అన్వేషించండి

Weather News; వణికిస్తోన్న చలి పులి.. అల్పపీడన ప్రభావంతో తగ్గిన ఉష్ణోగ్రతలు..

Weather In Godavari Districts: బంగాళాఖాతంలో కొన‌సాగుతోన్న అల్ప‌పీడ‌న ప్ర‌భావంతో చ‌లితీవ్ర‌త పెరిగింది. గ‌త 4 రోజులుగా మేఘావృతం అయ్యి తీరం వెంబ‌డి ఈదురుగాలులు వీస్తుండ‌డంతో ఈప‌రిస్థితి త‌లెత్తింది..

Weather Latest Update: ఏజెన్సీ ప్రాంతాల్లోనే కాదు తీరప్రాంతాల్లోనూ చలిపులి పంజా విసురుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి వీస్తోన్న ఈదురుగాలలకు ఈ చలి తీవ్రత మరింత పెరిగింది. దీంతో ఉభయగోదావరి జిల్లాల్లో చలితీవ్రత మరింత పెరిగింది. ఆకాశం పూర్తిగా మేఘావృతంగా మారి గత నాలుగు రోజులుగా చెదురుమొదురు జల్లులు కురుస్తుండం ఓ వైపు తీరం వెంబడి వీస్తున్న బలమైన ఈదురు గాలులు మరోవైపు ప్రజలు చలితో వణికిపోతున్నారు. పగటిపూటే చలి తీవ్రత బాగా పెరిగి ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు మరింత ఇబ్బందులు పడుతుండగా అల్పపీడన ప్రభావంతోనే చలితీవ్రత బాగా పెరిగిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు..

గత నాలులు రోజులుగా పెరిగిన చలితీవ్రత..
ఉభయగోదావరి జిల్లాలో ఇప్పుడు చలివణికిస్తోంది. గత వారం రోజులుగా మబ్బులతో కూడిన వాతావరణం ఉండగా నాలుగు రోజులుగా అయితే ఆకాశం పూర్తిగా మేఘావృతమయ్యి సూర్యుడు కనిపించని పరిస్థితి తలెత్తింది. తీరగ్రామాల్లో అయితే పూర్తిగా మబ్బులుతో కూడిన వాతావరణంతో చాలా ప్రాంతాల్లో అయితే ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ చిరుజల్లులు కురుస్తూనే ఉంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఈదురుగాలుల ప్రభావానికి రాత్రిపూట 20 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుండగా చలితీవ్రతకు వణికిపోతున్నారు. 

Also Read: పార్శిల్‌లో డెడ్‌బాడీ-షాక్ తిన్న మహిళ- పశ్చిమగోదావరిలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత నాలుగు రోజులుగా ఉత్తర కోస్తాలో వాతావరణం పూర్తిగా చల్లబడిరది. ఇవాళ రేపు కోస్తా తీరం వెంబడి వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఇపపటికే హెచ్చరించింది. తీవ్ర అల్పపీడనం వాయువ్యదిశగా కదలి ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరం వైపు వెళ్లి... తరువాత ఉత్తరం వైపుగా దాని గమనం మార్చుకుంటుందని చెబుతున్నారు. దీంతో తీర గ్రామాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తుండడంతో పగటిపూట ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. 20 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. ఈక్రమంలోనే చలితీవ్రత బాగా పెరిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

తీరం వెంబ‌డి ఎగిసి ప‌డుతున్న అల‌లు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తీరం వెంబ‌డి అల‌లు ఎగిసి ప‌డుతున్నాయి. కెర‌టాల ధాటికి తీరం కోత‌కు గుర‌వుతోంది. ఈక్ర‌మంలోనే కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండ‌ల ప‌రిధిలోని ఉప్పాడ‌, కొనాల‌పేట త‌దిత‌ర ప్రాంతాల్లో తీరం కోత‌కు గుర‌వుతోంది. అదేవిధంగా ఓడ‌ల‌రేవు, అంత‌ర్వేది త‌దిత‌ర ప్రాంతాల్లో స‌ముద్రం ముందుకు చొచ్చుకు వ‌చ్చి రాకాసి కెర‌టాల ధాటికితీరం కోత‌కు గుర‌వుతోంది.

Also Read: కోస్తాజిల్లాల్లో గ్రామాల్లో నివురుగప్పిన నిప్పులా పాత కక్షలు-పెరిగిపోతున్న హత్యోదంతాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Costly Weddings: పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
Embed widget