అన్వేషించండి

Hyena In Rajahmundry: రాజమండ్రి ప్రజలకు బిగ్ అలర్ట్‌- గుంపులుగా తిరకగకపోతే ప్రాణాలకే ప్రమాదం 

Rajahmundry News: రాజమండ్రి శివారుల్లో హైనా తిరుగుతోందన్న వార్త టెన్షన్ పెడుతోంది. మాజీ ఎంపీ హర్షకుమార్‌కు ఈ హైనా తారసపడినట్టు చెప్పుకుంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Hyena In Rajahmundry: ఎక్కడో అడవుల్లో ఉండాల్సిన హైనా (దుమ్ముల గొండి) జంతువు రాజమండ్రి శివార్లలో తిరుగుతున్నట్టు మాజీ ఎంపీ హర్షకమార్ తెలిపారు. స్వయంగా దాన్ని చూసినట్టు హర్షకుమార్ ABP దేశంతో చెప్పారు. తాను కూడా చూసినట్టు హర్షకుమార్ తనయుడు శ్రీ రాజ్ అంటున్నారు. 

గాడాల పాలచర్ల గ్రామ సమీపంలో హైనాను చూశానని.. తమ తోటలో పని చేసే సిబ్బంది తరచూ హైనా తిరగడం చూసారని శ్రీరాజ్‌ తెలిపారు. ఇదే విషయాన్ని కోరుకొండ DSP దృష్టికి తీసుకెళ్ళామని పరిసర గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. చిన్నపిల్లలు సాయంత్రం సమయాల్లో రోడ్డుపైకి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.
Hyena In Rajahmundry: రాజమండ్రి ప్రజలకు బిగ్ అలర్ట్‌- గుంపులుగా తిరకగకపోతే ప్రాణాలకే ప్రమాదం 

సాధారణంగా హైనాలు గుంపుగా తిరుగుతాయి. ఆయితే హర్షకుమార్ చెబుతున్నట్టు ఇక్కడ తిరుగుతోంది దారి తప్పి వచ్చిన ఒకటే హైనా నా లేక వేరే ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది. చాలా ఏళ్ళ క్రితం పొలాలకు, తోటలకు దగ్గర్లోని గ్రామాల్లో ఆరుబయట నిద్రపోతున్న పిల్లలపై హైనాలు దాడులు చేసిన ఘటనలను పాత తరం వాళ్ళు చెబుతుంటారు. దుమ్ముల గొండిగా పిలిచే ఈ జంతువులు చాలా బలమైన కోరలు కలిగి ఉంటాయి. చిరుత పులులకు సైతం ఇవంటే చాలా భయం. 

గతంలో గోదావరి జిల్లాలో సంచరించిన పెద్దపులి
ఏడాది క్రితం ఇదే గోదావరి ప్రాంతంలో ఒక ఒంటరి పెద్ద పులి సంచరించడం తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పెద్ద వార్తగా మారింది. అయితే అది ఎవరికీ ఎలాంటి హానీ కలిగించలేదు. ఛత్తీస్ ఘడ్ ప్రాంతం నుంచి తోడు వెతుక్కుంటూ వచ్చిన ఆ పులి తరువాత దట్టమైన అడవుల్లోకి వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడు హర్ష కుమార్ చూశానని చెబుతున్న  హైనా కూడా అలానే వచ్చిన వైల్డ్ యానిమల్ నా అన్నది తెలియాల్సి ఉంది .

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Game Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamCyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP DesamIndian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach | గోవాలో తెలుగు టూరిస్టును కొట్టి చంపేశారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Google Search Don'ts: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
Embed widget