YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Visakha Steel Plant workers : విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా షర్మిల దీక్ష చేపట్టారు. 48 గంటల్లో చంద్రబాబు విశాఖకు వచ్చి స్టీల్ ప్లాంట్ కార్మికులకు భరోసా ఇవ్వాలని డిమండ్ చేశారు.
Sharmila took up Diksha in support of Visakha Steel Plant workers : విశాఖలో షర్మిల స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా దీక్షకు దిగారు. చంద్రబాబు నలభై ఎనిమిది గంటల్లో 4200 మంది స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట కార్మికుల ను వెంటనే పనిలోకి తీసుకోనేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే నిరాహారదీక్ష ప్రారంభిస్తానని హెచ్చరించారు. కూర్మనపాలెం స్టీల్ ప్లాంట్ దీక్ష శిభిరంలో కార్మికుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. దీక్షా శీబిరం వద్ద రోడ్డుపై బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసన తెలిపారు. కనీసం నోటీసు ఇవ్వకుండా కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తుండటం దారుణమని.. నిర్వాసితులకు ఉద్యోగాలిస్తామని ఇవ్వకుండా రోడ్డున పడేశారని మండిపడ్డారు. కనీసం కాంట్రాక్ట్ పనులు చేసుకోనే వీలులేకుండా చేశారని.. ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికారంలో లేకపోవడంతో ప్రైవేటీకరణ కుట్రలు
స్టీల్ ప్లాంట్ ను నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీనేనని.. కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో లేకపోవడంతో ప్రైవేటీకరణకు సిద్దమయ్యారని ఆరోపించారు. కేంద్రానికి భూముల మీద కన్ను ఉంది.. ప్రైవేటీకరణ చేస్తే లాక్కోవచ్చుని కుట్ర చేస్తోందన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఇప్పటి వరకు ఎటువంటి భరోసా ఇవ్వడం లేదని.. కనీసం రా మెటీరియల్ కొనుక్కోనే పరిస్థితి కూడా ఉక్కు పరిశ్రమకు లేదన్నారు. పాలకుల నిర్వాకం వల్లే ప్లాంట్ ను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. నష్టాల సాకును చూపి ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని.. చంద్రబాబు, జగన్ ఎటువంటి భరోసాను ప్లాంట్ కార్మికులకు చేయడం లేదని ఆరోపించారు.
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
చిత్తశుద్ధితో స్టీల్ ప్లాంట్ ను ఆదుకునే ప్రయత్నమే చేయడం లేదు
చిత్తశుద్ధితో ఆదుకునే ప్రయత్నం ఎవరూ చేయడం లేదని.. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ఒక మిలియన్ టన్నుల ను కూడా ఉత్పత్తి చేయలేని దుస్థితిలో ఉందన్నారు. జగన్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందా అని అడిగారట అని ఆయనకు ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబు మాటలు తప్ప చేతలు ఉండవన్నారు. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు శిబిరానికి రావాలని.. 14 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు భోరాసాను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులను పర్మినెంట్ చేస్తున్నామని, స్టీల్ ప్లాంట్ స్పష్టమైన వైఖరిని చంద్రబాబు ప్రకటించాలన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందించకపోతే నిరాహార దీక్షలు ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని అవసరమైతే ఢిల్లీలో అయినా చేస్తామన్నారు.
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే తీసుకోవాలని డిమాండ్
స్టీల్ ప్లాంట్ నుచి ఇటీవల నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. స్టీల్ ప్లాంట్ కు ముడిసరుకు సమస్య ఉండటంతో ఉత్పత్తి సరిగ్గా జరగడం లేదు. ఈ కారణంగాభారీగా నష్టాలు వస్తున్నాయి. జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. దీంతో కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. దీనిపై కార్మికులు ఆందోళన చేస్తున్నారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల ధర్నాకు మద్దతుగా నిలిచారు.