Paripurnananda Swamy : అప్పట్లో డెల్టా పేరుతో హిందూ పండుగలపై ఆంక్షలు.. ఇప్పుడు ఒమైక్రాన్ వచ్చినా క్రిస్మస్‌కు ఆంక్షల్లేవా ? ఏపీ సర్కార్‌పై పరిపూర్ణానంద ఆగ్రహం
హిందూ వ్యతిరేక నిర్ణయాలు మానుకోవాలని ఏపీ ప్రభుత్వానికి స్వామి పరిపూర్ణానంద హెచ్చరిక జారీ చేశారు. నిర్ణయాలు మారకపోతే తాడేపల్లి నుంచి తిరుమలకుపాదయాత్ర చేసి సెగ పుట్టిస్తానని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున హిందూ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని వాటిని ఆపకపోతే తాను తాడేపల్లి నుంచి తిరుమలకు పాదయాత్ర చేసి సెగ పుట్టిస్తానని స్వామి పరిపూర్ణానంద హెచ్చరించారు. పద్ధతులు మార్చుకోకపోతే ఆంధ్రప్రదేశ్లో గడపగడపకు తిరిగి మీరు చేసే అరాచకాలు గురించి బయట పెట్టాల్సి వస్తుందని స్పష్టం చేశారు. హిందూ వ్యతిరేక శక్తుల పట్ల కనికరం చూపించకుండా వ్యవహరించాలని సీఎం జగన్‌ను డిమాండ్ చేశారు. తన మాటలను పెడ చెవిన పెడితే హిందూ సునామీని చూస్తారని ఆయన తేల్చి చెప్పారు.
Also Read: ఏపీ పోలీసులపై కేంద్రం డేగకన్ను, త్వరలోనే అదంతా జరుగుతుంది.. సీఎం రమేశ్ సంచలనం
ప్రభుత్వ నిర్ణయాలపై స్పందించేందుకు ప్రెస్‌మీట్ పెట్టిన పరిపూర్ణానంద.. పలు అంశాల్లో తీవ్ర విమర్శలు చేశారు. డెల్టా వేరియంట్ నెపం తో గతంలో హిందువుల పండుగలపై ఆంక్షలు పెట్టారని.. ఒమైక్రాన్ నేపథ్యంలో క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కి అంక్షలు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. 151 సీట్లు వచ్చాయంటే అందులో కోటి 40 లక్షల ఓట్లు కేవలం హిందువులే వేశారని.. ఇప్పుడు హిందువులకే అన్యాయం చేస్తున్నారని ఆగ్రహించారు. ప్రతి జిల్లాలో పథకం ప్రకారం దేవాలయాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి కానీ ఎవరికీ పట్టుకోవడం లేదన్నారు. అంతర్వేది రథం కాల పెడితే వాళ్ళ గుడ్డలూడదీయాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. యూపీలో ఇలాంటి పనులు చేస్తే యో ఆస్తులు జప్తు చేస్తున్నారని గుర్తు చేశారు.
Also Read: Ramana Deekshitulu : స్వామీ.. కోర్టుకెళ్లి తేల్చుకుందామా ? టీటీడీపై మళ్లీ ట్వీటెత్తిన రమణదీక్షితులు !
తిరుమలోల వేయి కాళ్ల మండపం పునరుద్ధరిస్తామని జీయర్ స్వామి సమక్షంలో చెప్పారు ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. హిందువులంటే గొర్రెలు అనే భావన ుంటే మార్చుకోవాలన్నారు. టీటీడీ మిరాశీ అర్చకుల వ్యవస్థని ఉద్యోగులుగా మార్చారని.. అంటే మీ కాళ్లు పట్టుకుంటా కూర్చోవాలా అని మండిపడ్డారు. టీటీడీలో స్వామి వారి సేవలకు ధరలను విపరీతంగా పెంచుతున్నారని... ఆస్పత్రులు, విద్యాలయాలు, రోడ్లు నిర్మించాలంటే వేరే సొమ్ము తో పెట్టండి కానీ స్వామి వారి సేవలకు రూ., కోట్ల ధరలు నిర్ణయించి కాదని స్పష్టం చేశారు.
ఏపీలో కొన్ని శక్తులు విపరీతమైన డబ్బు ఖర్చుపెట్టి మతమార్పిడులు చేస్తున్నారని.. మతమార్పిడులు చేసేవారిని మీరు ఎందుకు అడ్డుకోవడం లేదని పరిపూర్ణానంద ప్రశ్నించారు. కర్ణాటకలో మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టం చేశారన్నారు. విజయవాడలో పగలగొట్టిన గుళ్ళను ఎప్పుడు పునర్నిర్మిస్తారో చెప్పాలన్నారు. బిజెపి కోరితే గతంలో కొన్ని ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించానని త్వరలో యూపీలో కూడా ఆ పార్టీ తరఫున కార్యక్రమాల్లో పాల్గొంటానని ప్రకటించారు. కానీ ఏపీ లో జరుగుతున్న పరిణామాలను రాజకీయ కోణంలో కాకుండా హిందుత్వ అజెండాతో పోరాటం చేస్తానని ప్రకటించారు. తన పోరాటం లో ఏ రాజకీయ పార్టీ నాయకులు వచ్చిన కలుపుకొని పోతానని.. రాజకీయాలు వేరైనా భక్తి మాత్రం అందరికీ ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read: పులివెందులలో పదివేల ఉద్యోగాలు.. ఆదిత్య బిర్లా కంపెనీకి జగన్ శంకుస్థాపన !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి