అన్వేషించండి

Andhra Pradesh Weather Report: ఏపీని ముంచెత్తిన వాన- ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి- లంక గ్రామాల్లో భయం భయం

Weather Forecast In AP: ఆంధ్రప్రదేశ్‌ వర్షాలు తగ్గలేదు. నదులు, జలాశయాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరో రెండు రోజులు ఇలానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Weather Latest News : ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల నుంచి జోరువానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని పూరీ సమీపంలో తీర దాటొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు వర్షాలు కురుస్తాయని చెబుతోంది. 

ఒడిషా, ఉత్తరాంధ్రప్రదేశ్ తీరాలకు అనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారింది. ఇది పూరి సమీపంలో కళింగపట్నానికి సుమారు 200 కిలోమీటర్లకుపైగా దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇవాళ తీరం దాటే ఛాన్స్ ఉంది. ఈ వాయుగుండం ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలి 24 గంటల్లో బలహీనపడుతుంది అని వాతావరణ శాఖ వెల్లడించింది. 

మరోవైపు రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతోంది. దీని ప్రభావం కూడా వాతావరణంపై ఉంది. జైసల్మేర్, కోటా, గుణ, సాగర్, రాయ్పూర్, పూరీ మీదుగా వెళ్తున్న ద్రోణీ ఆగ్నేయ దిశగా ఒడిశా, ఉత్తర ఆంధ్ర తీరాలుపై ప్రభావం చూపిస్తుంది. 

వర్షాలు జోరుగా పడుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు... ప్రతి జిల్లాలో ఉన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని వాగులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి నీటి మట్టం గంట గంటలకు పెరుగుతూనే ఉంది. శబరి, మంజీర, ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని, మానేరు, పర్ల, ప్రవర ఇలా అన్ని ఉపనదులు కూడా ఉప్పొంగి ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. గోదావరికి వరద నీరు పోటెత్తడంతో పోలవరం వద్ద స్పిల్‌వే మూడు లక్షల 30 వేలక్యూసెక్కులపైగా వరద నీటిని దిగువకు వదులుతున్నారు. భద్రాచలం వద్ద నీటి మట్టం 36.5 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. 

పోలవరం వద్ద ఉన్న గండిపోశమ్మ ఆలయం నీట మునిగింది. దీంతో ఆ ఆలయానికి భక్తుల రాకపోకలను అధికారులు నిలిపేశారు. దవళేశ్వరం వద్ద కూడా నీటి మట్టం భారీగా పెరిగింది. నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇలా వరద నీరు పెరగడంతో ముంపు ప్రాంతాలు భయం గుప్పెట్లో బతుకుతున్నాయి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఏటా వరదలు రావడం ఇక్కడ లంక గ్రామాలు మునిగిపోవడం సర్వసాధారణమైపోయింది. 

