అన్వేషించండి

Republic Day 2024 LIVE: ఏపీలో గణతంత్ర వేడుకలు - జెండా ఎగరేసిన గవర్నర్

Republic Day 2024 LIVE Updates: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జ‌రుగుతున్నాయి.

LIVE

Key Events
Republic Day 2024 LIVE: ఏపీలో గణతంత్ర వేడుకలు - జెండా ఎగరేసిన గవర్నర్

Background

Republic Day 2024 in Vijayawada: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నిర్వహిస్తోంది. అందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు నిన్ననే పూర్తి అయ్యాయి. గణతంత్ర దిన వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ జెండా వందనం చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఇందుకోసం సీఎం జగన్ శుక్రవారం ఉదయం 8.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరతారు. గణతంత్ర వేడుకలలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ తో కలిసి పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి తాడేపల్లికి తిరుగు పయనం కానున్నారు. మళ్లీ సాయంత్రం 4.15 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆథిద్యం ఇచ్చే హై టీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు.

 రిపబ్లిక్ డే అంటే మనకి గుర్తొచ్చేది స్కూల్ యూనిఫామ్, రెడీ అవ్వడం, ఫ్లాగ్​ని పట్టుకోవడం, ఫ్లాగ్ హోస్టింగ్, స్పీచ్. వయసు మారినా.. జనరేషన్ మారినా.. ఇవి మాత్రం కామన్​గా జరుగుతుంటాయి. అయితే స్కూల్​కి రెడీ అయి వెళ్లడం వరకు బాగానే ఉంటుంది. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత స్పీచ్ చెప్పమంటే కాస్త భయంగానే ఉంటుంది. కేవలం స్టూడెంట్స్​కే కాదు టీచర్లకు కూడా ఏమి స్పీచ్ ఇవ్వాలి? ఎలాంటి స్పీచ్​ ఇవ్వాలని అంశంపై కాస్త భయం ఉంటుంది. అయితే మీరు ఎలాంటి భయం లేకుండా స్వీచ్ ఎలా ఇవ్వాలో ఇక్కడ ఉంది. మీరు చూసేయండి. రిపబ్లిక్ డే రోజు చెప్పేయండి.

రిపబ్లిక్ డే స్పీచ్ అంటే ఏదో ఫార్మాలటీగా ఇచ్చేది కాదు. టీచర్స్​కి పిల్లలకు చెప్పేందుకు చాలా విషయాలు ఉంటాయి. కానీ స్టూడెంట్స్​కి కాస్త తక్కువ అవగాహన ఉంటుంది. పైగా మంచి స్పీచ్ ఇచ్చిన స్టూడెంట్స్​కి బహుమతులు ఇస్తారు కాబట్టి.. మీరు స్వీచ్ ఇచ్చేప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అసలు రిపబ్లిక్ డే అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏంటి? దీని కోసం ఎవరు త్యాగం చేశారు వంటి విషయాలు ఆసక్తిని కలిగిస్తాయి. 

స్టూడెంట్స్ స్పీచ్ ఇవ్వాలంటే..

ముందుగా స్జేజ్ మీద ఉన్న పెద్దలందరికీ విష్ చేయాలి. తర్వాత స్టూడెంట్స్​కి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్పాలి. 200 ఏళ్ల బ్రిటీష్ పాలను నుంచి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన విధానం.. సార్వభౌమాధికార ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ఎలా మారింది వంటి విషయాలు చెప్పాలి. జాతీయ గీతం, జాతీయ జెండా ప్రాముఖ్యతలు చెప్పవచ్చు. జాతీయ గీతం ఎవరు రాశారు? జాతీయ జెండాలో రంగులు దేనిని సూచిస్తాయి వంటి అంశాలు స్పీచ్​ను ఇంట్రెస్టిగ్​గా మారుస్తాయి. మనం జనవరి 26న ఎందుకు రిపబ్లిక్ డే చేసుకుంటాము? భారత రాజ్యాంగం ఆ రోజున ఉనికిలోకి వచ్చింది. కాబట్టి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల ప్రాధాన్యతను చెప్పవచ్చు. ఈ అంశాలను మీరు స్పీచ్ ఇచ్చేప్పుడు లేదా వ్యాసాల పోటీల్లో పాల్గొనేప్పుడు ఫాలో అవ్వొచ్చు.

టీచర్స్​ స్పీచ్ ఎలా ఉండాలంటే..

స్టూడెంట్స్​కి తెలియని విషయాలు, వాటి పుట్టుపూర్వోత్తరాలు చెప్పగలిగే నాల్డెజ్ ఉండాలి. ఉదాహరణకు రిపబ్లిక్ డే అంటే ఏమిటి అనగానే గణతంత్ర దినోత్సవం అని చెప్తారు. అసలు రిపబ్లిక్ డే ఎందుకు వచ్చింది. ఆ రోజు ఏమి జరిగింది వంటి విషయాలపై పిల్లలకు అవగాహన కల్పించవచ్చు. రాజ్యంగా రాయడానికి ఎన్ని నెలలు పట్టింది? ఎంత ఖర్చు అయింది వంటి విషయాలు చెప్పవచ్చు. ఈ సమయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురించి కచ్చితంగా గుర్తుచేసుకోవాలి. మనకి స్వాతంత్ర్యం వచ్చిన ఎన్ని ఏళ్లకు రాజ్యాంగాన్ని పూర్తి చేయగలిగారు వంటి విషయాలు చెప్తే పిల్లలకు మంచిగా ఉంటుంది. వారికి కొన్ని ముఖ్యవిషయాల పట్ల అవగాహన పెరుగుతుంది. 

 

స్పీచ్ ఇచ్చే సమయంలో స్టూడెంట్స్ అయినా.. టీచర్స్ అయినా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. దీనివల్ల మీరు చెప్పాలనుకునే కచ్చితంగా చెప్పగలుగుతారు. లేదంటే మీరు అన్ని విషయాలు కలిపి చెప్పేస్తారు. కాబట్టి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు అనేది ముందుగానే ప్రిపేర్ అయితే స్ట్రెస్ ఉండదు.

09:59 AM (IST)  •  26 Jan 2024

Republic Day 2024 LIVE: విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో రిపబ్లిక్‌ డే వేడుకలు- ప్రభుత్వ పనితీరు వివరించిన గవర్నర్‌

విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్రవేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఎగరవేసిన గవర్నర్ నజీర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అంతకు ముందు వివిధ శాఖలు ప్రదర్శించిన శకటాలను పరిశీలించారు. భద్రతా బలగాలు పరేడ్‌ నిర్వహించాయి. అందరూ గవర్నర్‌కి గౌరవందనం చేశాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్‌తోపాటు సీఎం జగన్ దంపతులు హాజరయ్యారు. ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
Revanth Meets Modi: ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
Embed widget