Bonda Uma comments : మండలిని రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు ఓట్లెందుకు అడుగుతున్నారు - వైసీపీకి బొండా ఉమ సూటి ప్రశ్న !
మండలిని రద్దు చేస్తామన్న జగన్ ఇప్పుడు ఎలా ఓట్లు అడుగుతున్నారని టీడీపీ ప్రశ్నించింది.
Bonda Uma comments : శాసనమండలి వల్ల ఉపయోగలమే లేదని.. ప్రజాధనం రూ. అరవై కోట్లు లాస్ తప్ప ప్రయోజనమే ఉండదన్న సీఎం జగన్.. ఇప్పుడు ్ద శాసనమండలి ఎన్నికల్లో ఓట్లు ఎందుకు అడుగుతున్నారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ ప్రశ్నించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన 13 న జరగ బోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోకల్ బాడీస్ పట్టుబద్రులను ఓటు హక్కు అడిగే నైతిక హక్కు వైసీపీ కి లేదని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర లో పట్టభద్రుల స్థానిక సంస్థల ప్రతినిధులు కానీ ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర కి విశాఖ కు వైసీపీ నేతలు ఏమి చేశారని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ గా వైసీపీ అభ్యర్ధి ని గెలిపించాలని ఓ మొహం తో ఓట్లు అడుగుతారని.. ఆనాడు జగన్మోహన్ రెడ్డి శాసనమండలి ఎందుకు రద్దు చేస్తామని అన్నారు ఇప్పడు ఏమైందని మండిపడ్డారు. జగన్ కు ఓటమి భయం పట్టుకుంది అందుకే అభ్యర్ధి లను ఓట్లర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. విశాఖ లో ఎన్నో రకాలుగా పట్టభద్రుల ను భయ పెడుతున్నారన్నారు. పెద్ద పెద్ద మాటలు చెపుతున్నారు 175 కి 175 ..అంటున్నారని.. మంత్రి బొత్స,కోడి గుడ్లు మంత్రి ఇంటి ఇంటి కి వెళ్లి ఓట్లు అడ్డుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎయు వీసీ ప్రసాద్ రెడ్డి కూడా వైసీపీ అధికార ప్రతినిధి గా మారారని.. మేధావులు ఆంధ్రా యూనివర్శిటీకి దేశవ్యాప్త ఖ్యాతిని తీసుకు వస్తే ప్రసాద్ రెడ్డి మాత్రం దారుణంగా దిగజారారని విమర్శించారు.
రాయలసీమ లో ఆర్ జెడి ప్రసాద్ రెడ్డి ఉద్యోగుల ను ,టీచర్లను ఓట్లు వేయకపోతే మీ అంతు తెలుస్తాం అంటున్నారని.. విశాఖ పరిపాలన రాజధాని గా చేస్తాం అందుకే మా అభ్యర్థి ని గెలిపించాలని బొత్స అంటున్నారని మండిపడ్డారు. మీ ప్రభుత్వం వచ్చాక విశాఖ కు ఏమి చేశారో ఓ డాక్యుమెంటరీ ద్వారా చూపించు అని బొత్సకు బొండా ఉమ సవాల్ చేశారు. దారుణమైన అవినీతి, అసమర్థ పాలనతో ప్రజల జీవితాలు నాశనం చేశారుని.. విద్యార్థులను మోసం చేయాలని చూస్తున్నారు వైసీపీ నేతలకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. చంద్రబాబు హయాంలో విశాఖ కు లులు ప్రాజెక్ట్ తెస్తే వాళ్ళని బెదిరించి పంపించారు..ప్రముఖ ఐటీ పరిశ్రమలను తరిమేసిన వైసీపీకి ఎందుకు ఓట్లేయాలని బొండా ఉమ ప్రస్నించారు.
యువత భవిష్యత్ నాశనం చేసింది వైసీపీనేనన్నారు. విశాఖ ను రాజధాని అని చెప్పి వేలకోట్ల భూములు విజయ్ సాయి రెడ్డి దోచేశారన్నారు. వృద్ధుల భూములు, బేపార్క్ కూడా కొట్టేశారని బొండా ఉమ ఆరోపించారు. 22 a కింద ఉన్న భూములు 40 వేల కోట్ల విలువ చేసే భూములు వైసీపీ బడా నేతలు దోపిడీ చేశారు దీనికేనా మీకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. జోన్ తెస్తా...స్టీల్ ప్లంట్ ని కాపాడుతా అంటున్నారు ఎక్కువ ఎంపీలు గా ఉన్న పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడలేకపోతున్నారని మండిపడ్డారు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం మీ ఎంపీ ల తో ప్రధాని తో మాట్లాడవా .. అని నిలదీశారు. రోడ్లు లేవు పంచాయతీ అబివృద్ది లేదు రాజ్యం గ బద్దంగా వాళ్ళ నిధులు కూడా వాదేశావ్ ఎందుకు వేస్తారు నీకు ఓట్లని ప్రశ్నించారు. విశాఖ లో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ ద్వారా డ్రామాలు ఆడుతున్నారు.. సూట్లు కోట్లు వేసి 3 రోజుల పాటు నాటకాలు ఆడతారని మండిపడ్డారు.