Varupula Raja: ఏ క్షణంలోనైనా టీడీపీ నేత వరుపుల రాజా అరెస్ట్, డీసీసీబీ మాజీ చైర్మన్ కోసం వెతుకుతున్న సీఐడీ !
Varupula Raja: గంటలు గడిచినా వరుపుల రాజా లేకపోవడంతో అధికారులు టీడీపీ నేతను అరెస్ట్ చేయలేదు. చివరగా వరుపుల రాజా పరారయ్యారని పోలీసులు తెలిపారు.
ప్రత్తిపాడు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి, డీసీసీబీ మాజీ చైర్మన్ వరుపుల రాజా నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గండేపల్లి సొసైటీలో రుణాల అక్రమాల కేసులో టీడీపీ నేత వరుపుల రాజాను అరెస్ట్ చేసేందుకు సీఐడీ అధికారులు శుక్రవారం నుంచి ప్రయత్నిస్తునన్నారు. నిన్న రాజా ఇంటికి సీఐడీ అధికారులు వెళ్లగా, టీడీపీ నాయకులకు.. అధికారులకు మధ్య అయిదు గంటలపాటు హైడ్రామా నడిచింది. సీఐడీ దర్యాప్తు అధికారి రమేష్ నేతృత్వంలోని బృందం రాజా నివాసం వద్దకు చేరుకొని అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన క్రమంలో ఈ పరిస్తితి తలెత్తింది. గంటలు గడిచినా వరుపుల రాజా లేకపోవడంతో అధికారులు టీడీపీ నేతను అరెస్ట్ చేయలేదు. చివరగా వరుపుల రాజా పరారయ్యారని పోలీసులు తెలిపారు.
ఎలాగైనా అరెస్టు చేయాలని సీఐడీ అధికారుల యత్నాలు
వరుపుల రాజాను శనివారం ఎలాగైనా అరెస్ట్ చేయాలని సీఐడీ అధికారులు, అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టీడీపీ నేతను అదుపులోకి తీసుకోవడానికి సీఐడీ అధికారులు శుక్రవారం వచ్చారు. విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎస్‌విఎస్ వర్మ, యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో పార్టీ నేతలు రాజా నివాసానికి చేరుకుని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. గండేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయిందని దీనిపై విచారణ చేయనున్నట్లు సీఐడీ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ కేసులో హైకోర్టు రాజా అరెస్ట్ పై స్టే ఇచ్చిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
రాజా తల్లి, సొదరిలను విచారించిన అధికారులు..
రాజా నివాసం లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన సీఐడీ అధికారులను వెళ్లనీయకుండా అడ్డుకోవడంతో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. స్థానిక పోలీసులతో అదనపు బలగాల సహాయాన్ని సీఐడీ అధికారులు తీసుకున్నా ఫలితం లేకపోయింది. రాజమహేంద్రవరం నుంచి సీఐడీ ఏఎస్సీ వి. గోపాలకృష్ణ, డీఎస్పీ రామకృష్ణ, రమేష్ బాబు, గోపాలకృష్ణ పోలీసు శాఖ నుంచి పెద్దాపురం డీఎస్సీ అప్పారావు. సీఐ కిషోర్ బాబు, సన్యాసిరావు, ఎస్సైలు సుధాకర్, రవికుమార్ తదిత రులు చేరుకుని ప్రయత్నించినా ఇంట్లోకి వెళ్లలేకపోయారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అక్కడకు చేరుకుని పార్టీ నాయకులతో కలిసి పోలీసులు ప్రయత్నాన్ని అడ్డు కున్నారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రాజా తరపు న్యాయవాదులతో కలిసి సీఐడీ అధికారులతో మాట్లాడారు. నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడమేమిటని ప్రశ్నించారు. అరెస్టుకే సీఐడీ అధికారులు మొగ్గుచూపడంతో వాగ్వాదానికి దిగారు.
రాత్రి 9.30 వరకు హైడ్రామా..
రాజా కుటుంబసభ్యులు రాత్రి తలుపులు తెరవగా.. సీఐడీ డీఎస్పీ రామకృష్ణ మురళీ మోహన్ తదితరులు సోదాలు చేశారు. ఇంట్లో రాజా తల్లి. ఆమె సోదరి మాత్రమే ఉండడంతో వారిని విచారించారు. రాజా సమీప బంధువు తోట నగేష్, తదితరులను అధికారులు ప్రశ్నించారు. ఉత్కంఠ పరిణామాల క్రమంలో అప్పటికే ఆనారో గ్యంతో బాధపడుతున్న రాజా తల్లి మరింత అస్వ స్థతకు గురవగా వైద్యులు చికిత్స అందించారు. ఆ సమయంలో ఇంట్లో రాజా లేకపోవడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.