By: ABP Desam | Updated at : 24 Sep 2023 08:11 PM (IST)
సంఘీభావం తెలిపిన ఐటీ ఉద్యోగులతో నారా బ్రాహ్మణి
IT Employees Meetss Nara Brahmani :
రాజమహేంద్రవరం: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టును ఐటీ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ లో పలు కంపెనీల్లో పని చేస్తోన్న ఐటీ ఉద్యోగులు రాజమహేంద్రవరం వచ్చి నారా బ్రాహ్మణిని కలిశారు. చంద్రబాబు అరెస్టు పూర్తిగా అక్రమమని, ఒక విజనరీ లీడర్ ను జైలులో పెట్టడం చాలా బాధ కలిగిస్తోందన్నారు. హైదరాబాద్ ఐటీ రంగ ఉన్నతికి ఎంతో కృషి చేసి లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన చంద్రబాబు అరెస్టు కక్ష పూరిత చర్య అని ఐటీ ఉద్యోగులు ఆరోపించారు.
హోటల్ రూంలో దిగితే తాళం వేసిన పోలీసులు
చంద్రబాబు అరెస్టును ఏ ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారని.. తెలుగు జాతి కోసం, యువత కోసం శ్రమించిన నాయకుడు ఆయన అన్నారు. హైదరాబాద్ లో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులు రాజమహేంద్రవరం వస్తుంటే ఏపీ పోలీసులు అనేక ఆంక్షలు విధించి ఇబ్బంది పెట్టారని తెలిపారు. సొంత రాష్ట్రానికి వస్తుంటే అడ్డంకులు, కేసులు పెడతాం అనే బెదిరింపులు అర్థం కావడం లేదన్నారు. తమ ఫోన్లు కూడా పోలీసులు తీసుకున్నారని.. వాట్సాప్ చాటింగ్ కూడా చెక్ చేశారని హైదరాబాద్ నుంచి వచ్చిన ఆ ఉద్యోగులు తెలిపారు.
రాజమండ్రిలో హోటల్ రూంలో దిగితే పోలీసులు వచ్చి తమను రూంలో పెట్టి తాళాలు వేశారని తెలిపారు. అసలు ఏపీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. సైబరాబాద్ నిర్మాణంలో చంద్రబాబు చేసిన కృషిని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. 25 ఏళ్ల కిందట రాళ్లు, రప్పలతో ఉన్న ప్రాంతం నేడు ఈ స్థాయిలో అభివృద్ది చెంది లక్షల మందికి ఉపాధినిచ్చే కేంద్రంగా మారడం వెనుక ఉన్న చంద్రబాబు కృషి ఉందని ఉద్యోగులు నారా బ్రాహ్మణితో చెప్పారు.
అనంతరం నారా బ్మాహ్మణి మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకించి, తమకు మద్దతు తెలిపేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్న ఐటీ ఉద్యోగులపై ఆంక్షలు, బెదిరింపులు దారుణం అన్నారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వస్తున్న వాహనదారుల ఫోన్ లు చెక్ చేయడం, వారి చాట్ లు పరిశీలించడం షాక్ కు గురిచేసిందన్నారు. పోలీసులు పౌరుల వాట్సాప్ చాట్, మెస్సేజ్ లు చెక్ చేయడం వారి వ్యక్తి గత గోప్యత హక్కును హరించడమే అన్నారు. సామాన్య ప్రజల ఫోన్ లు చెక్ చేసే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. అసలు ఏ కారణంతో, హక్కుతో ఉద్యోగుల రాకపై ఆంక్షలు పెట్టారో చెప్పాలన్నారు. మీకు తెలిసి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా అని బ్రాహ్మణి అన్నారు. చంద్రబాబు కు సంఘీభావం తెలిపేందుకు అనేక వ్యయ ప్రయాసలు ఓర్చి, ప్రభుత్వ నిర్భందాలను దాటుకుని వచ్చిన ఉద్యోగులను చూసి తాను గర్వ పడుతున్నానంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు.
చంద్రబాబు ఈ కష్ట సమయాన్ని అధికమిస్తారని, త్వరలో జైలు నుంచి విడుదల అవుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సంక్షోభాలను అవకాశంగా మార్చుకునే పవర్ ఫుల్ లీడర్ చంద్రబాబు అన్నారు. రానున్న రోజుల్లో ఏపీ ప్రజలు ఓటు హక్కుతో ఈ ప్రభుత్వానికి బుద్దిచెప్పాలని కోరారు. ఆన్ లైన్ ద్వారా ఓటు నమోదు చేసుకోవడంతో పాటు... అక్రమంగా ఎవరూ తమ ఓట్లు తొలగించకుండా చూసుకోవాలని తనను కలిసిన ఉద్యోగులను బ్రాహ్మణి కోరారు.
APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా
APPSC Group-1: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా
AP Tenth: 'టెన్త్' విద్యార్థులకు అలర్ట్, వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు!
Breaking News Live Telugu Updates: కేసీఆర్ కోలుకోవడానికి నెలకుపైగా సమయం- హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు
Top Headlines Today: యశోదలో చేరిన మాజీ సీఎం కేసీఆర్- రేపటి నుంచి తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం
Revanth Reddy Resigns: రేవంత్ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్ లెటర్ అందజేత
KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం
Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
/body>