అన్వేషించండి
Advertisement
Kakinada: విషాదాన్ని నింపిన సరదా, కారు డోర్ లాక్ కావడంతో ఊపిరాడక బాలిక మృతి
ఆడుకుంటూ పార్కింగ్ చేసిన కారు డోరు తీసుకుని వెళ్లిన చిన్నారి బయటకు వచ్చే మార్గం తెలీక ఊపిరి ఆడక మృతి చెందిన సంఘటన విషాదాన్ని నింపింది.
చిన్నారి ఆయువు తీసిన కారు.. పార్కింగ్ చేసిన కారులో ఊపిరాడక చిన్నారి మృతి...
సరదాగా ఆడుకుంటూ పార్కింగ్ చేసిన కారు డోరు తీసుకుని వెళ్లిన చిన్నారి బయటకు వచ్చే మార్గం తెలియకపోవడంతో ఊపిరి ఆడక మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన కాకినాడ జిల్లాలోని మండలం కోలంకలో చోటుచేసుకుంది.
కాజులురు మండలం కోలంకలో ఘోరం జరిగింది. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలిక తొగరు అఖిలాండేశ్వరి(8) ఆడుకుంటూ ఇంటి దగ్గరల్లో పార్క్ చేసిన కారులోకి వెళ్లి డోర్ వేసుకుంది. కాసేపు కారులోనే ఆదుకున్న పాపకు బయటకు ఎలా రావాలో తెలియలేదు. ఈ క్రమంలోనే కారులో ఎక్కువ సేపు ఉండిపోయిన చిన్నారి అఖిలాండేశ్వరికు కారులో ఆక్సిజన్ సరఫరా అవకపోవడంతో తో స్పృహ కోల్పోయింది. మధ్యాహ్నం ఆడుకుంటూ కారులోకి వెళ్లిన పాప సాయంత్రం వరకు అందులోనే ఉండిపోయింది. ఇంటి దగ్గర్లోనే ఆడుకుంటున్న కూతురు చాలా సేపటి నుంచి కనిపించక పోవడంతో కంగారుపడిన తల్లి, కుటుంబ సభ్యులు చుట్టుపక్కలా మొత్తం గాలించారు. ఇంటి పక్కనే పార్కు చేసిన కారులో పాప ఉన్న ఆనవాళ్లు కనిపించడంతో కారు డోరు తీసి చూసేసరికి కారులో కొన ఊపిరితో అల్లాడిపోతున్న బాలికను గుర్తించిన స్థానికులు హుటాహుటిన యానాం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
కూలి పనులు చేసుకుని పిల్లల్ని పోషించుకుంటూ...
కారులో ఊపిరి ఆడక మృత్యువాత పడిన చిన్నారి తల్లి తొగరు ఆదిలక్ష్మి సమీపంలోని ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. భర్త ఏడాది కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. పదేళ్ల కుమారుడు, ఎనిమిదేళ్ల అఖిలాండేశ్వరి పిల్లలు వీరికి ఉండగా వారిని ఒక్క రెక్కల కష్టం మీదే పోషించుకుంటూ ఉంది. కుమార్తె చిన్నారి అఖిలండేశ్వరి మరణంతో ఆదిలక్ష్మి కన్నీరు మున్నీరు గా విలపించింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
కారు పార్కు చేస్తున్నారా.. లాక్ వేయడం మర్చిపోకండి...
సాధారణంగా పిల్లలు కార్లు అంటే చాలా ఇష్ట పడుతుంటారు. కారులో ఎక్కి ఆడుకోవడం మరి ఎక్కువగా ఇష్టాన్ని కనపరుస్తుంటారు. ఈ నేపథ్యంలోనే గతంలో కారులో ఇరుక్కుని ఊపిరాడక అనేకమంది చిన్నారులు మృత్యువాత పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అసలే వేసవికాలం, స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో పిల్లలంతా ఇళ్ల వద్దే ఉంటూ ఎక్కువ సమయం ఆడుకునేందుకు ఆసక్తిని కనపరుస్తుంటారు. కారును పార్కు చేసే సమయంలో తప్పనిసరిగా కారు డోర్ లాక్ పడిందా లేదా అన్నది సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కారు డోర్ తీసుకుని లోపలికి వెళ్లడం తెలిసిన చిన్నారులకు చాలామందికి బయటపడే మార్గం తెలియక మృత్యువాత పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి అంటున్నారు.
అన్ని డోర్లు పూర్తిగా మూసేసిన క్రమంలో కారులో ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో పాటు ఎండవేడికి పూర్తిగా ఆక్సిజన్ లభించదని, ఈ క్రమంలోనే ఊపిరాడక చిన్నారులు మృత్యువాత పడుతున్న సందర్భాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా కారు పార్క్ చేసే సమయంలో కారు విండో గ్లాసులను మొత్తం ఎత్తేయకుండా కొంచెం గ్యాప్ ఉంచేలా చూసుకోవడం ద్వారా కారులో ఆక్సిజన్ కొంచెం మోతాదులో ఉంటుందని చెబుతున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
నిజామాబాద్
పాలిటిక్స్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement