అన్వేషించండి

Bettings on AP Election: తాహతుకు మించి బెట్టింగ్‌లు జోరు, తేడా కొడితే అంతే బేజారు!

సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి.మరో 24 గంటట్లో ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి.. ఈలోపు బెట్టింగ్‌ల జోరు మరింత తీవ్రం అయ్యింది.. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వెలువడ్డాక బెట్టింగ్‌లు మరింత బాగా పెరిగాయన్నది అంచనా..

Betting over AP Election Results 2024: సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి.. మరో 24 గంటట్లో ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి.. ఈలోపు బెట్టింగ్‌ల జోరు మరింత తీవ్రం అయ్యింది.. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వెలువడ్డాక బెట్టింగ్‌లు మరింత బాగా పెరిగాయన్నది విశ్లేషకుల అంచనా.. ఇంతవరకు బాగానే ఉన్నా ఉభయగోదావరి జిల్లాల్లో పందెం రాయుళ్లు జోరు చాలా ఎక్కువ అనే అంటుంటారు.. అయితే ఇప్పుడు ఇదే గోదావరి జిల్లాల కేంద్రంగా గెలుపు గుర్రాలపై పదిరెట్లు ఎక్కువ బెట్టింగ్‌లు వేయడం, గెలుపు కంటేకూడా మెజార్టీలపై పందేలు కాయడం మరింత ఎక్కువైంది.. గెలుపుపై ధీమాతో తమ స్థాయికి మించి బెట్టింగ్‌ల్లో పాల్గనడం మరింత చర్చకు దారితీస్తోంది..

అన్నింటా బెట్టింగ్‌లు జోరు..
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.. వస్తే ఎన్నిసీట్లుతో అధికారం చేజిక్కించుకుంటుంది.. ప్రతిపక్షంగా మిగలనున్న పార్టీకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశంఉంది.. ఇలా రాష్ట్ర స్థాయి నుంచి చివరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యనేతల గెలుపు టార్గెట్‌గా పందేలు జోరు సాగుతోంది. ముఖ్యంగా పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ ఎన్నిఓట్లు మెజార్టీతో గెలువబోతున్నారు.. ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణంరాజు ఎన్ని ఓట్లు మెజార్టీతో గెలువబోతున్నారు. ఉమ్మడి తూర్పుగోదారి జిల్లాలో టీడీపీ ఎన్నిసీట్లు సాధిస్తుంది.. వైసీపీ గెలవబోయే సీట్లు ఎన్ని ఇలా అందు ఇందు అని కాదు అన్నింటా బెట్టింగ్‌లు వేసేలా బెట్టింగ్‌ బుకిలు ఆఫర్లుమీద ఆఫర్లు బెట్టింగ్‌ రాయుళ్లు ముందు ఉంచుతున్నారు. 

పదిరెట్లు హెచ్చుతో కూడా పందేలా..
రూపాయికి పది రూపాయలు... వందకు వెయ్యి.. వెయ్యకు పదివేలు... ఇలా చాలా ప్రాంతాల్లో బెట్టింగ్‌లు జోరు కొనసాగుతోంది.. పవన్‌ కల్యాణ్‌కు ఓడిపోతే పదిరెట్లు హెచ్చు ఇస్తాం.. ఎవరైనా రెడీనా... అంటూ చాలా మంది బెట్టింగ్‌ రాయుళ్లు ముందుకు వస్తున్నారు. అయితే ఇందులో చాలా మంది వారి తాహతుకు మించి బెట్టింగ్‌లు వేయడం కనిపిస్తోంది. వీరి అదృష్టం బాగుండి వీరు అనుకున్న అభ్యర్ధి గెలిస్తే పరవాలేదు కానీ ఏమైనా తేడా కొడితే ఇక అంతే సంగతులని పలువురు అంటున్నారు. ఎందుకుంటే ఫ్రెస్టేజ్‌కు కొందరు అప్పుచేసి మరీ బెట్టింగ్‌లలో పాల్గంటున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనా తేడా కొడితే పరిస్థితి మరింత అప్పులు ఊబిలోకి కూరుకుపోవడం ఖాయమని బెట్టింగ్‌ రాయుళ్ల కుంటింబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోందట..

బెట్టింగ్‌ మోజులో జీవితాలు నాశనం..
బెట్టింగ్‌ల్లో పాల్గంటున్నవారు చాలా మంది యువకులే కావడం విశేషం.. ఇంట్లో తెలియకుండా డబ్బు తెచ్చి మరీ బెట్టింగ్‌ నిర్వాహకుల దోసెళ్లలో పోస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.. గత ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ తరపున బెట్టింగ్‌లు కాసిన చాలా మంది తీవ్రంగా నష్టపోయి చివరకు ఆత్మహత్యాయత్నాలు కూడా పాల్పడ్డారని వార్తలు వచ్చాయి.. ఇప్పుడు అంతకు మించి బెట్టింగ్‌లు జరుగుతున్నాయి.. ప్రతీ అంశాన్ని బెట్టింగ్‌ ప్రాతిపదికగా తీసుకుని బెట్టింగ్‌లకు పురికొల్పుతున్నారు బెట్టింగ్‌ నిర్వాహకులు.. పోలీసులు కూడా ఈ వ్యవహారంపై పెద్దగా పట్టించుకోకపోవడంతో బెట్టింగ్‌ల జోరు మరీ తీవ్ర రూపం దాల్చింది.. 

రేపు తేలనున్న భవితవ్యం.. 
ఎన్నికల్లో పోటీచేసి ఫలితాలకోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్న అభ్యర్ధులు ఓ పక్క అయితే బెట్టింగుల్లో లక్షలాది రూపాయాలు కాసి ఫలితాలు కోసం అంతకంటే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు బెట్టింగ్‌ రాయుళ్లు.. జూన్‌ నాలుగున ఎన్నికల ఫలితాలు తేలనున్న నేపథ్యంలో ఆతృతగా ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను చూసి కొంత ఉపశమనం పొందుతున్నారట.. అయితే అన్ని సర్వేలు ఒకేలా రాకపోగా కొన్ని సంస్థలు కూటమి వస్తుందని, మరికొన్ని సర్వే సంస్థలు వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పడంతో అసలు ఫలితం ఏమవుతుందో తెలియక ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.. 

టాప్ హెడ్ లైన్స్

ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget