Narayanaswamy Death: మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి కన్నుమూత
Ex minister Yerra Narayanaswamy passed Away: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి కన్నుమూశారు.
Yerra Narayanaswamy passed Away: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నాయకులు, పార్లమెంట్ మాజీ సభ్యులు, మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న నారాయణస్వామి భీమవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని మరికొద్ది సేపట్లో వారి స్వగ్రామమైన ఉండి మండలం ఉప్పులూరుకు తరలించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నారాయణస్వామి స్వగ్రామం ఉండి మండలం ఉప్పులూరు. ఆయన ఏప్రిల్ 30న 1931లో జన్మించారు. 1972లో నారాయణస్వామి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. తరువాత కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 1985, 1999లలో నారాయణ స్వామి రెండు పర్యాయాలు టీడీపీ పార్టీ నుంచి తాడేపల్లిగూడెం నుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994 – 1999 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ నేత నారాయణ స్వామి రాజ్యసభ్య సభ్యుడిగా సేవలు అందించారు. నారాయణ స్వామి మృతి పట్ల టీడీపీ తో పాటు ఇతర పార్టీల నేతలు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.