AP Sand Issue : ఏపీ ఇసుక తెలంగాణ బాట - ఒక్క రాత్రికి ఎన్ని లారీలు సరిహద్దు దాటుతున్నాయో తెలుసా ?

ఏపీ సరిహద్దులు దాటి ఇసుక తెలంగాణకు వెళ్లిపోతోంది. ఏపీ ప్రజలకు మాత్రం అందుబాటులో ఉండటం లేదు.

FOLLOW US: 

AP Sand Issue : ఏపీ ఇసుక అక్రమంగా పొరుగు రాష్ట్రాలకు తరలి పోతోంది. ఏపీ ప్రజలకు అత్యధిక ధర పెట్టినా ఇసుక దొరకని పరిస్థితి. కానీ ఏపీ ఇసుక మాత్రం పొరుగు రాష్ట్రాలకు తరలిపోతోంది. యన్ టి ఆర్ జిల్లా చందర్లపాడు మండలం కొడవటికల్లు వద్ద కృష్ణా నది నుండి హైదరాబాద్ కు ఇసుక తరలించడానికి నిత్యం తెలంగాణాకు చెందిన లారీలు సిద్దంగా ఉంటున్నాయి. ఈ ప్రాంతంలో సామాన్యుడికి చెంచా ఇసుక కూడ అంద‌టం లేదు. అయితే పెద్ద‌ల‌కు మాత్రం లారీల‌కు లారీలు..ట‌న్నుల‌కు ట‌న్నుల ఇసుక తరలి వెళ్లిపోతోంది. 

నిజానికి ఏపీలో  ఇసుక మొత్తం జేపీ వెంచర్స్ అనే సంస్థ చేతిలో ఉంది. ఆ సంస్థ తమిళనాడు కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్లుగా ప్రచారంలో ఉంది. ఏ సంస్థ అయినా ఇసుకను ఏపీలో ప్రజావసరాలకు అమ్ముకోవాలి. ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. అయితే చందర్ల పాడు నుంచి ఇసుకను జేపీ కంపెనీ తరలిస్తోందా.. స్దానికంగా ఉన్న రాజకీయ నాయకుల జోక్యంతోనే జ‌రుగుతుందా అనే దానిపై స్పష్టత లేదు. కానీ.. స్థానిక నేతల ప్రమేయం ఎక్కువ ఉందనే  ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 

అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాల్సిన సెబ్ అధికారులు కూడ పట్టించుకోవ‌టం లేదు..భారీ లోడింగ్ సామ‌ర్ద్యం క‌లిగిన లారీల్లో ట‌న్నుల కొద్ది ఇసుక లోడింగ్ జ‌రుగుతుంది.ఆ త‌రువాత స‌రిహ‌ద్దుల్లో ఉన్న ప్రాంతాల‌కు ఇసుక త‌ర‌లిపోతుంది.ఇక్క‌డ బిల్డ‌ర్లు కీల‌క పాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏపీకి చెందిన నాయ‌కులు చాలా మంది తెలంగాణాలో రియ‌ల్ ఎస్టేట్ బిల్డ‌ర్లు గా అవ‌తారం ఎత్తారు. మ‌రి కొంద‌రు రాజ‌కీయ పార్టి నేత‌ల ను అండ‌గా చేసుకొని చ‌క్రం తిప్పుతున్నారు. దీంతో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌కు ఇసుక కు కొద‌వ లేకుండాపోయింది.అదే సామాన్యుడికి మాత్రం ఇసుక అంద‌ని ద్రాక్ష‌గా మారింది. 

హైదరాబాద్ వెళ్ళే లారీల‌కు నదిలో లోడింగ్ చేసినందుకు ఒక్కో లారీకి 25 నుండి 35 వేల రూపాయ‌లు వ‌సూలు చేస్తున్నారు.ఇదంతా జే పి వెంచర్స్ కు  చెందిన ప్రైవేట్ సిబ్బంది  వసూలు చేస్తున్నార‌ని చెబుతున్నారు. ఇక్క‌డ నుండి తీసుకువెళ్లిన ఇసుక హైదరాబాదు లో టన్ను 3000 రూపాయలు చొప్పున అమ్మకాలు సాగిస్తున్నార‌ని అధికారుల‌కు ఫిర్యాదులు అందినా, వాటిని ప‌ట్టించుకోవడం లేదు. అందుకే వారికీ వాటా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.  ఈ విష‌యంలో ఎపీ అదికారులు సీరియ‌స్ గా దృష్టి సారించి అక్ర‌మ ఇసుక త‌ర‌లింపు పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అంటున్నారు.

Published at : 23 Jul 2022 08:17 PM (IST) Tags: ANDHRA PRADESH ap sand Sand Smuggling Chanderlapadu Reach

సంబంధిత కథనాలు

National Handloom Day : చేనేత కళాకారులకు ఎప్పుడూ అండగా నిలుస్తాం - సీఎం జగన్

National Handloom Day : చేనేత కళాకారులకు ఎప్పుడూ అండగా నిలుస్తాం - సీఎం జగన్

EX MLC Annam Satish: రూపాయి పెట్టి వంద దోచుకుంటున్నారు, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతిపై అన్నెం సతీష్ ఫైర్

EX MLC Annam Satish:  రూపాయి పెట్టి వంద దోచుకుంటున్నారు, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతిపై అన్నెం సతీష్ ఫైర్

Kurnool News : 'ఫ్రెండ్ షిప్ డే' నాడు విషాదం, వాగులో కొట్టుకుపోయిన నలుగురు మిత్రులు

Kurnool News : 'ఫ్రెండ్ షిప్ డే' నాడు విషాదం, వాగులో కొట్టుకుపోయిన నలుగురు మిత్రులు

Breaking News Live Telugu Updates: కామన్ వెల్త్ గేమ్స్ బాక్సింగ్ లో నిఖత్ జరీన్ కు స్వర్ణం 

Breaking News Live Telugu Updates: కామన్ వెల్త్ గేమ్స్ బాక్సింగ్ లో నిఖత్ జరీన్ కు స్వర్ణం 

Adinarayana Reddy : వైసీపీని 151 స్థానాల నుంచి 15కే పరిమితం చేస్తాం- ఆదినారాయణ రెడ్డి

Adinarayana Reddy : వైసీపీని 151 స్థానాల నుంచి 15కే పరిమితం చేస్తాం- ఆదినారాయణ రెడ్డి

టాప్ స్టోరీస్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Rabindranath Tagore: ఐన్‌స్టీన్‌, రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి స్నేహితులని మీకు తెలుసా?

Rabindranath Tagore: ఐన్‌స్టీన్‌, రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి స్నేహితులని మీకు తెలుసా?

PF Data Leak: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్తగా ఉండాలి - ఎందుకంటే మీ డేటా?

PF Data Leak: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్తగా ఉండాలి - ఎందుకంటే మీ డేటా?

NTR30: ఎన్టీఆర్ సినిమాలో కృతిశెట్టి - క్లారిటీ వచ్చేసింది!

NTR30: ఎన్టీఆర్ సినిమాలో కృతిశెట్టి - క్లారిటీ వచ్చేసింది!