IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Sajjala : నారాయణ బెయిల్‌ రద్దు కోసం పైకోర్టుకు వెళ్తాం - సజ్జల ప్రకటన !

నారాయణ బెయిల్ రద్దు చేయాలని పైకోర్టుకు వెళ్తామని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. నారాయణ తప్పు చేశారు కాబట్టే పోలీసులు అరెస్ట్ చేశారన్నారు.

FOLLOW US: 

మాజీ మంత్రి నారాయణకు దిగువ కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని ఎగువ కోర్టులో సవాల్ చేస్తామని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. తెల్లవారి జామున 3.40కి బెయిల్ ఇచ్చారని..  దేశ భద్రతకు సంబంధించిన విషయమైనట్లు వ్యవహరించారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. టెన్త్ పరీక్షల్లో కొన్ని సంస్థలే మాఫియా ముఠాలా తయారై మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డాయని సజ్జల ఆరోపించారు.  దానిపైనే అరెస్టుల పర్వం సాగి  నారాయణని అరెస్ట్ చేశారన్నారు. పరీక్ష పత్రం బయటకు రావడం, జగన్ వైఫల్యం అంటూ యాగీ చేశారని...ప్రభుత్వం స్పందించి కఠినంగా వ్యవహరించి నారాయణను అరెస్ట్ చేశారన్నారు. ఆయనే మంత్రిగా ఉంటే ఇక ఈ అక్రమాలు సాఫీగా జరుపుకున్నారని ఆరోపించారు. 

పిల్లల భవిష్యత్తుతో ఆడుకునే నేరం జరిగిందని... దాన్ని ఒక వ్యవస్తీకృతం చేశారని ఆరోపించారు.  ఇలాంటి నేరాన్ని ఈ సమాజం ఎలా పరిగణించాలి...? చూసి చూడనట్లు వదిలేయాలా...? 
ఈ పునాదులపై నారాయణ, చైతన్య లాంటి సంస్థలు పిల్లల బావిష్యత్తుతో ఆటలాడుకుంటుంటే ఎలా వ్యవహరించాలి..? అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే తీరు దారుణంగా ఉందని తప్పు పట్టారు. మాల్ ప్రాక్టీస్ తప్పు కాదు...మా విధానం అది అని చంద్రబాబు చెప్తారా...? అని ప్రశ్నించారు. నారాయణ అరెస్టులో రాజకీయ కక్ష ఏముందని సజ్ల ప్రశ్నించారు. నిన్న ఉదయం నుంచి క్షణం తీరిక లేకుండా జాతీయ సమస్యగా చర్చలు చేస్తున్నారని... ఫేస్ చేయడానికి అసలు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు..దాని వెనుక ఆయన కూడా ఉన్నారా..? అని సజ్జల ప్రశ్నించారు.  కుమారుడు  వర్ధంతి అని నారాయణ కూడా చెప్పలేదు..పోలీస్ శాఖ  తన పని తాను చేస్తోందన్నారు. 

 నారాయణ కాలేజీలకు  అల్లుడు,  కూతురు డైరెక్టర్లు అంటున్నారు...అయితే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చా...?  నారాయణ గైడ్ చేసి నేరం చేయించాడని గిరిధర్ చెప్తున్నాడు...మరి అతను నేరం చేయలేదా...?  ఇంతకన్నా డిగిజారుడి తనం ఏమైనా ఉందా చంద్రబాబు అని సజ్జల ప్రశ్నించారు. వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారని.. బెయిల్ రద్దు కోసం ప్రభుత్వం ఉన్నత న్యాయ స్థానానికి వెళ్ళడానికి ప్రభుత్వం నిర్ణయించిందని సజ్జల ప్రకటించారు. ఇలానే నడపాలనుకునే సంస్థలకు ఒక మెసేజ్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. రాజకీయ కక్ష్య అయితే ప్రభుత్వంలోకి రాగానే స్టార్ట్ చేసేవాళ్ళమని.. రాజకీయ కక్ష పెరు చెప్పి ఆ ముసుగులో ఎన్నాళ్లు బతుకుతారని సజ్జల ప్రశ్నించారు. 

