News
News
X

JC Prabhakar Reddy : రేయ్ పోలీస్ మీపై నమ్మకం పోయింది, జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

JC Prabhakar Reddy : తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై ఫైర్ అయ్యారు. తన అనుచరుడిపై వైసీపీ మద్దతుదారులు దాడి చేశారని అయినా పోలీసులు కేసు పెట్టరని ఆరోపించారు.

FOLLOW US: 
Share:

JC Prabhakar Reddy : 'రేయ్ పోలీసు మీపై నమ్మకం పోయింది' అంటూ తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి పోలీసులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ మద్దతుదారుల దాడిలో తీవ్రంగా గాయపడిన టీడీపీ కార్యకర్తను అనంతపురం ఆసుపత్రిలో జేసీ పరామర్శించారు. ప్రజలకు పోలీసుల మీద నమ్మకం పోయిందన్నారు. గాయపడిన గండికోట కార్తీక్ ను మెరుగైన చికిత్స కోసం బెంగుళూరుకు తరలిస్తామన్నారు. డీఎస్పీ చైతన్య పోలీసేనా? ఏ చైతన్య ఏమి చేస్తావు ? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను కేసు పెడతానని, 307 సెక్షన్ వేస్తారా అని ప్రశ్నించారు.

పోలీస్ వ్యవస్థపై నమ్మకం పోయింది- జేసీ

"మేము పోలీసులకు ఫిర్యాదు చెయ్యం, ఈ దాడిపై సుమోటో కేసుగా కట్టుకొని విచారణ చేయాలి. పోలీసులతో న్యాయం జరగదు. కంప్లైంట్ ఇవ్వడానికి పేపరు పెన్ను వేస్ట్. ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పంచి ఇప్పించి కొడతాం. పోలీసులు ఉన్నారని ఉరుకున్నాం. మేము కేసులు పెడితే మడిచి వెనుక పెట్టుకుంటున్నారు. పోలీసు వ్యవస్థపై నమ్మకం పోయింది. లోకేశ్ పాదయాత్ర చేస్తుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారు. పోలీసులు టీడీపీ వాళ్లపై పెట్టిన కేసులు మడిచి జేబులో పెట్టుకుంటాం. మేం ఎవరికీ తలవంచం. వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసులు పెట్టరు. టీడీపీ వాళ్లు ఏమైనా మాట్లాడితే వాళ్లపై కేసులు పెడుతున్నారు. పోలీసులు వైసీపీకి కొమ్ముకాస్తుంది. అధికారం ఎప్పుడూ ఒకరి చేతుల్లోనే ఉండదు. ప్రజలు మాతోనే ఉన్నారు. ఒక్కొక్కరిని పరిగెట్టిస్తాం. ఇదే నా సవాల్. డీఎస్పీ చైతన్య తీరు అభ్యంతకరం."- జేసీ ప్రభాకర్ రెడ్డి 

జేసీ అనుచరుడిపై దాడి 

అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు గండికోట కార్తీక్‌పై హత్యాయత్నం చేశారు కొందు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత కొంతమంది యువకులు ఆయనపై దాడి చేశారు.  దీంతో కార్తీక్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. తాను వెళ్తున్న మార్గంలో కాపు కాసి కత్తులు, కర్రలతో దాడి చేశారని బాధితుడు కార్తీక్ తెలిపారు. తాడిపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఇటీవల వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారనే నెపంతో వైసీపీకి చెందిన వాల్లే ఈ దాడికి పాల్పడ్డారని కార్తీక్ ఆరోపించారు. 

జేసీ వర్సెస్ డీఎస్పీ 

డీఎస్పీ చైతన్యపై తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. టైం దొరికినప్పుడు డీఎస్పీపై జేసీ విరుచుకుపడుతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఏజెంట్ గా చైతన్య వ్యవహరిస్తున్నారని ఇటీవల ఆరోపించారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, డీఎస్పీ ఇద్దరూ అక్రమ ఇసుక వ్యాపారంలో భాగస్వాములని ఆరోపించారు. డీఎస్పీ కార్యాలయాన్ని ఆయన వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంగా మార్చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఏది చెపితే అది డీఎస్పీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక ఆడపిల్లపై పగబట్టి 307 కేసును నమోదు చేశారని అన్నారు. తన మీద 59 కేసులు పెట్టారని తెలిపారు. తన సంబంధీకులు 861 మందిపై 307 సహా పలు కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. వందల మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాడిపత్రిలో నెలకొన్న పరిస్థితులపై తాను ఎంత మొత్తుకున్నా ఎవరూ వినలేదని చివరకు దీనిపై ఒక డీఐజీ వాస్తవాలను చెప్పారని అన్నారు. 

 

 

Published at : 30 Jan 2023 03:22 PM (IST) Tags: AP News JC Prabhakar Reddy Tadipatri TDP activist Ysrcp AP Police

సంబంధిత కథనాలు

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా

AP ByElections : ఏపీలో ఉపఎన్నికలు వస్తాయా ? వైఎస్ఆర్‌సీపీ వ్యూహకర్తల ప్లాన్ ఏంటి ?

AP ByElections :  ఏపీలో ఉపఎన్నికలు వస్తాయా ?  వైఎస్ఆర్‌సీపీ వ్యూహకర్తల ప్లాన్ ఏంటి ?

వైజాగ్ లో ఆకట్టుకుంటున్న " ఐ లవ్ వైజాగ్ "

వైజాగ్ లో ఆకట్టుకుంటున్న

APSWREIS: గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

APSWREIS: గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

Rajahmundry Bridge : రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జికి మరమ్మత్తులు, వాహన రాకపోకలు నిలిపివేత

Rajahmundry Bridge : రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జికి మరమ్మత్తులు, వాహన రాకపోకలు నిలిపివేత

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం