అన్వేషించండి

Harshaveena: న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో

Arava Sridhar: జనసేన ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన హర్షవీణ మరో వీడియో రిలీజ్ చేశారు. పవన్ న్యాయం చేయకపోతే జనసేన పార్టీ ఆఫీసు ముందే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ వీడియో విడుదల చేశారు.

Arava Sridhar victim Harshaveena:    తెలంగాణ జనసేన ఎమ్మెల్యేపై ఆరోపణలు గుప్పిస్తున్న బాధితురాలు హర్షవీణ మరో కొత్త వీడియోను విడుదల చేశారు.  తన సమస్యపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించాలని, ఒకవేళ తనకు న్యాయం జరగకపోతే జనసేన పార్టీ కార్యాలయం ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని ఆమె హెచ్చరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

చిన్నప్పటి నుంచి తాను పవన్ కళ్యాణ్ సినిమాలను, ఆయన సిద్ధాంతాలను చూస్తూ పెరిగానని ఆమె పేర్కొన్నారు. తన తల్లిదండ్రుల లాగానే పవన్ కళ్యాణ్‌ను కూడా తమ కుటుంబ సభ్యుడిగా భావించానని ఆవేదన వ్యక్తం చేశారు. అంతగా నమ్మిన వ్యక్తి నేతృత్వంలోని పార్టీకి చెందిన ఎమ్మెల్యే తనను వేధించడం భరించలేకపోతున్నానని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తన కుటుంబం మొత్తం పవన్ కళ్యాణ్ అభిమానులేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఎమ్మెల్యే నుండి ఎదురవుతున్న వేధింపుల వల్ల తన వ్యక్తిగత జీవితం చిన్నాభిన్నం అయిందని ఆమె ఆరోపించారు. పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని, అందుకే నేరుగా పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మహిళా పక్షపాతిగా పేరున్న పవన్ కళ్యాణ్ తన విషయంలో మౌనం వీడాలని ఆమె డిమాండ్ చేశారు.

తాను చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉందని, ఒకవేళ తనకు న్యాయం దక్కని పక్షంలో ప్రాణాలు తీసుకోవడమే చివరి మార్గమని ఆమె స్పష్టం చేశారు. జనసేన కేంద్ర కార్యాలయం వేదికగానే తన నిరసనను ఆత్మహత్య రూపంలో తెలుపుతానని అనడం తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసు యంత్రాంగం, పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని ఆమె కోరుతున్నారు.   

 ఈ వ్యవహారంపై జనసేన అధిష్ఠానం ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే ఇటువంటి తీవ్రస్థాయి ఆరోపణలు రావడం, బాధితురాలు నేరుగా ఆత్మహత్య హెచ్చరికలు జారీ చేయడం పార్టీ ప్రతిష్టకు సవాలుగా మారింది. ఇప్పటికే అరవ శ్రీధర్ విషయంలో జనసేన నిర్దారణ కమిటీ విచారణ జరిపింది. నివేదికపై ఇంకా పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోలేదు. ఈ లోపు అరవ శ్రీధర్ మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వ్యక్తిగత సంబంధాల విషయంలో .. తేడాలొచ్చి ఆమె ఇలా ఆరోపణలు చేస్తున్నారని..  వారి వ్యక్తిగత జీవితానికి పార్టీకి సంబంధం లేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి.                           

 

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Ampolu Jail Visit: సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్షసాధింపు - ప్రమాదం హత్య కాదన్న జగన్ - అప్పలరాజుతో ములాఖత్ క్యాన్సిల్
సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్షసాధింపు - ప్రమాదం హత్య కాదన్న జగన్ - అప్పలరాజుతో ములాఖత్ క్యాన్సిల్
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
Why YSRCP Fire Brands Silent: వైసీపీలో అసలైన ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ - పార్ట్ టైమ్ పాలిటిక్స్‌కే మొగ్గు- ఫుల్ టైం ఎప్పటి నుంచి ?
వైసీపీలో అసలైన ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ - పార్ట్ టైమ్ పాలిటిక్స్‌కే మొగ్గు- ఫుల్ టైం ఎప్పటి నుంచి ?
Amaravati Mega Metropolitan Region: అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget