అన్వేషించండి

TDP State Level Conference: "ఇదేం ఖర్మ.. ఆక్వా రైతాంగానికి" రేపు టీడీపీ రాష్ట్ర స్థాయి సదస్సు

TDP State Level Conference: టీడీపీ జాతీయ పార్టీ కార్యాలయంలో గురువారం రోజు  "ఇదేం ఖర్మ.. ఆక్వా రైతాంగానికి" రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించబోతున్నారు. 

TDP State Level Conference: "ఇదేం ఖర్మ.. ఆక్వా రైతాంగానికి" రాష్ట్ర స్థాయి సదస్సును గురువారం రోజు టీడీపీ జాతీయ పార్టీ కార్యాలయంలో నిర్వహించబోతున్నట్లు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. తెలుగుదేశం హయాంలో దేశంలోనే అగ్ర స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా రంగం.. నేడు సీఎం జగన్‌ రెడ్డి చర్యలతో పతనావస్థకు చేరుకుందని ఆయన ఆరోపించారు. సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులకు అండగా నిలబడేందుకే గురువారం ఈ సదస్సు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ‘‘ఇదేం ఖర్మ.. ఆక్వా రైతాంగానికి’’ అనే అంశంపై నేతలు మాట్లాడాతారని వివరించారు. ఈ సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి ఆక్వా రైతు సంఘం నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అచ్చెన్నాయుడు కోరారు. 


TDP State Level Conference:

అలాగే ఈ సదస్సుకు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడితో పాటు ముఖ్య నాయకులు కూడా హాజరవుతారని తెలిపారు. ఆక్వా రైతులకు జరుగుతున్న అన్యాయంపై చర్చించి ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ఆక్వా రైతులకు రూ.1.50 కే విద్యుత్‌ సరఫరా చేస్తానని జగన్‌రెడ్డి హామీ ఇచ్చి రైతులను వంచించారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ అమలు చేయకుండా విద్యుత్‌ కోతలతో ఆక్వా రంగాన్ని జగన్‌రెడ్డి నిండా ముంచారని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలతో ఆక్వా రైతులకు మద్దతు ధర లభించక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. అనేక షరతులతో సబ్సిడీలు ఎత్తివేసి ఆక్వా రైతులను వేధిస్తున్నారని పేర్కొన్నారు. రూ.5 వేల కోట్ల జెట్యాక్స్‌తో ఆక్వా రైతాంగాన్ని నాశనం చేస్తున్న సీఎం జగన్ చర్యలకు వ్యతిరేకంగా టీడీపీ చేస్తున్న పోరాటంలో ఆక్వా రైతులందరూ పాల్గొనాలని కోరుతున్నట్లు వివరించారు.

గత కొంత కాలంగా టీడీపీ ఇదేం ఖర్మ పేరుతో.. వైపీసీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తోంది. ప్రతిరోజూ ఏదో ఒక సమస్య పట్ల స్పందిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈరోజు విద్యార్థులను లారీలో తీసుకెళ్తున్న వీడియోనీ యాడ్ చేసి మరీ నిలదీశారు. 

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
Breaking News: ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
Amaravati Projects Budget: అమ‌రావ‌తిలో మొత్తం 119 ప‌నుల‌కు 66,802 కోట్లు ఖ‌ర్చు.. సభలో వెల్లడించిన మంత్రి నారాయణ
అమ‌రావ‌తిలో మొత్తం 119 ప‌నుల‌కు 66,802 కోట్లు ఖ‌ర్చు.. సభలో వెల్లడించిన మంత్రి నారాయణ

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget