అన్వేషించండి

Sajjala On Amaravati: అమరావతిని వ్యతిరేకించలేదు - జగన్ ఎప్పుడూ రాష్ట్రానికి ద్రోహం చేయలేదు - సజ్జల వివరణ

Sajjala Ramakrishna Reddy : అమరావతిని జగన్ వ్యతిరేకించలేదని సజ్జల రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు. భారీ భవనాల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారనే జగన్ ప్రశ్నించారన్నారు.

Jagan was not against Amaravati : అమరావతిని జగన్ వ్యతిరేకించలేదని వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. జగన్ ఇల్లు అమరావతిలోనే ఉందన్నారు. పెద్దపెద్ద  భవనాలను కడుతూ ప్రజాధనం వృధా చేస్తున్నారనే జగన్ ప్రశ్నించారన్నారు.  అమరావతి అనేది కేవలం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందని, అక్కడ చంద్రబాబు నాయుడు తన అనుకూల వర్గాలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదన్నారు.  జగన్ ఎప్పుడూ రాష్ట్రానికి ద్రోహం చేయలేదని స్పష్టం చేశారు. 

రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతినే ప్రశ్నించారు !                                 

రాజధాని పేరుతో అక్కడ పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు జరిగాయని, అవినీతి చోటు చేసుకున్నప్పుడు దానిని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అమరావతిని అభివృద్ధి చేస్తామంటున్న కూటమి ప్రభుత్వం, కేవలం గ్రాఫిక్స్‌తోనే కాలక్షేపం చేస్తోందని సజ్జల విమర్శించారు. చంద్రబాబు గతంలో రాజధాని నిర్మాణానికి సంబంధించి చేసిన వాగ్దానాలు ఏవీ నెరవేరలేదని, ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతిని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. పారదర్శకత లేకుండా అక్కడ సాగుతున్న పనులపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, కేవలం భ్రమలు కల్పించడం ద్వారా ప్రజలను మోసం చేయలేరని ఆయన వ్యాఖ్యానించారు.  అమరావతిలో సాగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తే అభివృద్ధిని అడ్డుకుంటున్నట్లు చిత్రీకరించడం సరికాదని, బాధ్యత గల ప్రతిపక్షంగా తాము ప్రజా ప్రయోజనాల కోసం నిలబడతామని ఆయన స్పష్టం చేశారు.

అమరావతి గురించి జగన్ ఏమన్నారంటే? 

అమరావతి రాజధానిని వరద ముప్పు ఉన్న ప్రాంతంలో నిర్మిస్తున్నారని జగన్ మోహన్ రెడ్డి  మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ  విమర్శించారు. కృష్ణా నది గర్భానికి  అత్యంత సమీపంలో, లోతట్టు ప్రాంతాల్లో భవనాల నిర్మాణం చేపట్టడం వల్ల భవిష్యత్తులో భారీ వరదలు వస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతంలో  నిర్మించిన నివాసాల గురించి ప్రస్తావిస్తూ   రాజధాని ప్రాంతంలో ఐదు అడుగుల మేర మట్టిని నింపి భారీ భవనాలు నిర్మించాల్సి రావడం వల్ల నిర్మాణ వ్యయం విపరీతంగా పెరుగుతుందని, ఇది ప్రజా ధనాన్ని వృధా చేయడమేనని జగన్ పేర్కొన్నారు. అమరావతిని  సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు గా చంద్రబాబు అభివర్ణించినా, వాస్తవానికి అది ఒక అసాధ్యమైన మోడల్ అని ఆయన విమర్శించారు. కేవలం రియల్ ఎస్టేట్ లబ్ధి కోసమే నదీ గర్భం పక్కన ఉన్న భూములను ఎంచుకున్నారని, భవిష్యత్ తరాల భద్రతను విస్మరించారని ఆయన తన వ్యాఖ్యల్లో స్పష్టం చేశారు.

వైసీపీ విధానంపై గందరగోళం 

అమరావతి విషయంలోవైసీపీ విధానంపై ప్రజల్లో  గందరగోళం ఏర్పడుతోంది. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. జగన్ అమరావతికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తే సజ్జల అలాంటిదేమీలేదంటారు. మరొకరు మరో విధంగా ప్రకటన చేస్తారు. ఈ గందరగోళంపై వైసీపీ క్లారిటీ ఇవ్వకపోతే గందరగోళం అలాగే కొనసాగే అవకాశం ఉంది. 

             

టాప్ హెడ్ లైన్స్

AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
SaiKrishna Custodial Death: గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
విజయవాడ గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
IMD Weather Update: ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Bigg Boss 10 Telugu Contestants: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Embed widget