Andhra Pradesh News: సజ్జల భార్గవ్, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
Case On YSRCP Leaders: వైసీపీ నేతలపై కేసుల సంఖ్య పెరిగిపోతోంది. అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల ఉచ్చు రోజు రోజుకు బిగుస్తోంది.
Andhra Pradesh Crime News: ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ పెట్టి ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేవాళ్లపై పెడుతున్న కేసుల లిస్టు పెరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వందల కేసులు నమోదు అయ్యాయి. ఇంకా నమోదు అవుతున్నాయి. ఇందులో సజ్జల భార్గవన్ రెడ్డిసహా కీలకమైన వారు ఉన్నారు. ఇప్పుడు వీళ్లపై మరో కేసు నమోదు అయింది.
పవన్ కల్యాణ్‌పై అసభ్యకరమైన రీతిలో విమర్శించే వీడియోలను సోషల్ మీడియాలో పెట్టాలని సిద్దవటం మండలానికి చెందిన జనసైనికులు కేసులు పెట్టారు. వర్రా రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఈ పోస్టులు పెట్టించారని సిద్ధవటం పోలీసులకు జనసేన కార్యకర్త వెంకటాద్రి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా కించపరిచేలా పోస్టులు పెట్టడమే కాకుండా అవి తొలగించాలంటే కూడా తమను దూషించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కులం పేరుతో దూషించారని వెల్లడించారు. భార్గవ్ రెడ్డి, వర్రా గ్యాంగ్ తనకు అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టారని డబ్బులు ఎర చూపించారని వాటికి లొంగకపోతే చంపేస్తామని కూడా బెదిరించినట్టు తెలిపారు. అందుకే వీళ్లపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఫిర్యాదులో వెల్లడించారు.
Also Read: సోషల్ మీడియాలో పెట్టే అసభ్యకర పోస్టులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు- కేసులు పెడితే తప్పేంటని ప్రశ్న
వారం పది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో అసభ్యకరమైన సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వారిపై పోలీసుల వేట కొనసాగుతోంది.ఇప్పటికే వందల కేసుల్లో చాలా మందిని అరెస్టు చేశారు. వైసీపీలో యాక్టివ్‌గా ఉండే వాళ్లు కూడా ఇందులో ఉన్నారు. అలాంటి వారిలో వర్రా రవీందర్ రెడ్డి ఉన్నారు. ఈయన భారతీ సిమెంట్స్‌లో జీవితాన్ని ప్రారంభించి జగన్‌పై అభిమానంతో వైసీపీలో పని చేశారు. అదే అభిమానంతో ప్రత్యర్థులపై జుగుప్సాకరమై భాషలో తిడుతూ చిక్కుల్లో పడ్డారు.
సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కేసులో అరెస్టు అయిన వర్రా రవీందర్‌రెడ్డి ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఆయనతోపాటు మరికొందరు కూడా అరెస్టు అయ్యారు. అయితే దీనంతటికి ప్రధాన కారణం సజ్జల భార్గవ్ రెడ్డి అంటూ అరెస్టు అయిన వారు చెబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కొన్నికీలక ఫిర్యాదుల్లో బాధితులు సజ్జల భార్గవన్ రెడ్డి పేరు యాడ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు రావడం, ఇప్పటికే అరెస్టు అయిన నిందితులు చెపుతున్న వివరాల ప్రకారం సజ్జల భార్గవన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరారయ్యారు. ప్రస్తుతం నడుస్తున్న కేసుల్లో నోటీసులు ఇస్తామన్నా అందుబాటు లేకుండా పోయారు. దీంతో సజ్జల భార్గవ్‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
ఓవైపు నడుస్తున్న కేసుల్లో నోటీసులు పంపిస్తున్నారు పోలీసులు. మరోవైపు ఇంకా బాధితులు వస్తూ తమ ఫిర్యాదుల్లో సజ్జల భార్గవ్ పేరుతోపాటు వైసీపీలో కీలకంగా ఉన్న నేతల పేర్లు పేర్కొంటున్నారు. దీంతో కేసుల సంఖ్య పెరుగుతూ వెళ్తోంది. దీంతో వైసీపీ వర్గాల్లో కలకలం రేగుతోంది.
Also Read: సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు