By: ABP Desam | Updated at : 13 Aug 2023 10:46 AM (IST)
పినిపే విశ్వరూప్
Pinepe Vishwaroop: అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీల జమ కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సీఎం పక్కన మోకాళ్లపై కూర్చుని ఫోటో దిగేందుకు యత్నించిన సంగతి తెలిసిందే. అయితే, మంత్రికి అవమానం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాతోపాటు కొన్ని ప్రధాన మీడియాల్లో దళిత మంత్రి విశ్వరూప్‌కు అవమానం జరిగిందన్న విమర్శలు వచ్చాయి. మీటింగ్‌లో స్టేజీ పై కూర్చునేందుకు కనీసం కుర్చీ కూడా వేయలేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ, జనసేన నేతలు దీన్ని బాగా హైలెట్ చేశారు. తాజాగా ఈ అంశంపై మంత్రి పినిపే విశ్వరూప్ స్పందించారు. అమలాపురం మండలం భట్నవిల్లిలోని తన ఇంటివద్ద శనివారం మంత్రి పినిపే విశ్వరూప్ విలేకరులతో మాట్లాడారు.
తనకు ఆ సభలో ఎలాంటి అగౌరవమూ కలగలేదని మంత్రి స్పష్టత ఇచ్చారు. తాను సంతోషంగానే ఉన్నానని, తన గౌరవానికి భంగం కలిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను కూర్చోవడం గానీ, ఇతరులు తనను కింద కూర్చోబెట్టడం కానీ జరగలేదని అన్నారు. తనకు అవమానం జరిగిందని చేస్తున్న ప్రచారంలో నిజం లేదని కొట్టిపారేశారు. సభ వేదికపై తాను మోకాళ్లపై కూర్చున్న తీరుపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు.
వారు ఫోటో దిగుతున్నప్పుడు తాను బయట ఉన్నానని.. ముఖ్యమంత్రి పిలిస్తేనే వేదికపైకి వెళ్లానని మంత్రి చెప్పారు. వెనకనున్న మహిళలకు అడ్డుగా ఉండొద్దనే ఉద్దేశంతోనే ఫొటో కోసం తాను మోకాళ్లపై కూర్చోవాల్సి వచ్చిందని వివరించారు. దళిత మంత్రిని అవమానించారని ప్రచారం చేయడం తగదని అన్నారు.
ఏబీపీ దేశంతో ఆయన మాట్లాడుతూ.. ‘‘సున్నా వడ్డీ జమ కార్యక్రమం సందర్భంగా గుర్తు కోసం తీస్తున్న ఫోటో అది. అక్కడ కుర్చీ లేకపోవడంతో ఓ సోదరి కుర్చీలో కూర్చోవాలంటూ లేచి నిల్చుంటే నేనే ఆమెను కూర్చోబెట్టాను. వెనుక ఉన్న సోదరీమణులు ఫోటోలో పడరేమోనని మోకాళ్లపై కూర్చునేందుకు ప్రయత్నించాను. కానీ ముఖ్యమంత్రి వద్దని వారించి కుర్చీ వేయాలని అక్కడున్నవారికి సూచించారు. కానీ సమయం మరింత వృధా అవుతుందని భావించి తానే కుర్చీ వద్దని కూర్చుని ఫోటో తీయించుకున్నామని మంత్రి విశ్వరూప్ తెలిపారు.
ఫ్లెక్సీల వివాదంలోనూ నిజం లేదని వెల్లడి
సీఎం జగన్ అమలాపురం పర్యటనలో భాగంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలోనూ మంత్రి పినిపే విశ్వరూప్ విమర్శలు ఎదుర్కొన్నారు. తన ఇద్దరు కుమారుల ఫ్లెక్సీల్లో తాను లేకపోవడం, తన ఫ్లెక్సీల్లో కుమారులు లేకపోవడం స్థానికంగా అనుమానాలకు తావిచ్చింది. వారి కుటుంబంలో కలహాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అయితే, తన పెద్ద కుమారుడు కృష్ణారెడ్డి, రెండో కుమారుడు శ్రీకాంత్ పేర్లతో అయిదేసి చొప్పున ఫ్లెక్సీలు వేయించామని, వాటన్నింటినీ తానే డిజైన్ చేయించానని మంత్రి చెప్పారు.
తన కుమారుల ఫ్లెక్సీల్లో తన పేరు, తన ఫ్లెక్సీల్లో కుమారుల పేర్లు లేకుండానే వేయించడం తాను తీసుకున్న నిర్ణయమేనని అన్నారు. దీని ఆసరాగా తీసుకుని కుటుంబంలో కలహాలు ఉన్నాయని ప్రచారం చేయడం బాధించిందని పినిపే విశ్వరూప్ అన్నారు.
Breaking News Live Telugu Updates: బాలాపూర్ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్ విల్లా లడ్డూ
Chandrababu Arrest: ప్రజల సొమ్ము దోచుకొని, దాచుకునే అలవాటు చంద్రబాబుకు లేదు - భువనేశ్వరి
Nara Bhuvaneshwari: రాజమండ్రిలో చర్చికి భువనేశ్వరి, బ్రహ్మణి - చంద్రబాబు కోసం ప్రత్యేక ప్రార్థనలు
AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్ 'స్పాట్ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం
krishi bank director: 22 ఏళ్ల తరువాత కృషి బ్యాంక్ డైరెక్టర్ కాగితాల శ్రీధర్ అరెస్ట్
TS Cabinet Agenda : ఎన్నికల షెడ్యూల్ రాక ముందే కొత్త పథకాలు - కేబినెట్ భేటీలో కేసీఆర్ సంచలనాలు ఖాయమా ?
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
Bigg Boss Season 7 Telugu: అరె ఏంట్రా ఇది - కన్నీళ్లతో గ్లాసు నింపాలట, కింద పడి మరీ ఏడ్చేసిన పల్లవి ప్రశాంత్
Crocodile: హైదరాబాద్ లో నాలాలో కొట్టుకువచ్చిన మొసలి, స్థానికుల భయాందోళన
/body>