News
News
X

న్యూడ్ వీడియోలతో వివాహితకు వేధింపులు - రంగంలోకి దిగిన దిశా పోలీసులు, ఇద్దరు వ్యక్తులు అరెస్టు

Disha Police Arrests Two Persons: మహిళను వేధించిన ఇద్దరు వ్యక్తులను దిశా పోలీసులు అరెస్టు చేశారు. నగ్న వీడియోతో వేధించడంపై కేసు నమోదు చేశారు. 

FOLLOW US: 

Disha Police Arrests Two Persons: నగ్న వీడియోతో మహిళను వేధిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆంధ్రప్రదేశ్ దిశా పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ మేరకు నిందితులిద్దరిపై చర్యలు తీసుకున్నారు. బాలికలు, యువతులు, మహిళలపై అఘాయిత్యాలు అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థే దిశా పోలీస్ సిస్టమ్. ఎన్నిసార్లు హెచ్చరించిన కొందరి ప్రవర్తనలో మార్పు రావడంలేదు. చివరికి జైలుకు వెళ్లి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.

దిశా చట్టం ప్రకారం కేసు నమోదు, అరెస్టు.. 
రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. తన వ్యక్తిగత అవసరాల కోసం హన్స కుమార్ అనే వ్యక్తిని డబ్బు అప్పుగా అడిగింది. మహిళ అత్యవసర స్థితిని ఆసరాగా చేసుకున్న హన్స కుమార్.. ఆ మహిళను నమ్మించి న్యూడ్ గా వీడియో చిత్రీకరించాడు. తర్వాత ఆ వీడియోను చూపించి వేధిస్తున్నాడని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తను నగ్నంగా ఉన్న ఆ వీడియోను మరో వ్యక్తికి పంపించి ఇద్దరూ కలిసి తనను వేధిస్తున్నారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. మహిళా బాధితురాలి ఫిర్యాదుపై దిశా పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుల వద్ద ఉన్న నగ్న వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత దిశ చట్టం ప్రకారం వేధింపులకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. 

భర్త నుంచి వేరుగా ఉంటున్న వివాహిత.. 
రాజమండ్రికి చెందిన ఓ మహిళకు వివాహం జరిగింది. పిల్లలు కూడా ఉన్నారు. వ్యక్తిగత, కుటుంబ కారణాల వల్ల భర్తతో విడిపోయింది. పిల్లలతో వేరుగా ఉంటోంది. కుటుంబ పోషణ కోసం ఓ దుకాణం నడిపిస్తోంది. అయితే వ్యాపార అవసరాల కోసం రాజమండ్రికి చెందిన హన్స కుమార్ జైన్ అనే వడ్డీ వ్యాపారి వద్ద అప్పు తీసుకుంటూ ఉండేది. ఇటీవల ఆ మహిళ మరోసారి హన్స కుమార్ జైన్ ను అప్పు అడిగింది. అయితే ఈ సారి అతను ఎక్కువ వడ్డీ అవుతుందని చెప్పాడు. ఆ వడ్డీకి  ఒప్పుకుంటేనే అప్పు తీసుకోవాలని బదులిచ్చాడు. వడ్డీ భరించలేక పోతే తనతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడాలని, గెస్ట్ హౌస్‌కు రావాలని ఆ మహిళపై ఒత్తిడి పెంచాడు. డబ్బు అవసరం ఎక్కువగా ఉండటం, కుటుంబ పోషణకు డబ్బు అవసరం కావడంతో ఆమెకు మరో దారి లేక అతనితో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడింది. 

వీడియో కాల్ రికార్డింగ్.. 
మహిళ అసహాయతను ఆసరాగా తీసుకున్న హన్స కుమార్ జైన్.. స్క్రీన్ రికార్డింగ్ సాయంతో ఫోన్ లో కొన్ని అసభ్య వీడియోలు రికార్డు చేశాడు. మహిళ నగ్న వీడియోను విజయవాడలోని కానూరులో ఉంటున్న అతని బంధువు చందు చూశాడు. ఆ వీడియోను తన ఫోన్, ల్యాప్ టాప్ లోకి కాపీ చేసుకున్నాడు. ఆ వీడియోను అశ్లీల సైట్లలోకి అప్ లోడ్ చేసి, వాటి లింక్ ను బంధువులకు పంపిస్తానని చందు అనే వ్యక్తి ఆ మహిళను బెదిరించడం ప్రారంభించాడు. వీడియో స్క్రీన్ షాట్ ను తీసి బాధితురాలితో పాటు తన వ్యాపార భాగస్వామికి కూడా పంపించాడు. వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె భరించలేకపోయింది. మచిలీ పట్నంలోని పోలీసులకు ఈ మేరకు వారిపై ఫిర్యాదు చేసింది. మచిలీ పట్నం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దానిని మహిళా పోలీసు స్టేషన్ కు బదిలీ చేశారు. రాజమహేంద్రవరానికి చెందిన వడ్డీ వ్యాపారి హన్స కుమార్ జైన్, విజయవాడ కానూరుకు చెందిన చందును పోలీసులు అరెస్టు చేశారు.

Published at : 19 Aug 2022 10:14 AM (IST) Tags: AP Latest Crime News Disha Police Arrests Two Persons Machiipatnam Latest Crime News Two People Harassed A Woman With Nude Video Man Harrased Woman

సంబంధిత కథనాలు

Minister Venu Gopala Krishna : వైద్య విద్యార్థులకు వైఎస్ఆర్ స్ఫూర్తి, ఎన్టీఆర్ ను కించపర్చలేదు-  మంత్రి చెల్లుబోయిన

Minister Venu Gopala Krishna : వైద్య విద్యార్థులకు వైఎస్ఆర్ స్ఫూర్తి, ఎన్టీఆర్ ను కించపర్చలేదు- మంత్రి చెల్లుబోయిన

Kakinada Crime : ప్రాణం తీసిన వివాహేతర సంబంధం, ప్రియురాలి భర్తను హత్య చేసిన ప్రియుడు

Kakinada Crime : ప్రాణం తీసిన వివాహేతర సంబంధం, ప్రియురాలి భర్తను హత్య చేసిన ప్రియుడు

Rains In AP Telangana: ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, IMD ఎల్లో అలర్ట్

Rains In AP Telangana: ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, IMD ఎల్లో అలర్ట్

Bendapudi Govt School : బెండపూడి ఇంగ్లీష్ ఆస్ట్రేలియా వరకు, బోధనా విధానాన్ని పరిశీలించిన ఆస్ట్రేలియన్ టీచర్

Bendapudi Govt School : బెండపూడి ఇంగ్లీష్ ఆస్ట్రేలియా వరకు, బోధనా విధానాన్ని పరిశీలించిన ఆస్ట్రేలియన్ టీచర్

East Godavari News : రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ ల హల్ చల్, రాత్రుళ్లు ఒంటరిగా బయటకు వెళ్తే అంతే!

East Godavari News : రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ ల హల్ చల్, రాత్రుళ్లు ఒంటరిగా బయటకు వెళ్తే అంతే!

టాప్ స్టోరీస్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు