AP Phone Tapping : ఏపీలో ఫోన్ ట్యాపింగ్ పై ఈసీకి టీడీపీ ఫిర్యాదు - డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్‌పైనే అనుమానం
Andhra News : ఏపీలో ఫోన్ ట్యాపింగ్ పై ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. పోలీసు ఉన్నతాధికారులు అధికారాన్ని దుర్వినియోగ పరుస్తున్నారని ఆరోపించారు.
TDP has filed a complaint to the Election Commission : అమరావతి: ఫోన్ ట్యాపింగ్ అంశం ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు రేపుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్‌కు గురైంది. దాంతో సీఎం జగన్‌పై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ఆదేశాలతో ప్రతిపక్ష నేతల ఫోన్లను అధికారులు ట్యాపింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై అడిషనల్ సీఈఓ కి టీడీపీ నేతల బృందం ఫిర్యాదు చేసింది.
*రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై అడిషనల్ సీఈఓ కి ఫిర్యాదు చేసిన తెదేపా నేతల బృందం*
— Devineni Uma (@DevineniUma) April 12, 2024
*ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రోద్భలంతోనే ఈ ఘటనలన్నీ జరుగుతున్నాయి. నారా లోకేష్ ఫోన్ టాపింగ్ పై ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలి*
కామెంట్స్:-
*_ఎన్నికల కోడ్ వచ్చిన 25 రోజుల్లో 35 తీవ్ర సంఘటనలు… pic.twitter.com/Ers4YF5d1E
ఎన్నికల కోడ్ వచ్చిన 25 రోజుల్లో 35 తీవ్ర సంఘటనలు జరిగినా నిందితులపై ఎక్కడా చర్యలు తీసుకోలేదని రిపోర్టులను సీఈవోకు టీడీపీ నేతలు చూపించారు. మచిలీపట్నంలో పోలీస్ స్టేషన్ పై దాడి, సీసీ కెమెరాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన పేర్ని నాని కేసు .. ఒంగోలులో బాలినేని శ్రీనివాస్ రెడ్డి నిన్న ఈరోజు చేసిన రాచకాల వంటి సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా 35 జరిగాయని దేవినేని ఉమ తెలిపారు. మచిలీపట్నం కేసులో పేర్ని నాని, కిట్టు లపై సరైన సెక్షన్లతో కేసు పెట్టి ఉంటే ఒంగోలులో బాలినేని సంఘటన జరిగింది ఉండేది కాదన్నారు.
పెన్షన్లు ఇంటింటికి ఇవ్వకుండా చేసిన అరాచకం, ససెర్ఫ్ సీఈవో మురళి రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల 33 మంది వృద్ధులు పెద్దవాళ్లు చనిపోయారని.. భవిష్యత్తులో పెన్షన్లు ఇవ్వాలంటే మురళీధర్ రెడ్డి లాంటి వ్యక్తి అక్కడ ఉండడానికి వీలులేదన్నారు. ఇటువంటి అన్ని సంఘటనలపై అడిషనల్ సీఈవో కు ఫిర్యాదు చేయడం జరిగింది వీటిపై చర్యలు తీసుకోవాలని కోరామనితెలిపారు. నారా లోకేష్ ఐఫోన్ టాప్ జరిగిందని కంపెనీ నుండి అలర్ట్ వచ్చింది . డిజి ఇన్చార్జిగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి అడిషనల్ డిజీగా ఉన్న సీతారామాంజనేయులు అందరూ కలిసి వాళ్ళకున్న అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ ఫోన్ టాపింగులకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఢిల్లీలో ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు కనకమెడల రవీంద్ర గారు ఫిర్యాదు చేశారు..ఇక్కడ ఉన్న అడిషనల్ సీఈఓ కి కూడా మేము కంప్లైంట్ ఇచ్చామమని తెలిపారు. పక్ష నేతలే కాదు ఎన్నికల అధికారుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని ఆరోపణలు చేశారు మాజీమంత్రి దేవినేని ఉమ. సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ 175 నియోజకవర్గాల్లో ఉన్న ప్రతిపక్ష నేతల మొబైల్స్ ట్యాప్ చేస్తున్నారని వివరించారు.