Narayana On Amalapuram: అమలాపురం విధ్వంసం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం
అమలాపురం ఘటన ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనం అంటున్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. జగన్ ఊగిసలాట ధోరణి కారణంగానే ప్రజాగ్రహం పెల్లుబికిందన్నారు.
![Narayana On Amalapuram: అమలాపురం విధ్వంసం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం CPI National Secretary Narayana Comment On Amalapuram Incident Narayana On Amalapuram: అమలాపురం విధ్వంసం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/25/a3bf08749a07f7adcab495ef507807c8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కోనసీమ జిల్లాకు ముందే అంబేద్కర్ పేరు పెట్టి ఉంటే ఏ సమస్యలు ఉండేవి కావన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగానే కోనసీమ భగ్గుమందని మీడియాకు విడుదల చేసిన వీడియో సందేశంలో అభిప్రాయపడ్డారు.
జిల్లాల విభజిస్తున్న టైంలోనే అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్లు వచ్చినా పట్టించుకోలేదని ఆరోపించారు నారాయణ. ఈ డిమాండ్లను పట్టించుకోకుండా సీఎం జగన్ ఊగిసలాట ధోరణితో వ్యవహరించారన్నారు. అందుకే ఇప్పుడు కోనసీమ భగ్గుమందని కామెంట్ చేశారు. కోనసీమ పేరు విషయంలో ప్రారంభమైన ఘర్షణలు గాలివానలా మారాయని చెప్పారు నారాయణ. చివరకు మంత్రి విశ్వరూప్ గృహ దహనం వరకు వెళ్లిందని పేర్కొన్నారు.
ఈ ఘటనను కులపరమైన ఘర్షణగా చూడలేమన్నారు నారాయణ. ప్రభుత్వంపై వ్యతిరేకతకు ఉదారహణగా మారిందని కామెంట్ చేశారు. ప్రతిపక్షాలను లేకుండా చేయాలి చూస్తున్న ప్రభుత్వం విధానాలపై వ్యతిరేక ఉద్యమాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయాయని గుర్తు చేశారు.
జిల్లాల ఏర్పాటు తరుణంలోనే ఆ పేరు పెట్టి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు నారాయమ. ఆ సమయంలో మొండిగా వ్యహరించి అనంతర కాలంలో ఓట్లు, రాజకీయ ఎత్తుగడలతో సీఎం జగన్ సంకుచిత వైఖరిని ప్రదర్శించారని ఆరోపించారు.
ఏ విషయంలో అయినా స్పష్టత ప్రదర్శించే సీఎం ఇలా ఎందుకు చేశారని ప్రశ్నించారు నారాయణ. ఫలితంగా కోనసీమలో ఘర్షణలు వచ్చాయని.. మొత్తంగా చూస్తే ఇదంతా ప్రభుత్వ వ్యతిరేక కారణంగానే చోటు చేసుకుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆత్మస్తుతి పరనింద పనికి రాదని ప్రభుత్వానికి సూచించారు. ప్రజాస్వామ్య పద్దతిలో పాలన సాగిస్తే ఇటువంటి పరిస్థితి ఉండదన్నారు. ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)