  తాము  చెప్పుకోడానికి చేసిన మంచి చాలా ఉన్నాయి...పక్కదోవ పట్టించాలనే అవసరం మాకు లేదని సజ్జల అన్నారు.  చైతన్య, ఎన్నారై సంస్థలు కూడా కేసులో ఉన్నాయని.. ఎవరున్నా ఆధారాలు ఉంటే చర్యలు ఉంటాయి...ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా అరెస్ట్ చేశామన్నారు.  చంద్రబాబు అయినా అచెన్న, నారాయణ, ధూళిపాళ్ల అరెస్ట్ అయినా, కాబోతున్నా..ఆధారాలు లేకుండా వెళ్లడం లేదన్నారు.  ఇన్నర్ రింగ్ రోడ్ విషయం రికార్డ్స్ పరంగా అన్నీ అయ్యాయి..దానిలో వాళ్ళ దోపిడీ సాగలేదు  వాళ్ళు వచ్చి ఉంటే రింగ్ రోడ్డు ప్రారంభించేవాళ్లేమో..? ప్రభుత్వమే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీల మారి రైతులను మోసం చేసి లబ్ది పొందాలని చూశారన్నారు.  కోర్ట్ ముందు పెడుతున్నాం...ఆధారాలు ఉంటే కోర్టులే చూసుకుంటాయన్నారు. 

Published at : 11 May 2022 02:50 PM (IST) Tags: Narayana Sajjala Ramakrishnareddy Narayana arrested Narayana released on bail

సంబంధిత కథనాలు

TDP Mahanadu Live Updates: ఉన్మాది పాలన ఈ రాష్ట్రానికి శాపంగా మారింది - చంద్రబాబు

TDP Mahanadu Live Updates: ఉన్మాది పాలన ఈ రాష్ట్రానికి శాపంగా మారింది - చంద్రబాబు

Balakrishna Warning: మళ్లీ రిపీట్ అయితే ఖబడ్దార్! బాలకృష్ణ తీవ్ర హెచ్చరిక

Balakrishna Warning: మళ్లీ రిపీట్ అయితే ఖబడ్దార్! బాలకృష్ణ తీవ్ర హెచ్చరిక

TDP First Mahanadu : తొలి "మహానాడు" ఎవర్‌గ్రీన్ - ఆ విశేషాలు ఇవిగో

TDP First Mahanadu :  తొలి

TDP Mahanadu: మహానాడుకు వెళ్లే వారికి పోలీసులు కీలక సూచనలు, ఇవి పాటిస్తే చాలా ఈజీగా వెళ్లిరావొచ్చు

TDP Mahanadu: మహానాడుకు వెళ్లే వారికి పోలీసులు కీలక సూచనలు, ఇవి పాటిస్తే చాలా ఈజీగా వెళ్లిరావొచ్చు

Mahanadu 2022: టార్గెట్‌ 2024గా మహానాడు- పసుపు పండగతో టీడీపీలో కొత్త ఉత్తేజం

Mahanadu 2022: టార్గెట్‌ 2024గా మహానాడు- పసుపు పండగతో టీడీపీలో కొత్త ఉత్తేజం
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Stock Market News: బలపడ్డ రూపాయి.. భారీ లాభాల్లో ఓపెనైన సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market News: బలపడ్డ రూపాయి.. భారీ లాభాల్లో ఓపెనైన సెన్సెక్స్‌, నిఫ్టీ

Rahul Gandhi: ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ సతమతం, ప్రశ్న అడగ్గానే ఏం చెప్పాలో అర్థం కాలేదా? - వీడియో వైరల్

Rahul Gandhi: ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ సతమతం, ప్రశ్న అడగ్గానే ఏం చెప్పాలో అర్థం కాలేదా? - వీడియో వైరల్

Yoga Day Utsav: యోగా ఉత్సవ్ డే ప్రారంభం- యంగ్‌గా ఉండాలంటే యోగా చేయమంటున్న సెలబ్రెటీలు

Yoga Day Utsav:  యోగా ఉత్సవ్ డే ప్రారంభం- యంగ్‌గా ఉండాలంటే యోగా చేయమంటున్న సెలబ్రెటీలు

Karimnagar: సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తుగడ! ఏకంగా లాయర్‌నే బురిడీ - రూ.లక్షలు హుష్‌కాకీ!

Karimnagar: సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తుగడ! ఏకంగా లాయర్‌నే బురిడీ - రూ.లక్షలు హుష్‌కాకీ!