అన్వేషించండి

Chandrababu Open Letter: నేను జైలులో లేను, ఎగసిపడుతున్న ప్రజా చైతన్యంలో ఉన్నాను: చంద్ర‌బాబు బ‌హిరంగ లేఖ

AP Skill Development Case: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు ప్ర‌జ‌ల‌కు బహిరంగ లేఖ రాశారు.

Chandrababu open letter to people from Rajahmundry Central Jail

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు ప్ర‌జ‌ల‌కు బహిరంగ లేఖ రాశారు. ‘నేను జైలులో లేను.. ప్ర‌జ‌ల హృద‌యాల్లో ఉన్నాను. ప్రజ‌ల నుంచి న‌న్ను ఒక్క క్ష‌ణం కూడా ఎవ్వ‌రూ దూరం చేయ‌లేరు. 45 ఏళ్లుగా నేను కాపాడుకుంటూ వ‌స్తున్న విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త‌ని చెరిపేయ‌లేరు. ఆల‌స్య‌మైనా న్యాయం గెలుస్తుంది.. నేను త్వ‌ర‌లో బ‌య‌ట‌కొస్తాను. ప్ర‌జ‌ల కోసం, రాష్ట్ర ప్ర‌గ‌తి కోసం రెట్టించిన ఉత్సాహంతో ప‌నిచేస్తాను’ అంటూ తన లేఖ ద్వారా అంద‌రికీ ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపారు.

చంద్ర‌బాబు బ‌హిరంగ లేఖలో ఏముందంటే..
‘ఓట‌మి భయంతో నన్ను జైలు గోడ‌ల మ‌ధ్య బంధించి ప్ర‌జ‌ల‌కి దూరం చేశామ‌నుకుంటున్నారు. నేను మీ మధ్య తిరుగుతూ ఉండకపోవ‌చ్చు. కానీ అభివృద్ధి రూపంలో ప్ర‌తీ చోటా క‌నిపిస్తూనే ఉంటాను. సంక్షేమం పేరు వినిపించిన ప్ర‌తీసారి నేను  గుర్తుకొస్తూనే ఉంటాను. ప్ర‌జ‌ల్నించి ఒక్క రోజు కాదు కదా!, ఒక్క క్ష‌ణం కూడా న‌న్ను దూరం చేయ‌లేరు. కుట్ర‌ల‌తో నాపై అవినీతి ముద్ర వేయాల‌ని ప్ర‌య‌త్నించారు కానీ.. నేను న‌మ్మిన విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త‌ని ఎన్న‌డూ చెరిపేయ‌లేరు. ఈ చీక‌ట్లు తాత్కాలిక‌మే. సత్యం అనే సూర్యుడి ముందు కారుమ‌బ్బులు వీడిపోతాయి. సంకెళ్లు నా సంకల్పాన్ని బంధించలేవు. జైలుగోడ‌లు నా ఆత్మ‌విశ్వాసాన్ని దెబ్బతీయలేవు.  జైలు ఊచ‌లు న‌న్ను ప్ర‌జ‌ల్నించి దూరం చేయ‌లేవు. నేను తప్పు చేయను, చేయనివ్వను.

 ఈ దసరాకి పూర్తి స్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తానని  రాజ‌మ‌హేంద్ర‌వ‌రం మహానాడులో ప్రకటించాను. అదే రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జైలులో న‌న్ను ఖైదు చేశారు. త్వరలో బయటకొచ్చి పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుద‌ల చేస్తాను. నా ప్ర‌జ‌ల కోసం, వారి పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాను. ఎప్పుడూ బ‌య‌ట‌కు రాని నంద‌మూరి తార‌క‌రామారావు బిడ్డ, నా భార్య భువ‌నేశ్వ‌రిని  నేను అందుబాటులో లేని ఈ కష్టకాలంలో ప్ర‌జ‌ల్లోకి వెళ్లి వారి త‌ర‌ఫున పోరాడాల‌ని నేను కోరాను. ఆమె అంగీక‌రించింది.  నా అక్ర‌మ అరెస్టుతో త‌ల్ల‌డిల్లి మృతి చెందిన వారి కుటుంబాల‌ని ప‌రామ‌ర్శించి, అరాచ‌క‌ పాల‌నను ఎండ‌గ‌ట్ట‌డానికి 'నిజం గెల‌వాలి' అంటూ మీ ముందుకు వ‌స్తోంది.

జ‌న‌మే నా బ‌లం, జనమే నా ధైర్యం. దేశ‌విదేశాల‌లో నా కోసం రోడ్డెక్కిన ప్ర‌జ‌లు వివిధ రూపాల్లో మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. నా క్షేమం కోసం కుల‌,మ‌త‌,ప్రాంతాల‌కు అతీతంగా మీరు చేసిన ప్రార్థ‌న‌లు ఫ‌లిస్తాయి. న్యాయం ఆల‌స్యం అవ్వొచ్చునేమో కానీ, అంతిమంగా గెలిచేది మాత్రం న్యాయ‌మే.  మీ అభిమానం, ఆశీస్సుల‌తో త్వ‌ర‌లోనే  బయటకి వ‌స్తాను. అంత‌వ‌ర‌కూ నియంత  పాల‌న‌పై శాంతియుత పోరాటం కొన‌సాగించండి. చెడు గెలిచినా నిల‌వ‌దు, మంచి తాత్కాలికంగా ఓడినట్లు కనిపించినా కాల‌ప‌రీక్ష‌లో గెలిచి తీరుతుంది . త్వ‌ర‌లోనే చెడుపై మంచి విజ‌యం సాధిస్తుంది. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అంటూ’ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జైలులోని స్నేహ బ్లాక్ నుంచి చంద్ర‌బాబు నాయుడు ప్రజలకు లేఖ రాశారు.
Chandrababu Open Letter: నేను జైలులో లేను, ఎగసిపడుతున్న ప్రజా చైతన్యంలో ఉన్నాను: చంద్ర‌బాబు బ‌హిరంగ లేఖ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Latest Weather Report: తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
Embed widget