Shyam Death Case: మమ్మీ, జాబ్ చేయడం నా వల్ల కాదు, నేను వేస్టు- ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ వీడియో వైరల్
Shyam Death Case: నెట్టింటిన షేక్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ మృతి కేసులో సంచలనం విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆత్మహత్యకు ముందు అతను తీసుకున్న సెల్ఫీ వీడియోలు వైరల్ గా మారాయి.
Shyam Death Case: రెండు రోజుల క్రితం చనిపోయిన జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ మృతి కేసు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే శ్యామ్ మృతి వెనుక వైసీపీ నాయకులు హస్తం ఉందని ప్రతిపక్షం అనుమానపడుతోంది. దీనికి కౌంటర్‌గా అధికార పార్టీ ఆయన సెల్ఫీ వీడియోను వైరల్ చేస్తోంది.
శ్యామ్ ను ఎవరూ హత్యే చేయలేదని.. అతనే ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతోంది వైసీపీ. ఇతడు బలవన్మరణానికి పాల్పడేకంటే ముందు ఎందుకు చనిపోతున్నాడో చెబుతూ తీసుకున్న సెల్ఫీ వీడియోలు వైసీపీ అధికారిక హ్యాండిల్ నుంచి షేర్ చేసింది.
సుసైడ్ చేసుకోబోయే ముందు శ్యామ్ మాట్లాడిన వీడియో!
— YSR Congress Party (@YSRCParty) June 27, 2023
శ్యామ్ ఆత్మ కి శాంతి చేకూరాలి, ఈ విషాధ సమయంలో శ్యామ్ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి మరియు శ్యామ్ తోటి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరికి మా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాం 🙏🏻
శ్యామ్ కుటుంబ సభ్యులకి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా… pic.twitter.com/DANeXVEgCm
వీడియోలో ఏముందంటే..?
"మమ్మీ ఐయామ్ సారీ, డాడీ ఐయామ్ సారీ. నేనున్నా లేకపోయినా హ్యాపీగా ఉండండి. ఇన్ని రోజులు ప్రేమగా పెంచినందుకు థాంక్స్ మమ్మీ. నేను అందరి దృష్టిలో వేస్ట్. ఉన్నా లాభం లేదు. సరేనా మమ్మీ, డాడీ. ఐ లవ్ యూ. మళ్లీ జన్మంటూ ఉంటే మీకే పుట్టాలి. నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు. జాబ్ చేయాలని ఇంట్రస్ట్ అస్సలే లేదు. నా వల్ల కాదు జాబ్ చేయడం. అందుకే నేను డిసైడ్ చేసుకున్న. మిస్ యూ మమ్మీ, మిస్ యూ డాడీ. అన్నా సాయి సునీల్ అన్నా. ఐ లవ్ యూ అన్నా. బిగ్గెస్ట్ బ్రదర్ నువ్వే అన్నా. మళ్లీ జన్మంటూ ఉంటే నీ శిష్యుడిగా పుట్టాలన్నా. లవ్ యూ ఫరెవర్ సాయి అన్నా." - శ్యామ్, మృతుడు
వీడియోలు షేర్ చేస్తూ ఫైర్ అయిన వైసీపీ నేతలు..
సూసైడ్ చేసుకోబోయే ముందు శ్యామ్ మాట్లాడిన వీడియో అంటూ క్యాప్షన్ ఇచ్చారు. శ్యామ్ ఆత్మకి శాంతి చేకూరాలని కోరారు. ఈ విషాద సమయంలో శ్యామ్ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి, శ్యామ్ తోటి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరికి ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. శ్యామ్ కుటుంబ సభ్యులకి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని వివరించారు. ఈ ఘటనని రాజకీయంగా వాడుకోవాలని చంద్రబాబు, నారా లోకేష్ చూస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఇలాంటి నీచ రాజకీయాలకు నాయకులు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ సానుభూతిపరులు. ఇది చాలా బాధాకరం అన్నారు. దయచేసి రాష్ట్ర ప్రజలంతా ఒకటి గుర్తు పెట్టుకోవాలని.. ఇది ఎన్నికల సమయం, రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి కొంత మంది రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులు అని చెప్పుకునే నటులు ప్రయత్నిస్తూ ఉంటారని వివరించారు. ఇలాంటి విష ప్రచారాలను టీడీపీ, జనసేన పార్టీ నేతలు భవిష్యత్తులో ఇంకా చాలా చేస్తారని ఆరోపించారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ జగ్రత్తగా ఉండడంటూ ట్వీట్ చేశారు. దీనితో పాటు మూడు వీడియోలను కూడా జత చేశారు.
ఎన్టీఆర్ వీరాభిమాని అయిన శ్యామ్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలోని కొప్పిగుంట. కొంత కాలంగా అతని కుటుంబం తిరుపతిలో ఉంటుంది. అక్కడ ఓ అమ్మాయితో శ్యామ్ ప్రేమలో పడ్డాడట. వారం రోజుల క్రితం అమ్మమ్మ ఊరు అయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రుకు అతను వచ్చాడు. ప్రేమలో సమస్యలు, చదువు సాఫీగా సాగకపోవడం, ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.