పతకాలు సాధించిన గాయత్రి

Kick Boxer Gayatri: ఇసుక తెన్నెల్లో మెరిసిన మాణిక్యం- జాతీయ స్థాయిలో 3 బంగారు పతకాలు సాధించిన గాయత్రి

Odisha Train Accident: కోరమండల్ ప్రమాదం వివరాలు, ఫొటోలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ఒడిశా ప్రభుత్వం

Odisha Train Accident: కోరమండల్ ప్రమాదం వివరాలు, ఫొటోలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ఒడిశా ప్రభుత్వం

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

టాప్ స్టోరీస్

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్