శ్రీశైలజలాశయానికి వరదపోటు -
2024-25 ఏడాది వర్షాకాల సీజన్‌లో శ్రీశైల జలాశయానికి వరద పోటు మొదలైంది. మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాలకు కృష్ణానది ఎగువ పరివాహకంలోని ఆలమట్టి, నారాయణాపూర్, జూరాల డ్యాంలు నిండి నీటిమట్టాలు పూర్తిస్థాయికి చేరడంతో వరదజాలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈక్రమంలో జూరాల డ్యాం వద్ద జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తూ శ్రీశైల జలాశయానికి నీటిని వదులుతున్నారు. దీంతో జూరాల నుంచి శ్రీశైలానికి 34,818 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది.  శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.80టీఎంసీలు. శుక్రవారం రాత్రి సమయానికి జూరాల నుంచి భారిగా 34,818 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోన్న నేపథ్యంలో శ్రీశైలం డ్యాం నీటిమట్టం 809.10అడుగులకు చేరగా జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం 33.8136 టీఎంసీలుగా నమోదయింది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu News: రైలు పట్టాలపై చంద్రబాబు, ఇంతలోనే వేగంగా దూసుకొచ్చిన రైలు
రైలు పట్టాలపై చంద్రబాబు, ఇంతలోనే వేగంగా దూసుకొచ్చిన రైలు
CM Revanth Reddy: 'కొత్త ఆవిష్కరణలతో ప్రజల జీవితాల్లో మార్పులు' - ఏఐ సదస్సులో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు, రోడ్ మ్యాప్ ఆవిష్కరణ
'కొత్త ఆవిష్కరణలతో ప్రజల జీవితాల్లో మార్పులు' - ఏఐ సదస్సులో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు, రోడ్ మ్యాప్ ఆవిష్కరణ
Satyavedu TDP MLA : సత్యవేడు ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు -  వీడియోలు రిలీజ్ చేసిన బాధితురాలు!
సత్యవేడు ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు - వీడియోలు రిలీజ్ చేసిన బాధితురాలు!
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ విగ్రహానికి నేత్రాలంకరణ పూర్తి, ఈసారి ఎత్తు ఎంతంటే
ఖైరతాబాద్ గణేష్ విగ్రహానికి నేత్రాలంకరణ పూర్తి, ఈసారి ఎత్తు ఎంతంటే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Floods At Gabbarsingh Re Release Chilakaluripet |నడుం లోతు నీళ్లలోనూ సినిమా చూస్తున్న ఫ్యాన్స్ |ABPRobotic Life Jacket SDRF | ఏలూరులో తమ్మిలేరులో రోబోటిక్ లైఫ్ జాకెట్ డెమో | ABP DesamSanitation Work Vijayawada Flood Affected Areas |  బురదను క్లీన్ చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందిTornado ravages Medaram forest | మేడారం అడవిలో వేలసంఖ్యలో పెలికించుకుపోయిన వృక్షాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu News: రైలు పట్టాలపై చంద్రబాబు, ఇంతలోనే వేగంగా దూసుకొచ్చిన రైలు
రైలు పట్టాలపై చంద్రబాబు, ఇంతలోనే వేగంగా దూసుకొచ్చిన రైలు
CM Revanth Reddy: 'కొత్త ఆవిష్కరణలతో ప్రజల జీవితాల్లో మార్పులు' - ఏఐ సదస్సులో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు, రోడ్ మ్యాప్ ఆవిష్కరణ
'కొత్త ఆవిష్కరణలతో ప్రజల జీవితాల్లో మార్పులు' - ఏఐ సదస్సులో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు, రోడ్ మ్యాప్ ఆవిష్కరణ
Satyavedu TDP MLA : సత్యవేడు ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు -  వీడియోలు రిలీజ్ చేసిన బాధితురాలు!
సత్యవేడు ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు - వీడియోలు రిలీజ్ చేసిన బాధితురాలు!
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ విగ్రహానికి నేత్రాలంకరణ పూర్తి, ఈసారి ఎత్తు ఎంతంటే
ఖైరతాబాద్ గణేష్ విగ్రహానికి నేత్రాలంకరణ పూర్తి, ఈసారి ఎత్తు ఎంతంటే
Virat Kohli : రూ. 66 కోట్లు టాక్స్ కట్టిన విరాట్ కోహ్లీ - దరి దాపుల్లో మరో క్రికెటర్ లేడుగా !
రూ. 66 కోట్లు టాక్స్ కట్టిన విరాట్ కోహ్లీ - దరి దాపుల్లో మరో క్రికెటర్ లేడుగా !
Goat Vs OG: విజయ్ 'ది గోట్'కి సీక్వెల్... పవన్ కల్యాణ్ టైటిల్ మీద కన్నేసిన దళపతి
విజయ్ 'ది గోట్'కి సీక్వెల్... పవన్ కల్యాణ్ టైటిల్ మీద కన్నేసిన దళపతి
Bhagyashri Borse: ఇప్పుడే కదా జర్నీ మొదలైంది అంటోన్న మరాఠి ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే..
ఇప్పుడే కదా జర్నీ మొదలైంది అంటోన్న మరాఠి ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే..
Vijayawada Floods: హృదయ విదారకం - నడుము లోతు నీటిలో మృతదేహం తరలింపు, విజయవాడలో కన్నీటి దృశ్యాలు
హృదయ విదారకం - నడుము లోతు నీటిలో మృతదేహం తరలింపు, విజయవాడలో కన్నీటి దృశ్యాలు
Embed widget