News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bhuvaneshwari Mulakat Application Rejected: చంద్రబాబుతో భువనేశ్వరి ములాఖత్‌ నిరాకరణ - కారణం వెల్లడించిన రాజమండ్రి జైలు అధికారులు

Bhuvaneshwari Mulakat Application Rejected: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సీఎం చంద్రబాబును కలిసేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరికి అనుమతి లభించలేదు.

FOLLOW US: 
Share:

Bhuvaneshwari Mulakat Application Rejected: : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సీఎం చంద్రబాబును కలిసేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరికి అనుమతి లభించలేదు. తన భర్త చంద్రబాబును ఇటీవల కలిసిన భువనేశ్వరి మరోసారి ములాఖత్ అయ్యేందుకు దరఖాస్తు చేసుకోగా, జైలు అధికారులు తిరస్కరించారు. వారానికి మూడు సార్లు ములాఖత్‍కు అవకాశం ఉన్నప్పటికీ అధికారులు తిరస్కరించారని నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై రాజమండ్రి జైలులో ములాఖత్ పై జైళ్ల శాఖ స్పష్టత ఇచ్చింది.

నారా భువనేశ్వరి ఆర్పీ నెంబర్ 7691 చంద్రబాబుతో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు రాజమండ్రి జైలులో ములాఖత్ అయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అయితే వారానికి రెండు ములాఖత్ లు మాత్రమే ఉంటాయని, ఆ నిబంధన కారణంగానే భువనేశ్వరిని చంద్రబాబును కలిసేందుకు ఈ వారం మరోసారి అనుమతించలేమని పత్రికా ప్రకటనలో పేర్కొన్నార.

సాధారణంగా ఒక రిమాండ్ ముద్దాయికి ఒక వారంలో రెండు ములాఖత్ లకు మాత్రమే అవకాశం ఉంటుంది. అందులోనూ ఒక ములాఖత్ లో ముగ్గురు సందర్శకులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.

రిమాండ్ ముద్దాయి చంద్రబాబు సెప్టెంబర్ 11న రాజమండ్రి జైలుకు వచ్చారు. ఆయన ఈ వారం రెండు ములాఖత్ లు ఇప్పటికే వినయోగించుకున్నారు. సెప్టెంబర్ 12న భార్య నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు.  అనంతరం సెప్టెంబర్ 14న జరిగిన రెండో ములాఖత్ లో భాగంగా ఆయన తనయుడు నారా లోకేష్, వియ్యంకుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు చంద్రబాబును కలిసి పరామర్శించారు. దాంతో జైలులో ఓ ముద్దాయిని కలిసేందుకు వారంలో ఉన్న రెండు ములాఖత్ లు పూర్తయ్యాయి. 

కానీ, అత్యవసర కారణాలతో ఎవరైనా సందర్శకులు రిమాండ్ ముద్దాయిని కలిసి మాట్లాడటానికి లిఖిత పూర్వకంగా అభ్యర్థించాల్సినట్లయితే.. అందుకు గల అత్యవసర కారణాలను పేర్కొనాల్సి ఉంటుంది. ఆ కారణం వాస్తవమని నిర్ధారణ అయితే జైలు పర్యవేక్షణాధికారి విచాక్షణాధికారాలు ఉపయోగించి 3వ ములాఖత్ కు అనుమతి ఇవ్వనున్నారు. అయితే ప్రస్తుతం భువనేశ్వరి ఎలాంటి అత్యవసర కారణాలను తన దరఖాస్తులో ప్రస్తావించలేదు. ఆ కారణంగా నిబంధనల ప్రకారం మూడో ములాఖత్ లో నారా భువనేశ్వరికి రాజమండ్రి జైలు అధికారులు అనుమతి చేయలేకపోయారని కోస్తాంధ్ర ప్రాంతం, రాజమహేంద్రవరం జైళ్ల ఉప శాఖాధికారి శుక్రవారం ఓ పత్రికా ప్రకటనలో స్పష్టం చేశారు. 

ములాఖత్‌పై కూడా ఏపీ ప్రభుత్వం అవమానీయంగా వ్యవహరిస్తోందని భువనేశ్వరి ఆరోపించారు. నిబంధనల ప్రకారం ములాఖత్ ఇచ్చేందుకు అవకాశం ఉన్నా, మూడో ములాఖత్ కు ఛాన్స్ ఇవ్వలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్టు అయిన తర్వాత నుంచి లోకేష్, నారా భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉంటున్నారు. నిన్న రాత్రి లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో కొందరు ప్రముఖ నేతలతో భేటీ కోసం ఎదురు చూస్తున్నారు. 

మారిన సుపరింటెండెంట్‌
రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవుపై వెళ్లారు. నేటి నుంచి (సెప్టెంబర్ 15) రెండు రోజుల పాటు సెలవులో ఉండనున్నారు. భార్య అనారోగ్యంతో ఆసుపత్రిలో అడ్మిట్ కావడంతో  సెలవు పై వెళ్లారు.

Published at : 15 Sep 2023 06:14 PM (IST) Tags: ABP Desam breaking news

ఇవి కూడా చూడండి

Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరిని కలిసిన మాజీ ఎంపీ హర్ష కుమార్, చంద్రబాబు ఏ తప్పు చేయలేదని ధీమా!

Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరిని కలిసిన మాజీ ఎంపీ హర్ష కుమార్, చంద్రబాబు ఏ తప్పు చేయలేదని ధీమా!

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

Breaking News Live Telugu Updates: పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీసులు

Breaking News Live Telugu Updates: పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీసులు

Dussehra Holidays: స్కూల్స్, కాలేజీలకు దసరా సెలవులు ఖరారు, ఎన్నిరోజులంటే? ఏపీలో ఇలా!

Dussehra Holidays: స్కూల్స్, కాలేజీలకు దసరా సెలవులు ఖరారు, ఎన్నిరోజులంటే? ఏపీలో ఇలా!

Engineering Counselling: ఏపీలో ఇంజినీరింగ్‌ మూడో విడత కౌన్సెలింగ్‌ ఎత్తివేత, 'స్పాట్' ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

Engineering Counselling: ఏపీలో ఇంజినీరింగ్‌ మూడో విడత కౌన్సెలింగ్‌ ఎత్తివేత, 'స్పాట్' ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

టాప్ స్టోరీస్

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు ఆగ్రహం, సర్జన్స్ అసోసియేషన్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా

AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు ఆగ్రహం, సర్జన్స్ అసోసియేషన్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా

Minister KTR: పంప్ హౌస్ వల్ల నిర్మల్ వాసుల కల సాకారమైంది, మంత్రి కేటీఆర్

Minister KTR: పంప్ హౌస్ వల్ల నిర్మల్ వాసుల కల సాకారమైంది, మంత్రి కేటీఆర్

'డుంకీ', 'సలార్'లో దేన్ని ఎంచుకుంటారు? 'మాస్టర్' బ్యూటీ డేరింగ్ ఆన్సర్!

'డుంకీ', 'సలార్'లో దేన్ని ఎంచుకుంటారు? 'మాస్టర్' బ్యూటీ డేరింగ్ ఆన్సర్!