Pawan Kalyan: నేను గుడ్డిగా బీజేపీకి వత్తాసు పలకను - ముస్లింలతో భేటీలో పవన్ కల్యాణ్
భారతదేశ నాయకుల కంటే సమాజం చాలా గొప్పదని అన్నారు. అందుకే దేశంలో 17 శాతం మైనార్టీలు స్వేచ్ఛగా బతకలేరని అన్నారు.
బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ ముస్లింలకు నచ్చదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. సీఎం జగన్ క్రిస్టియన్ కాబట్టి, ఆయన హిందువు కాదు కనుక ఆయన్ను నమ్మవచ్చని ముస్లిం సమాజం అనుకునే అవకాశం ఉందని అన్నారు. వారాహి విజయయాత్రలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ముస్లిం ప్రజా ప్రతినిధులను కలిశారు. కాకినాడలో వారితో సమావేశం నిర్వహించారు.
భారతదేశ నాయకుల కంటే సమాజం చాలా గొప్పదని అన్నారు. అందుకే దేశంలో 17 శాతం మైనార్టీలు స్వేచ్ఛగా బతకలేరని అన్నారు. దేశ సమాజం దుర్మార్గమయినదే అయితే మైనార్టీలు బతకలేరని అన్నారు. తాను హిందువునని, మీరంతా నా సోదరులు, నా ఆడపడుచులు అని అన్నారు. హిందువులకి ఎక్కువ చేసి, ఇతర మతస్తులను తక్కువగా తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. కౌలు రైతులకు అండగా నిలబడ్డ సమయంలో హిందూ రైతులకు ఎక్కువ సాయం, ముస్లింలకు పట్టించుకోకపోవడం లాంటిది చేయలేదని అన్నారు. అది తన వ్యక్తిత్వం అని అన్నారు.
బీజేపీతో పొత్తులో ఉన్నానని, ముస్లింలు తనతో ఉండకపోతే మీరే నష్టపోతారని చాలా ముస్లిం పెద్దలను కలిసిన సందర్భంలో చెప్పానని అన్నారు. మీరు మైనారిటీలు కాదని మెజారిటీగానే భావించాలని అన్నారు. ఎలాంటి అభద్రతా భావంతో ఉండొద్దని, గతసారి వైఎస్ఆర్ సీపీ వైపు నిలబడ్డ మీరంతా ఈసారి జనసేన వైపు నిలబడాలని కోరారు. తాను గుడ్డిగా బీజేపీగా వత్తాసు పలకబోనని అన్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial